(2010 జనవరిలో  మొదటిసారి, 2016  ఫిబ్రవరిలో మరోసారి విరసం పునర్ముద్రించిన *ముప్పై ఏళ్ళ దండకారణ్య సాహితి సాంస్కృతోద్యమ చరిత్ర (1980 -2010) పుస్తకంలో అజ్ఞాత కథ గురించి దండకారణ్య రచయితలు రాశారు. దండకారణ్య సాహిత్య కళా ప్రచార వేదిక ఝన్కార్ గురించీ రాశారు. వియ్యుక్క కథా సంపుటాలు విడుదల అవుతున్న సందర్భంలో అజ్ఞాత విప్ల కథా వికాసాన్ని అర్థం చేసుకోడానికి పనికి వస్తుందని ఈ భాగాలను పునర్ముద్రిస్తున్నాం -వసంత మేఘం టీం)

దండకారణ్య సమాజంలో ప్రజల జీవితాలతో, ప్రకృతితో ముడిపడిన కథలు కోకొల్లలు. మనిషికీ-ప్రకృతికీ ఉండే సంబంధాలను, ఉత్పత్తి సంబంధాలను తెలిపే కథలు ప్రజలు ఎన్నైనా చెపుతారు. అలాగే సమాజ పరిణామం గురించి కూడా వారి కథలు వారికి ఉన్నాయి. నీళ్లలో నుంచే భూమి పుట్టిందని చెప్పుతారు. దేవుని అడుగుపడ్డ జాగా భూమిగా మారిందనీ, అలా నీటి మధ్య భూమి తేలిందనీ చెప్పుతారు. భూమి పుట్టుక గురించీ, మనిషి మరణం గురించీ పిడిపిడీలకూ వారసత్యంగా అందిస్తున్న కథలు ఉన్నాయి. పొద్దు గురించీ, చల్లని వెన్నెలలు కురిసే చంద్రుని గూర్చీ, గోరుగొయ్యలు (నాగలి) గురించీ, పిల్లల కోడి గురించీ, సప్త బుషుల గురించీ, విశ్వం గురించీ వాటిలో ఎంత “మిత్ ఉన్నప్పటికీ వారి కథలు వారికీ వున్నాయి. ఇవన్నీ మౌఖికంగానే తరతరాలకు అందివ్వబడుతున్నాయి. సాయంత్రం వేళలో లేదా రాత్రి వేళలో గోతులు వద్ద  చేరిన పిల్లలకు, యువకులకు ఆ నోటా, ఈనోటా ఇలాంటి కథలు చేరుతుంటాయి. ఈ సమాజంలో రుష్యాశ్రమాలు చోటు చేసుకోలేదు. సంపన్నుల పిల్లలకే విద్యాబుద్ధులు నేర్పే సంస్థలూ లేవు. సమాజంలోని మనుషుల మధ్య సంబంధాలు ఈ కథలను ఒకరి నుంచీ మరొకరికి చేరవేస్తున్నాయి. చరిత్రలో జరిగిన పలు యుద్ధాలను, ప్రజా తిరుగుబాట్లను, పడియోర్ను నేటి తరాలు తెలుసుకోవడానికి కూడా పాత తరాలను, తెలిసిన తరాలను కలుసుకోవడం మినహా మరో మార్గం లేదు. (బెత్సాహికులు కొందరు ఈ మధ్య రికార్డు చేసిన చరిత్రలు అందుబాటులో వున్నప్పటికీ) దండకారణ్య సమాజం గురించి తెలుసుకోవడానికి ప్రత్యక్షంగా ప్రజలను కలునుకోవడమే అత్యంత విశ్వసనీయమైన, ఉత్తమమైన మార్గంగా మిగిలింది. వారు తమకు తెలిసిన చరిత్రనంతా తమదైన శైలిలో కథలు-కథలుగా తెలుపుతుంటారు.

దండకారణ్య ఆదివాసీ సమాజంలో అక్షరాస్యతా శాతం చాలా తక్కువగా ఉంది. మహిళల్లో ఇది 30 శాతాన్ని మించకపోగా, పురుషులలో ఇది 40 శాతాన్ని మించలేదని ప్రభుత్వ లెక్కలు చూపుతున్నాయి. ఉద్యమ ప్రాంతాల్లో ఈ శాతాలు రెండంకెల లోపే ఉంటాయి. ప్రభుత్వం చూపే అక్షరాస్యత అంటే అక్షరాలను గుర్తుపట్టే “సర్వశిక్షా అభియాన్” పరిజ్ఞానమే తప్ప అంతకన్నా ఎక్కువేం గాదు. ఇలాంటి వెనుకబడిన సమాజంలో ప్రజలు తమ అనుభవాలను, తమ భాషలో తప్ప మరో భాషలో ఆలోచించలేని వాళ్లు తమ భాషకు ఒక లిపిలేని పరిస్థితులలో, వాటిని అక్షరాల్లోకి మార్చి ఇతరులకు అందించడం అంత తేలికైన విషయమేమీ గాదు.

ఏ సమాజంలోనైనా ఆ సమాజ అభివృద్ధిని అనుసరించే నూతన సాహితీ రూపాలు ఉనికిలోకి  వస్తాయి. అందుకే సాధారణంగా సాహిత్యాభివృద్ధి  సమాజాభివృద్ధి మీదా ఆధారపడి ఉంటుంది. అంటే   ఉత్పత్తి శక్తులూ సాహిత్యం సాధారణంగా ఒకదానితో పాటు మరొకటి జత కలిసి అభివృద్ధి చెందుతాయి. సాహిత్య రూపం సామాజిక పరిణామంతో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో చూస్తే ఇక్కడి సమాజంలోని సాహితీ రూపాలలో ఇంకా కథ, ఆ తర్వాత అభివృద్ధి చెందిన నవల లాంటివి చోటు చేసుకోలేదు. వీటికి విప్లవోద్యమమే శ్రీకారం చుట్టింది.

గత ముప్పై ఏళ్ల విప్లవోద్యమ చరిత్రలో అభివృద్ది చెందుతున్న సాంస్కృతికోద్యమంలో కథ, నవల, కవిత మొదలైన సాహితి రూపాలు ఉనికిలోకి వచ్చినప్పటికీ అవి  వేళ్ళ  మీద లెక్కపెట్టగలిగే సంఖ్యలోనే ఉన్నాయి తప్ప ఉద్యమస్థాయికి తగిన విధంగా లేవనే చెప్పుకోవాలి. విప్లవోద్యమం ప్రారంభమైన తర్వాత కొద్దిమంది ఔత్సాహికులు  తమకున్న ఆసక్తితో కథా రచనకు పూనుకోవడంతో ఆ కథలు వెలుగు చూశాయి. సుజాత, నిత్య, మైనా, ఫినెక్స్, జూరీ, ప్రవీణ్, లహర్, విశ్వం, తాయమ్మ కరుణ (దీప) మొదలైన వాళ్లు దండకారణ్య ప్రజల మధ్య పనిచేస్తూ వారి జీవితాలనూ, వారి పోరాట అనుభవాలనూ, వారితో గల అనుబంధాలనూ, అనుభూతులను వాస్తవ ఘటనల ఆధారంగా కథలలోకి మలిచారు. వీరే కాకుండా దండకారణ్య దళాలను, ప్రజా పోరాటాలను ఆధారం చేసుకొని అల్లం రాజయ్య, బిఎస్ రాములు, శనిగరం వెంకటేశ్వర్లు (సాహు) లాంటి కథా రచయితలు తెలుగులో కొన్ని రాశారు. వీటన్నింటిలో నుంచి ఎంపిక చేసిన వాటిని కలిపి 1990-91లలో “సంకెళ్లు విరుగుతున్న సవ్వడి” పేరుతో తెలుగులో ఒక కథా సంకలనాన్ని దండకారణ్య రచయితలు ప్రచురించారు. ఈ కథలను హిందీలోకి అనువదించి దీనినే హిందీలో ‘జమీన్ బంధన్  ముక్తి కే లియె” పేరుతో ప్రచురించారు. పాట, పీటో (వేసోడ్) నృత్యం, నాటకం  మొదలైన కళా రూపాల గురించి ఉన్న ప్రోత్సాహం,  శిక్షణ కథా రచన విషయంలో లేకపోవడంతో పాటు స్థానిక రచయితలు, కళాకారులతో ఏర్పడిన  చేతన నాట్య మంచ్ లో  అత్యదిక శాతం నిరక్షరాస్యులే కావడం, కథా సాహితీ రూపం గురించి వారికి అనుభవం లేకపోవడం, వారు జన్మతః పాటలో పుట్టి పెరిగిన వారే కావడం కథా రూపం అభివృద్ధి కాకపోవడానికి గల వస్తుగత పునాది అని చెప్పుకోవచ్చు. నిజానికి కథా రచనను ప్రోత్సహించాల్సిన అవసరం రోజు రోజుకూ పెరుగుతోంది. వర్తమాన పరిస్థితుల్లో తీవ్రమవుతున్న ప్రజాయుద్ధంలో ప్రజల జీవితాలతో ముడిపడిన అనేకానేక ఘటనలు రోజూ వెలుగులోకి వస్తున్నాయి. వాటిని  విశాల ప్రపంచం ముందు ఉంచాల్సిన అవసరం చాలా ఉంది. యుద్ధమే జీవితంగా జీవిస్తున్న ఇక్కడి ప్రజల అనుభవాలను కథలుగా మలచి అందివ్వగలిగినప్పుడు యుద్ధంలో మునిగిపోయి ఉన్న ఎక్కడి ప్రజలైనా వాటి గురించి తెలుసుకో గలుగుతారు. నేర్చుకోగలుగుతారు.

నవలల విషయానికి వస్తే ఇవి మరీ తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. సరిహద్దు, రాగో, ఆత్మకథాత్మక నవలయిన అడవి పుత్రిక, కొమురం భీం, నైనా నవలలతో పాటు ఉద్యమ అనుభవాలను తెలిపే ఈ అడవి మాదే’తో పాటు సల్వాజుడుంలో పీడితులైన ప్రజల దుర్భర పరిస్థితులను వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన జీవిత చిత్రణలు “పచ్చని బతుకులపై నిప్పై కురుస్తున్న రాజ్యం”, మండుతున్న గాయాలు కాగా పంజాబీ రచయిత సత్నాం దండకారణ్య పర్యటనకు వచ్చి ఇక్కడి పరిస్థితులతో జోడిస్తూ తన అనుభవాలను చెప్పిన జంగల్ నామా  లాంటివి ఇప్పటికి వెలుగు చూశాయి. వీటిలో తెలుగు మూలమైన రాగో, పంజాబీ మూలమైన జంగల్ నామా  హిందీ, బంగ్లాల్లోకి అనువాదం కాగా,   జంగల్ నామా మరాఠీ, ఇంగ్లీషు భాషలోకి కూడా మారింది. “పచ్చని బతుకులపై నిప్పై కురుస్తున్న రాజ్యం” హిందీలోకి అనువాదమైంది. సాధన, వనజ, పి.శంకర్, బి.డి.దమయంతి, సత్నామీ, ఆలూరి భుజంగరావు కలాల నుంచీ వెలువడిన ఈ రచనలు దండకారణ్య ప్రజల జీవితాలను, పరిస్థితులను బయటి ప్రపంచం ముందు ఉంచగలిగాయి.

విప్లవోద్యమాన్ని ప్రేమించే, అభిమానించే, దానిపట్ల సానుభూతిగా నైనా ఉండే కథా రచయితలు, నవలా రచయితలు దానితో పాలుపంచుకొని దాని అనుభవాలను లిపిబద్ధం చేయడానికి పూనుకోవలసిన అవసరం చాలా ఉంది. అలాంటి వారిని దండకారణ్య విప్లవోద్యమం ఆహ్వానిస్తోంది.

  జంకార్ పత్రిక :

దండకారణ్య సాంస్కృతికోద్యమ నిర్మాణంలో ‘జంకార్ *  పత్రిక ఒక సార్థకమైన భూమికను ఝాకార్  దండకారణ్య రచయితల పత్రికగా 1995లో ప్రారంభమైన ఈ పత్రిక గురించి చెప్పుకునే ముందు విప్లవ రచయితల సంఘం అధికార పత్రిక అరుణతార వరంగల్ నుంచి 1992 మే వరకూ సాహితీ మిత్రులు వెలువరించిన సృజన పత్రికలను గుర్తు చేసుకోవడం, ఈ సందర్భంగా ఆ పత్రికలకు విప్లవాభివందనాలు తెలియజేయడం అవసరం. దండకారణ్య వుద్యమాన్ని రచయితలను, రచనలను ప్రోత్సహించడానికి అవి గొప్పగా తోడ్బడినాయి. ఇప్పటికీ రుంకార్ పత్రిక విరసం వారికి అందినప్పుడు అందులో నుంచి ఎంపిక చేసుకున్న రచనలను తమ అరుణతార పత్రికలో వేసి దండకారణ్య ఉద్యమాన్ని ప్రచారం చేయడంలో తమ వంతు బాధ్యత వారు నిర్వహిస్తున్నారు.

రుంకార్ పత్రిక మొదట దండకారణ్య రచయితల పత్రికగా వచ్చినప్పటికీ  నుంచి ర్సుంకార్ పత్రిక చేతనా నాట్య మంచ్ అధికార పత్రికగా వస్తోంది. ఈ పత్రిక 2010 ఫిబ్రవరి వరకు 25 సంచికలు వెలువడినాయి. మొదట ఈ పత్రిక బహుభాషా పత్రికగా ఉనికిలోకి వచ్చి దండకారణ్య విప్లవోద్యమంలో కొనసాగుతున్న అనేక భాషల రెండు రచనకు ప్రతినిధిగా నిలిచింది.     అయితే ఉద్యమాభివృద్ది  క్రమంలో వివిధ రూపాలలో సాహిత్యం వికసిస్తూ ఫలిస్తుండడంతో పత్రిక ఆయా భాషలలో విడిగా ప్రచురించడం 2009 నుంచీ ప్రారంభం అయింది. ప్రధానంగా స్థానిక కామ్రేడ్స్ పాటలు, కవితలు, స్మృతులు, అనుభవాలు మొదలైనవి విరివిగా రాస్తుండడంతో కోయ, హిందీ భాషలకు కలిపి దేవనాగరి లిపిలో పత్రిక వెలువడుతూ, తెలుగు రచనల కోసం విడిగా తెలుగులోనూ వస్తోంది. ఈ రకంగా వెలువడడం పాఠకులకూ సౌకర్యంగానే ఉంది.

పత్రిక నిర్దిష్ట కాలపరిమితితో వెలువడడం లేనప్పటికీ యేడాదికి ఇంచుమించు రెండు సంచికల చొప్పున తేవడానికి సంపాదక వర్గం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. సిక్కోలు ప్రజాపోరాటాల నాయకుడు, కవి, గాయకుడు అయిన సుబ్బారావు పాణిగ్రాహి స్పృతిలో (25 డిసెంబర్) డిసెంబర్ మాసంలోనూ, వర్తమాన ప్రజాయుద్ధంలో శత్రువుతో పోరాడుతూ తమ ప్రాణాలను త్యాగం చేస్తున్న సాయుధ, సాంస్కృతిక ప్రజా యోధులందరి అరుణారుణ స్ఫృతిలో (జూలై-28) జూలై మాసంలో తేవాలని నిర్ణయమైంది. మన దేశ విప్లవోద్యమంలోని ఒక గెరిల్లాజోన్ నుంచీ ఇంత సుదీర్హకాలంగా, ఇంత క్రమం తప్పకుండా తీవ్ర నిర్భంధం మధ్య అనేక ఆటంకాలను ఎదుర్కొంటూ, ఎన్నో పరిమితులలో వెలువడుతూ అభివృద్ధి చెందుతున్న సాహితీ పత్రిక బహుశా రుంకార్ ఒక్కటేనేమో!

సమకాలీన రాజీకయ పరిస్థితులలో విప్లవ రచయితలు, కళాకారులు ఏం చేయడం, వర్తమాన రాజకీయాలలో చోటు చేసుకున్న పరిస్థితులను సాంస్కృతిక రంగం ఎలా అర్ధం చేసుకోవాలి? వేగంగా రూపుదిద్దుకుంటున్న పరిణామాల పట్లా ఏ వైఖరి తీసుకోవాలి అనే విషయాలను దృష్టిలో పెట్టుకొని పత్రిక సంపాదకీయాలను అందిస్తోంది. 

  సాంస్కృతిక రంగంలో కృషి చేస్తూ ఫాసిస్టు శత్రు నిర్బంధంలో అసువులు బాస్తున్న చేతనా నాట్య మంచ్ కళాకారుల జీవిత చరిత్రలను పత్రిక ద్వారా పరిచయం చేస్తున్నారు. ఈ శీర్షికల అనంతరం కవితలు, కథలు, పాటలు, వ్యాసాలు, పాఠకుల వుత్తరాలు, సంపాదక వర్గం జవాబులు మొదలైన శీర్షికలు ఉంటూ పాఠకుల అభిరుచికి తగినట్లుగా పత్రికను తేవడానికి కృషి జరుగుతోంది. గత సృజన పత్రికలలో వచ్చిన ముఖ్యమైన సాహితీ వ్యాసాలను దండకారణ్య రచయితల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య తిరిగి రుంకార్లో వాటిని ప్రచురిస్తున్నారు. పత్రికకు చేరుతున్న రచనలను పరిశీలిస్తుంటే తెలుగు కన్నా హిందీ కన్నా ఇంకే భాషల కన్నా కోయలో వస్తున్న రచనల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటున్నది. పత్రిక సక్రమంగా రావడానికీ, వైవిధ్యంగా ఉండడానికీ, సజీవత్వం ఉండడానికి ఇది హామీనిస్తుంది. అయితే దండకారణ్య వ్యాప్తంగా ప్రతీ ఏరియాలో   నిరంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల మధ్య చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు ప్రజలకు విప్లవ సందేశం చేరవేయబడుతోంది. కాని పత్రికలో ఈ రిపోర్టులు పూర్తిగా చోటుచేసుకోని ఫలితంగా కళాకారుల కృషీ అనుభవాలు ఒక చోటివి మరో చోటికి చేరి సాధారణీకరించబడడం లేదు. పత్రికలో అచ్చవుతున్న విషయాలే పాఠకులకు అందుతున్నాయి కానీ అనేక నూతన అనుభవాలు పత్రికలో తగినంతగా రిపోర్టింగ్ కాకపోవడం పత్రికకు ఒక మచ్చలాగే మిగిలింది. దండకారణ్య కళాకారుల అనుభవాలు వారి మాటల్లోనే చెప్పించడం, వారి కృషిని పత్రిక పాఠకులకు ద్వారా అందించడం లాంటివి తగిన శీర్షికలతో పాఠకులకు చేర్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి రెండు సందర్భాలలో ప్రత్యేక సంచికలను వెలువరించారు. పదవ సంచికను పూర్తి హిందీ రచనలతో వెలువరించగా, పదేళ్ల రుంకార్ను ప్రత్యేక సంచికగా 2005లో తీసుకవచ్చారు. పత్రిక యేడాదికి ఎన్ని సంచికలు వెలువడుతుంది అనే విషయం కన్నా పత్రిక తన ద్వారా తనకు ఎంతమంది పాఠకులను కూడగట్టుకోగలిగింది?

ఇది ఒక ముఖ్యమైన విషయం అవుతుంది. కానీ, ఈ విషయంలో పత్రిక సాధించిన దానికన్నా సాధించాల్సినదే అనేక రెట్లు ఎక్కువగా ఉంది. పత్రిక వితరణ చాలా పరిమితంగా ఉండి తగినంత మంది పాఠకులను అది సమకూర్చుకోలేకపోతోంది. పత్రిక పోరాట ప్రాంతంలోని రచయితలకూ, కళాకారులకూ అందడం ద్వారా అది గ్రామాల్లోని చేతనా నాట్య మంచ్స భ్యుల వరకు వెళ్లి వాళ్లకు విద్య గరపడానికి ఉ పయోగపడుతోంది. చంద్రునిలో మచ్చల లాగా కొన్ని లోపాలు పత్రికకు ఉన్నప్పటికీ నూతన రచయితలను, వారి రచనలను ప్రోత్సహించడంలో వారిని మంచి రచయితలుగా తీర్చిదిద్దడంలో పత్రిక తన వంతు కృషి అది కొనసాగిస్తోంది. సాంస్కృతికోద్యమ నిర్మాణానికీ, ప్రచారానికి పత్రిక ఒక సాధనంగానూ వుపయోగపడుతోంది  పత్రిక పై పరిమితులకు లోబడే కొన్ని ప్రచురణలను కూడా చేపట్టింది.

పోరు తరంగాలు కవితా సంకలనం (తెలుగు, హిందీ), కథల సంపుటి (అచ్చులో ఉ 0ది) అమరుల చరిత్రలు, సల్వాజుడుంను వ్యతిరేకిస్తూ రాసిన పాటలన్నీ కలిపి వేసిన పాటల పుస్తకం, నెత్తుర్ జుడుం పీటోతో పాటు ఇతర కొన్ని పాటల పుస్తకాలు అందివ్వగలిగింది. ఉద్యమంలో పనిచేస్తున్న విప్లవకారులను సాహితీ సాంస్కృతిక రంగాలలో అభివృద్ధి చేసుకోవడానికి దాదాపు 2008 వరకూ వివిధ పేర్లతో గోడ పత్రికలను కూడా నిర్వహించటం జరిగింది. ఆ మేరకు ఇవి సాంస్కృతిక రంగంలో జరుగుతున్న ప్రచురణల కృషిని తెలియజేస్తున్నాయి.

Leave a Reply