★Victory Signs★
By Moumitha Alam-west Bengal.【A poem on Manipuri Kuki tribal women who have been Paraded Naked & raped 】
★విజయ చిహ్నాలు★తెలుగు అనుసృజన-గీతాంజలి

ఓ..నా ప్రియమైన కుకీ తల్లులారా., మన భారత దేశంలో..
మన శరీరాలే యుధ్ధక్షేత్రాలు కాదంటారా ?
పురుషులు నీళ్ల సీసాలు దొరక్క..వాటి కోసం కొట్లాడు తున్నప్పుడు కూడా.. *నీ యమ్మ..నీ తల్లిని..నీ చెల్లిని దెన్●●  అనే యుగాల నుంచీ అలవాటైన బూతులతో మొదట మన తల్లులనే శపిస్తారు !

 మన బట్టలు తొలగించబడతాయి..
మన మీద కిరాతకంగా లైంగిక అత్యాచారం  జరుగుతుంది.
క్రూరమైన జంతువుల గాయాలతో మన దేహాలు నెత్తురోడాక
ఇక మనం భరతమాత బిడ్డలుగా..వాళ్ళ విజయ చిహ్నాలుగా మారిపోతాం !
 చరిత్రలో ఎప్పుడూ జరిగేది ఇదే...వాళ్ళు మన శరీరాలతో  యుద్ధం చేస్తారు.
మన రొమ్ముల్ని కాల్చేస్తారు..
ఇక తరువాత మనల్ని యుద్ధ పీడితులుగానో..బాధితులుగానో ప్రకటిస్తారు !

ఓహ్..నా కుకీ తల్లులారా..!
ఈ పురుషులున్నారే మన దేహాలతో యుద్ధ క్రీడ అనే
విందు చేసుకోవడం ముగిశాక.. మన నెత్తుటి దేహాలను ..వాళ్ళ యుద్ధ భూమిలోనో..పొదల్లోనో వదిలేస్తారు !
ఈ పురుష ప్రపంచంలో
వాళ్ళు మనల్ని చాలా పేర్లతో పిలుచుకుంటారు..
మన దేహాల్ని నిలువునా ఛీల్చి..
వాళ్ళ విజయ చిహ్నాలను  నిర్లజ్జగా..బాహాటంగా ప్రకటించుకుంటారు.
ఓ నా కుకీ తల్లులారా..
అవును ..మనం భరత మాత కన్న బిడ్డలం !
మన దేహాలెప్పుడూ యుద్ధ క్షేత్రాలే ..వాళ్ళ విజయ చిహ్నాలే!
★★★★★★★
మౌమితా ఆలం వెస్ట్ బెంగాల్ కి చెందిన ముస్లిం కవయత్రి.

One thought on “విజయ చిహ్నాలు

Leave a Reply