నివేదిక

మైనింగ్ కోసం పసికందును చంపేస్తారా ? కార్పొరేటీకరణ,  సైనికీకరణ వ్యతిరేక వేదిక నిరసన సభ

బీహార్‌లోని కైమూర్‌లో పులుల అభయారణ్యం  ఏర్పాటుచేయాలనే సాకుతో  ఆదివాసీలను నిర్వాసితులను చేయడానికి, ఛత్తీస్‌గఢ్‌లోని హస్దేవ్ లో  ఆదివాసీ రైతుల భూమిలో చెట్లు నరికివేయడానికి, భూసేకరణకు, వ్యతిరేకంగా 2024 జనవరి 1న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో 6 నెలల పసికందు హత్యకు వ్యతిరేకంగా 2024 జనవరి 10న, కార్పొరేటీకరణ-సైనికీకరణ వ్యతిరేక వేదిక (ఫోరమ్ ఎగైనెస్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్ (ఎఫ్‌ఎసిఎఎమ్), ఢిల్లీ యూనివర్సిటీ ఆర్ట్ ఫ్యాకల్టీలో నిరసన సభను నిర్వహించింది. వనరులు అధికంగా ఉన్న ప్రాంతాలలో కార్పొరేట్ దోపిడిని మరింత తీవ్రతరం చేయడం కోసం, మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల పేరుతో అనేక పారామిలిటరీ క్యాంపులను  ఏర్పాటు చేసి వేలాది బలగాలను