ఇంటర్వ్యూ సంభాషణ

పాత జీతాల కోసం పోరాడాల్సి వ‌స్తోంది

 ( ప్ర‌జాధ‌నాన్ని అనుత్పాద‌క రంగానికే ఎక్కువ‌గా త‌ర‌లిస్తున్నార‌ని, అందువ‌ల్లే ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డం కూడా భార‌మైపోయింద‌ని పీఆర్‌సీ ఉద్య‌మంలో ప‌ని చేస్తున్న డీటీఎఫ్ నాయ‌కుడు కె. ర‌త్నం ఏసేపు అంటున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు మెరుగైన పిఆర్‌సి కోసం  చేస్తున్న ఉద్యమం కార్మికవర్గ సంక్షేమంతో ముడిపడి వుంద‌ని అంటున్నారు. దాదాపుగా నూరు శాతం ఉద్యోగ‌వ‌ర్గాలు ఈ ఉద్య‌మంలో భాగ‌మ‌య్యాయ‌ని ఆయ‌న అంటున్నారు. అయితే గ‌తంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద‌, రైతు ఉద్య‌మం లాంటి వాటి మీద ఉద్యోగ‌, ఉపాధ్యాయ వ‌ర్గాలు క‌లిసి వ‌చ్చి ఉంటే ఇప్ప‌డు పీఆర్సీ పోరాటానికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు దొరికేది. దీన్ని అడ్డంపెట్టుకొనే పాల‌కులు ఉద్యోగుల‌కు వ్య‌తిరేకంగా