వ్యాసాలు

ప్రజా యుద్ధకల్పనా రూపం అజ్ఞాత కథ

 (2010 జనవరిలో  మొదటిసారి, 2016  ఫిబ్రవరిలో మరోసారి విరసం పునర్ముద్రించిన *ముప్పై ఏళ్ళ దండకారణ్య సాహితి సాంస్కృతోద్యమ చరిత్ర (1980 -2010) పుస్తకంలో అజ్ఞాత కథ గురించి దండకారణ్య రచయితలు రాశారు. దండకారణ్య సాహిత్య కళా ప్రచార వేదిక ఝన్కార్ గురించీ రాశారు. వియ్యుక్క కథా సంపుటాలు విడుదల అవుతున్న సందర్భంలో అజ్ఞాత విప్ల కథా వికాసాన్ని అర్థం చేసుకోడానికి పనికి వస్తుందని ఈ భాగాలను పునర్ముద్రిస్తున్నాం -వసంత మేఘం టీం) దండకారణ్య సమాజంలో ప్రజల జీవితాలతో, ప్రకృతితో ముడిపడిన కథలు కోకొల్లలు. మనిషికీ-ప్రకృతికీ ఉండే సంబంధాలను, ఉత్పత్తి సంబంధాలను తెలిపే కథలు ప్రజలు ఎన్నైనా చెపుతారు. అలాగే