కవిత్వం

ఏకత్వం

ప్రియా! అన్వర్ ఇంటికాడ పీరీలు కట్టిన యాపశెట్టు మొదట్లోనే ఎలిశిన పుట్టకు పసుపు కుంకుమల పూజ చేయడానికి నీవొచ్చినపుడు ప్రేమంటే ఏంటని నేనడిగితే ఏమన్నావు? ఒకరి ఆలోచనలు ఒకరం పంచుకోవడం! ఒకరి ఇష్టాలను ఒకరం గౌరవించుకోవడం! స్వేచ్ఛను స్వేచ్ఛగా ఆస్వాదించడమనే కదూ..? నేను తురకను! నీవు హిందువువి! మనం ప్రేమించుకోడమెట్లా? అన్నపుడు ఏం నీవు మనిషివి కాదా? అని నువ్వు సూటిగా అడిగినపుడు మబ్బులు తొలగినఆకాశమైంది నా ముఖం ! నేను ఆవు కూర అని నసుగుతుంటే- నెయ్యి కూడా దాని రక్తమేలేనని నీ తినే అన్నం చేతిని, నే తినే అన్నం చేతితో ప్రేమగా అలాయి -