సంభాషణ

ఈ మట్టిని తొలుచుకొని లేచిన ఆదివాసీ రైతు వీరుడు

(అమరుడు కామ్రేడ్‌ కేండ్రుక సింగన్న స్మృతిలో...) అది సెప్టెంబర్‌ మాసం మధ్య రోజులు. మేము నారాయణ పట్నా గుండా ముఖ్యమైన పని కోసం వెళ్తున్నాం. నారాయణ పట్నా బ్లాక్‌ వచ్చేసరికి అంతా హడావిడిగా కనిపిస్తున్నది. దారి పొడుగునా ప్రజల నుండి అమితమైన ఆదరణ వ్యక్తమవుతున్నది. మేము బహిర్గతం కాకూడదని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, మా అలికిడి ఏ మాత్రం అర్థమైనా, జనం నిద్ర మంచాలపై నుండి లేచి బారులు తీరి చేతులు కలుపుతున్నారు. ఈ ఆప్యాయత మా అలసటను మాయం చేస్తున్నది. ఎక్కడకు వెళ్లినా  మా సంఖ్యకు మించి ‘డొప్ప’ల్లో ఆహారం వస్తున్నది. మా ప్రయాణం కొంచెం ముందుకు