కవిత్వం

డోలీ ప్రసవం

నా కడుపున నలుసు పడ్డాక గాని తెలియలేదు ఆ దారి సవాళ్ళ మయమని భుజాన వేసుకొని మోసకెళ్తా ఉంటే ప్రసవానికి కాక కాటికి ఏమో కలత పడుతుంది ప్రాణంలో ప్రాణం స్వేచ్ఛా తెగల్లో పుట్టడమే నా ప్రసవానికి శాపమని నేను తల్లినవ్వబొతుప్పుడే తెలిసొచ్చింది డోలీ డోలీ నన్ను ముద్దాడిన అమృతం తెర ఇక ఈ డోలీలోనే విగతజీవిగా మిగలితానేమో..! ఈ ప్రయాణంలో తల్లిగా ముద్ర గాంచడానికి తల్లి బంధంకి దూరామైతే కారణమెవ్రూ..! చెప్పండి నా శిశువు స్పర్శ నేను గాక నేలముద్దాడతుందేమో శాశ్వతంగా అడవి తల్లి బిడ్డనైనందుకు నన్ను తల్లిపేరు నుంచి దూరం చేసే ప్రయత్నమే డోలీ మార్గం