సాహిత్యం కారా స్మృతిలో

సాహిత్యంలో ప్రాసంగికత: కారా ఉదాహరణ

కాళీపట్నం రామారావుగారు పూర్ణ జీవితం గడిపి వెళ్లిపోయారు. తాను రాయగలిగిన కథలే రాశారు. ఎంచుకున్న పనులనే చేశారు. మాష్టారు జీవించి ఉండగానే ఆయన కథల మీద చాలా చర్చ జరిగింది. తాను వెళ్లిపోయి మరోసారి ఇప్పుడు ఆ కథల గురించి మాట్లాడుకొనే అవకాశం ఇచ్చారు. కారా కథల్ని తెలుగు సమాజ, సాహిత్య వికాసానికి అతీతంగా చూడ్డానికి వీల్లేదు. ఎక్కువ చేయడానికైనా, తక్కువ చేయడానికైనా. మరణ సందర్భంలో అతి ప్రశంసల  ప్రమాదం ఎప్పుడూ ఉండేదే. నిజానికి కాళీపట్నం రామారావుగారి నుంచి కూడా కారా కథల్ని వేరు చేసి తెలుగు సాహిత్య, మేధో రంగాల అభివృద్ధి క్రమంలో భాగంగా చూడాలి. ఇది పూర్తిగా సాధ్యం
సాహిత్యం వ్యాసాలు

మమతా ఫాసిజం మాటేమిటో!

“ఎంత మాట! ఇట్లనవచ్చా? సందర్భశుద్ధి లేకుండా?” అనే వాళ్లుంటారని నాకు తెలుసు. సరిగ్గా అనవలసిన సందర్భం ఇదే. పైగా నిన్న మొన్న కూడా ఈ మాట అన్నవాళ్లకు ఇప్పుడు ఏ ఇబ్బందీ ఉండదు. పశ్చిమ బెంగాల్ విషయంలో సోషల్ ఫాసిజమనీ, మమతా ఫాసిజమనే మాటలు ఎప్పుడో ముందుకు వచ్చాయి. ఫాసిజాన్ని ఇన్ని రకాలుగా, ఇన్ని విశేషణాలతో చెబితే అసలు ఫాసిజం మీద విమర్శ పలుచన అవుతుందనే వాళ్లూ ఉండొచ్చు. మన దేశంలో ఫాసిజం కూడా బహురూపి. సూక్ష్మరూపి, సర్వవ్యాపి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, పాలకవర్గ రాజకీయార్థికానికి అది అత్యంత సన్నిహితమైనది. కేవలం బ్రాహ్మణీయ హిందుత్వ వల్లనే మన దేశంలోని ఫాసిజం
సాహిత్యం వ్యాసాలు

సాహిత్య విమర్శలో చారిత్రక పాత్ర

మార్క్సిస్టు సాహిత్య విమర్శ ప్రత్యేకత దాని సిద్ధాంతంలో ఉంది. సాహిత్యంలో ఉండే భావాలకు చరిత్ర ఉంటుంది. దాన్ని సామాజిక చరిత్రలో భాగంగా చూడాలి. అప్పుడే అ రచన ఏ కాలంలో ఏ అర్ధం పలికిందీ వివరించడానికి వీలవుతుంది. సాహిత్యానికి ఉండే అర్థాలు చెప్పడం సాహిత్య విమర్శ కర్తవ్యాల్లో ప్రధానమైనది. ఒక రచనకు అ అర్థాలు ఎలా ఏర్పడ్డాయి? ఎలా మారుతూ వచ్చాయి? అనే ప్రశ్నలకు జవాబు నేపథ్యంలోని సామాజిక చారిత్రక స్థితిగతుల మార్పుల్లో వెతకాలి. ఇది మార్క్సిస్టు  సాహిత్య విమర్శలో కీలకం. _ చారిత్రక భౌతికవాద పద్ధతిని సాహిత్య రచనకు సక్రమంగా అన్నయిస్తేనే ఈ పని సాధ్యమవుతుంది. ఈ
వ్యాసాలు

దండ‌కార‌ణ్యం అప్‌డేట్స్‌

కొవిడ్ మానవాళికి కొత్త అనుభవం. కరోనా అనంతర చరిత్ర అనగల స్థాయిలో మార్పులు జరుగుతున్నాయని చాలా మంది అంటున్నారు. ఇందులో కొంత విశ్లేషణ ఉంది. చాలా వరకు ఊహ ఉంది. తొలి దశ కరోనా బీభత్సం మధ్యనే అమెరికాలో ఎన్నికలు ముగిశాయి. ట్రంప్ దిగిపోయి, జో బిడెన్ అధికారంలోకి వచ్చాడు. ప్రపంచ రాజకీయార్థిక సమీకరణాలు కొత్త దశలోకి మళ్లే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కరోనా వచ్చినా, బిడెన్ వచ్చినా పాలస్తీనా పరిస్థితి ఏమీ మారదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఆయన మొన్న ఒక మాట అన్నాడు. ఇజ్రాయిల్‌కు  తన ప్రయోజనాల కోసం పోరాటే హక్కు ఉందని
సాహిత్యం వ్యాసాలు

ఈ నిషేధం విరసం మీదేనా?

విప్లవ రచయితల‌ సంఘాన్ని చట్టవ్యతిరేక సంస్థగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2005 ఆగస్టు 17న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలిసారి విరసాన్ని నిషేధించింది. న్యాయ విచారణ కమిటీ ముందు ప్రభుత్వం తన వాదనల్లో ఒక్కటి కూడా నిరూపించుకోలేకపోయింది. మూడు నెల‌ల్లో నిషేధ ఉత్తర్వు వీగిపోయింది. పదిహేనేళ్ల తర్వాత మళ్లీ అవే ఆరోపణలు. అదే పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌. అప్పుడూ ఇప్పుడూ నిరంకుశ అధికారం తప్ప పాల‌కుల‌కు మరేదీ అనుకూలించలేదు. విప్లవ రచయితల కాల్ప‌ని శక్తిని, సిద్ధాంత అవగాహనను చట్టపరిధిలోకి తీసికెళ్లగల‌ తెంపరితనం ఒక్కటే వాళ్ల దగ్గర ఉన్నది. బహుశా ప్రపంచ సాహిత్య చరిత్రలో ఒకటికి రెండు సార్లు
వ్యాసాలు సాహిత్యం

సాహిత్య విమ‌ర్శ‌లో జేసీ

*క్లాసిక‌ల్* సంవిధానంలోని వెలుగు నీడ‌లు విప్లవ సాహిత్య విమర్శ చరిత్రలోని  1980ల  త‌రంలో  జేసీని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  ఆ ద‌శాబ్దంలోనే ఆయన ప్ర‌ధాన  రచనలు   వెలువడ్డాయి. కవిత్వం-గతితార్కికత అనే వ్యాస సంపుటి 1991 జనవరిలో సృజన ప్రచురణగా వచ్చింది. విప్లవ సాహిత్య విమర్శ ఆరంభకుల్లో  కొడవటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ, కెవిఆర్ ప్రముఖులు.  వారు విప్లవ సాహిత్య విమర్శకు పటష్టమైన పునాది వేశారు. ఈ ముగ్గురూ అభ్యదయ సాహిత్యోద్యమ సంప్రదాయంలోంచి నక్సల్బరీ పంథాలోకి వచ్చారు.  ఈ తొలి తరం ప్రముఖులతో పోల్చుకుంటే 1980లలో వచ్చిన విమర్శకుల మేధో వ్యక్తిత్వం చాలా భిన్నమైనది. ఒక్కొక్కరు ఒక్కో వరవడిని విమర్శలోకి తీసుకొచ్చారు. వీరంతా సుమారుగా
సాహిత్యం కథలు

సుబ్రమణ్యం కంట తడి

ఒకప్పుడు సుబ్రమణ్యం మా ఇంటికి రోజూ వచ్చేవాడు. ఎక్కువగా పొద్దున పూటే. ప్రత్యేకించి నాతో పనేమీ ఉండనక్కర్లేదు. అమ్మతో, జయతోనే పలకరింపు, అదీ ఎంత సేపు, అమ్మ ఇచ్చే కాఫీ తాగే వరకే. ఎప్పుడన్నా ఆలోగా బయల్దేరబోతే ‘సుబ్బూ కాఫీ తాగి వెళ్లూ..’ అని అమ్మ ఆపేది. అట్లని తను మాకు చుట్టమేం కాదు. నా మిత్రుడు అంతే. ఎప్పటి నుంచో చెప్పలేను. గుర్తు చేసుకోలేను. అంతటి గతం. ఆ మధ్య సొంత ఇల్లు కట్టుకొని మారిపోయాడు. అప్పట్లా రోజూ కాకపోయినా సుబ్రమణ్యం వస్తూనే ఉంటాడు. 1 రాత్రి పదిన్నరప్పుడు ఆఫీసులో ఎంత బిజీగా ఉంటానో. అలాంటప్పుడు సత్తార్‌