వ్యాసాలు

అంతర్లీన సత్యాలను దాచడానికి వాస్తవాలను ఉపయోగించడం

చాలా  సముచితమనిపించే పదాలు మరియు పదబంధాలను శక్తిమంతులు తెలివిగా ఉపయోగించడంలో, ప్రజలను మోసం చేయాలనే స్పష్టమైన ఉద్దేశ్యాన్ని చూడవచ్చు. ది హత్రాస్ దారుణం, జాతీయ మనస్సాక్షిపై  లేదా దానిలో యింకా ఏదైనా  మిగిలివుంటే  దానిపై బలమైన ముద్ర  వేసింది. సాంఘిక అణచివేతపు అత్యంత క్రూరమైన పార్శ్వాన్ని ప్రజలకు చూపింది.అంతేకాకుండా,  ప్రభుత్వ యంత్రాంగాన్ని నిసిగ్గుగా మరియు నిస్సంకోచంగా అణచివేతదారులకు మద్దఇవ్వడానికి ఉపయోగించడాన్ని ప్రజలు చూశారు. యుక్తవయసులో ఉన్న దళిత బాలికపై అమానుషంగా దాడిచేసి –(  ఆమెను భారతి అని పిలుద్దాం) - చివరికి  చంపడమేగాక, ప్రథమ సమాచార నివేదికనివ్వడంలో కూడా తటపటాయించారు .అంతేగాక, నిర్దయతో  వైద్యపరీక్షను ఆలస్యంజేసారు, మరణవాంగ్మూలాన్ని పరిగణలోకి