వ్యాసాలు

ప్రసంగించాడని అరెస్ట్ చేశారు

2023 అక్టోబర్ 28 తెల్లవారుజామున 4 గంటలకు సర్వ ఆదివాసీ సమాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బస్తర్ జన్ సంఘర్ష్ సమన్వయ్ సమితి కన్వీనర్ తిరుమల్ సర్జూ టేకమ్‌ను ఒక కార్యక్రమంలో ఉపన్యాసం యిచ్చినందుకు ఛత్తీస్‌గఢ్‌లోని మాన్‌పూర్ జిల్లాలోని అతని నివాసం నుండి భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295A, 153A, 506B, 435, 34 కింద, అబద్ధపు ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. భారతదేశంలోని సహజ వనరులు అధికంగా ఉన్న బస్తర్‌లో జరుగుతున్న కార్పొరేటీకరణ, సైనికీకరణలకు వ్యతిరేకంగా సర్జూ టేకం తన స్వరాన్నెత్తారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆ ప్రాంతంలోని భూమి, సహజ వనరులను దోచుకోవడానికి వీలు కల్పించడానికి అనేక మంది ఆదివాసీలను