కవిత్వం

ఎర్రమందారం

సింగరేణీ కార్మిక వర్గంలో మొలకెత్తిన ఎర్రమందారం నీవైతే నీవు వెదజల్లే ఆ పరిమాళానికి వీచే గాలిని నేనవనా కామ్రేడ్ నా విప్లవ పయనానికి నడక నేర్పిన సాయుధ శక్తివి నీవైతే ఆ పయనంలో పీడిత ప్రజల ముక్తిని సాధించే బందూకునేనవనా కామ్రేడ్ సాధారణ సుదర్శన్ నుండి కా.ఆనంద్ గా, దూల గా 5 దశాబ్దాల అలుపెరుగని జన పోరు సంద్రంలో నూతన ప్రజాస్వామ్యాన్ని వాగ్ధానం చేసిన దృఢమైన విప్లవ కార్యదీక్ష నీవైతే ఆ లక్ష్యాన్ని అల్లుకునే కార్మికవర్గ స్పర్శను నేనవనా కామ్రేడ్ భారత విప్లవోద్యమ సారధిగా యుద్ధ రచన చేసిన నీ ప్రతి అక్షరం కుళ్ళిన ఈ దోపిడీ
కవిత్వం

వివేక్ కవితలు రెండు

ఫాసిస్టు కత్తిపై నా భావాలను, కలాన్ని నీ ఫాసిస్టు కత్తితో నరికినంత మాత్రాన నేను అంతమై పోను అంతకన్నా అదృశ్యమై పోను దోపిడీ వ్యవస్థలో బుసలు కొడుతున్న నీ ఫాసిస్టు భావజాలాన్ని కూకటి వేళ్ళతో సహా అడ్రస్ లేకుండా పెకిలించడానికి నా సైన్యం కలంధారీ, ఆయుధధారీ పదునెక్కుతోంది చిందిస్తున్న నా నెత్తురుతో తడిసిన నెల పొరల్లోంచి పోరు విత్తనాలు మొలకెత్తి నలుమూలల విస్తరించి నీ అంతాన్ని చూస్తాయి. బిగించిన పిదికిలి మా ఆయుధం శతృవు తూటాలకు దడిస్తే ఒక్క తూటా శబ్దమే నిన్ను అవహించి నీ ప్రాణాన్ని వెంటాడుతుంది కామ్రేడ్ నీ లక్ష్యసిద్ధికై పిడికిళ్ళు బిగించి యుద్ధానికి సిద్ధమైతే
వ్యాసాలు

ఖాకీల సంరక్షణలో కార్పొరేట్ల విస్తరణ, ప్రజా పోరాటాల ప్రతిఘటన

ప్రపంచవ్యాపితంగా ఆర్థిక ద్రవ్య సంక్షోభం ఎంత తీవ్రం అవుతుందో అంత వేగంగా వెనుకబడిన దేశాలలోకి ప్రపంచ పెట్టుబడి ప్రవహిస్తున్నది. వెనుకబడిన దేశాలలోని లోతట్టు ప్రాంతాలను వెతుక్కుంటూ మరీ దూకుడుగా అది పరుగులు తీస్తోంది. సామ్రాజ్యవాదం ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి అది బయటపడడానికి చేపడుతున్న ప్రక్రియ ఇది. కాబట్టి అసలు సంక్షోభాల గురించి 1848 లోనే కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ లు ఏం చెప్పారో మనం ఒకసారి చూద్దాం. ‘‘సంక్షోభాలను మరింత విస్తృతమైన, మరింత విధ్వంసకరమైన సంక్షోభాలకు బాట వేయడం ద్వారా, సంక్షోభ నివారణావకాశాలను తగ్గించడం  ద్వారా తాత్కాలికంగా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగా, 1. ఉత్పత్తి శక్తులలో