సాహిత్యం కవిత్వం

ఇక్కడి నీడలు నీడల్లా వుండవు

మా దేహపు నీడలోనూమా ఊపిరిపాట వినిపిస్తుంది మా హృదయంలో కదలాడుతున్న ఘర్షణమా కడుపులోకి ఎలా దూకిందోమా దేహపు నీడలోనూ కనిపిస్తుంది స్థూపాల నీడలన్నీ కలగలిసినేలపై హృదయాలపై నదిలా పారుతుంటాయిమా దేహపు నీడలోనూఅదే త్యాగాల రంగు దట్టమైన చీకటిలోనూనిద్ర పట్టని రాత్రిలోనూనేలపై పడుకున్నప్పుడు మా నీడలు మాకు కనిపిస్తాయిమా నీడలు మా కింద నుండి పారుతుంటాయిగుండెలు పగిలిఅచ్చం మాలాగే నిర్జీవంగా పడివున్నమరికొందరి అమ్మలను వారి నీడలను హత్తుకోటానికిమా నీడలు పారటం నేర్చుకున్నాయి చిమ్మ చీకటిలోనూమా నీడలన్నీ సజీవమేనీడల్లో నిండివున్న మా ఎర్రటి రక్తమంతా సజీవమే మా త్యాగాల రంగులో మెరుస్తున్న చిక్కటి నీడలుపిడికిళ్లుగా మారుతుంటాయిపిడికిళ్లుగా పాడుతుంటాయి ఎర్రగా మెరుస్తున్నయ్ చూడండిఇక్కడి