కవిత్వం

వాగ్దానం

మనుషులు పుడతారు చనిపోతారుతల్లి గర్భంలో ప్రాణం పోసుకోవడానికి స్త్రీ పురుషుల కలయిక కారణం అయితేమరణానికి కారణాలు అనేకంసహజమరణాలు అసహజ మరణాలుఈ రెంటికీ మధ్యన జరిగిపోయే మరణాల సంగతేంటి ?వాటికీ ఈ రాజ్యం పెట్టిన పేరు ఎన్ కౌంటర్ఎన్ కౌంటర్ అంటే ప్రజలకు నమ్మకం అది ఏకపక్ష మరణ శాసనమని ఎక్కడో ఓ తల్లికి గర్భశోకం మిగిల్చారని!ఓ తండ్రి కల లను కాటిపాలు చేసారని!ఓ కొంపను నిలువునా కూల్చారని!ఓ ఊరును వాళ్ళకాడు చేసారని !మరణం మనుషులను దుఃఖంలో ముంచడం సహజమే !ఈ కింది నాలుగు పదాల వెతుకులట సంఘర్షణ లో నా... కనులు వర్షించి,ఈ కాగితం తడవడం నాకు తెలువకుండానే
కవిత్వం

పోదాం పద ఢిల్లీలో కవాతు చేద్దాం

కవితలల్లుదాం ఢిల్లీలో రైతుల పోరు నినాదాలను కథలు చెపుదాం రైతుల నెత్తురే ధారలై పారుతున్న ఢిల్లీ సరిహద్దుల దారుల కోసం! పిడికిళ్లు ఎత్తుదాం దగాపడ్డ బతుకుల పోరుదారిలో ! ఈ అక్షరాలను అస్వాదించండి ఆరాధించడం వద్దు మాట్లాడుదాం రైతుల పోరు ముచ్చట్లను! ఈ పదాలకు పెదవి విరుపులు అలంకారమే ! పెదాల బిగువున దాగిన మౌనాన్ని వీడి అక్షరాల అలుగు దునికిద్దాం ! మాట్లాడుదాం రైతుల పోరు గాథలను ఢిల్లీ సరిహద్దులు రక్తసిక్త మౌతుంటే, అక్షరాలా అగ్నిదీపాలను సృష్టిస్తాం! మనం తినే పళ్లెంలో అన్నంకు బదులు, రైతన్నల రక్తపుచుక్కలు మెరుస్తున్నయ్ ! ఆ వేళ యాడాదినర్థం పోరు పొద్దులై