కవిత్వం

పెను చీకటి – ప్రచండ కాంతి

తొలిచూరుతల్లి పొత్తిళ్ళలోబిడ్డలా ఉంది వెన్నెల బిడ్డ కోసం తల్లి వేసేఊయలలా ఉంది పాలపుంత బడి విడిచాకకేరింతలు కొడుతూబయటికొచ్చే పిల్లల్లా ఉన్నాయిచుక్కలు బుజ్జాయినిబజ్జోబెట్టటానికితల్లి పాడే జోల పాటలాఉంది మంద్ర గాలి హాయి అంతా ఇక్కడే ఉంది అన్నట్టుఅమ్మ ఒడిలో నిదురబోయినచంటి బిడ్డ మోములా ఉందినింగి పురిటి నొప్పుల బాధనుదిగమింగుతూగట్టిగా కళ్ళు మూసుకుని ఊపిరి బిగబట్టినగర్భిణిలా ఉంది రేయి ప్రచండ కాంతి తో పుట్టేసూర్యుడు ని ప్రపంచానికి హామిపడుతున్నట్టుందిపెను చీకటి...
కవిత్వం సాహిత్యం

చిన్ని ఆశ

వెన్నెముక విరిగినంతబాధల్లోపురిటినొప్పులతోఅర్ధరాత్రి పుట్టాను నేను నా పుట్టుక తెల్లవారాకేనా బంధు మిత్రులకి తెలిసిందినాడు సమాచార వ్యవస్థ నేటి లా లేదు సుమా! తెలిసీ తెలియ గానే కేరింతల్లోనా శ్రేయస్సు కోరే వారంతాఏం జరిగిందిఏం జరగబోతోంది తెలియని తనం లోవర్తమాన కోలాహలం చరిత్ర పునాది గా తొలినాళ్ళలో అంబాడుతూ పడుతూ లేస్తూబులిబులి నడకలతో తప్పటడడుగులతో నేనుతప్పొప్పుల బేరీజు తోభారీ ప్రణాళికలతో తల్లితండ్రులునా ఉజ్జ్వల భవిష్యత్తు కోసం రచనలు నిర్విరామంగా ఎదుగుతున్న కొద్దీనాకోసం ఆస్తుల సృష్టినా ఆధీనంలో ఎన్నో కర్మాగారాలు సంస్థలుఇరుగు పొరుగు తో సత్సంబంధాలునెలకొల్పుకుంటూసామ దాన భేద దండోపాయాల తో ముదిమి వయస్సు లోకొడుకులు నా ఆలనాపాలనా గాలికొదిలినా ఆస్తులు
సాహిత్యం కవిత్వం

అత్యంత సున్నితమైనది

పలకమీదఅక్షరాలనుతుడిపేసినట్టుహృదయంలోబంధాల జ్ఞాపకాలనుచెరిపేయగలమా..! అంతరంగంఅర్ధమైనప్పుడుఆశ శ్వాసఅందనంత దూరమైపోతుంది..! అబద్దాన్నినిజంగా నమ్మించొచ్చునిజాన్నిఅందరికితెలియనీయకపోవచ్చుఎల్లప్పుడుచికటేవుండదుగా..! తనడప్పుదరువునీ గుండెను తాకలేదా..?తనగొంతులో గానంనీ చూపు దిశను మార్చలేకపోయిందా..? తను నీవొడిలో తలవాల్చిబిడ్డలా వొదిగిపోయినప్పుడునువు తలనిమిరింది నాటకమేనా..? మానవ సంబంధాల్లోఅత్యంత సున్నితమైనదిసహచరి సహచరుడు బంధమే..! దానిని గండ్రగొడ్డలితో నరికిఅందరిని ఆశ్చర్యంలోముంచేసిన అమావాశవి..! ప్రజలదారిలో నీ నడకలేదనికాలక్రమంలో బహిర్గతమయ్యింది..! ఏబంధం లేని కరచాలానికేకలచివేస్తున్నప్పుడుకనుపాపలా చూసిన చూపుకికన్నీరే మిగిల్చావు..!
కవిత్వం

ఎవరిదీ జెండా

దేశమంతా సంబరాలపేరుతో మాయల ఫకీరుఉచ్చులో ఊరేగుతున్న వేళ దాహమంటూ గ్లాసుడునీళ్ళు తాగితేకొట్టి కొట్టి చంపినఅపర బ్రహ్మలున్న చోట అమృతమెవడిదోవిష పాత్ర ఎవరిదోబెత్తంతో గిరిగీసినపంతుళ్ళకుఏ శిక్షా లేని చోట నీ ఇంటి మీదఏ జెండా ఎగరేయగలవుచిన్నోడా! కులమొక్కటేమతమొక్కటేఏక్ భారత్శ్రేష్ఠ భారత్అని కూస్తున్నమర్మాల మర శబ్దాలనడుమనీదీ నాదీకాని దేశం కదాఇది తొమ్మిదేళ్ళ నీచిన్ని గుండెపైమండిన అగ్ని కీలలుఆ చూపుడు వేలుచివరల మండుతూఎగసిపడతాయాఏనాటికైనా? (కుండలో నీళ్ళు తాగి చావుకు గురైన ఇంద్రా మేఘవాల్ కు క్షమాపణలతో)
కవిత్వం

వందే అని ఎలా పాడను..!?

ఈ తరం నవతరంమా తరమే యువతరంఅర్ధరాత్రి స్వాతంత్ర్యంచీకటి కోణమేఏ వెలుగు జాడ లేనినిశి రాత్రి నీడలేఅమృతం ఏడ తేనుఉత్సవం ఎలా జరపనువందేమాతరం అంటూఎలా పాడను..!? బక్క చిక్కిన బతుకులుమెతుకుల కోసం ఆరాటంఅకృత్యాల అర్ధనాదాలుఅన్నార్ధుల జాడలులేని రోజు కోసంస్వేచ్ఛకై తపిస్తున్న చోటఅమృతం ఏడ తెనుఉత్సవం ఎలా జరపనువందేమాతరం అంటూఎలా పాడను…!? ఇప్పుడు దేశ భక్తిపాదరసంలా పారుతున్నదిపౌరుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మర్చిఅణచివేత చుట్టివేతలతోకుట్రలకు దారి తీస్తుందిడెబ్భై ఏళ్ళ స్వాతంత్ర్యంలోదేశమే జైలయి తలపిస్తున్న వేలఅమృతం ఏడ తేనుఉత్సవం ఎలా జరపనువందేమాతరం అంటూఎలా పాడను…!? ఈ మట్టి మాదిఈ దేశం మాదిహద్దులు లేని ప్రపంచం మాదిసకల శ్రామిక జనం మా నేస్తంలక్ష్మణ రేఖ
కవిత్వం

వధ్య శిల

వధ్యశిల రజతోత్సవమ్మటబంధిఖానలు ప్రజల సొమ్మటన్యాయమే వర్థిల్లుతుందటనాయకుల ఆరాధనాలట పూలుగోయర తమ్ముడామాల గట్టవె చెల్లెలా కొత్త సంకెళ్లేమిలేవటతెల్లదొరలను దించినారటదేశ దేశములోన భారతిబిచ్చమెత్తుట మాన్పినారట గర్వపడరా తమ్ముడాపరవశింపవె చెల్లెలా ఆనకట్టలు కట్టినారటభూమి పేదలకిచ్చినారటఆకలెత్తిన ఆయుధాలనుఅణచి మేల్‌ సమకూర్చినారటభయములేదుర తమ్ముడాశీలవతివే చెల్లెలాగ్రామ పంచాయతులు పెట్టిపేదలకు నిధి పంచినారటపల్లె నుండీ ఢల్లిదాకాసోషలిజమే పారుతుందట వంతపాడర తమ్ముడాగొంతుకలపవె చెల్లెలా పదవికయినా కొలువుకయినాతెలివి ఒక్కటె గీటురాయటకులమతాలను చంపినారటరామరాజ్యము తెచ్చినారటఅందుకొనరా తమ్ముడాఆడిపాడవె చెల్లెలా అధిక ధరలను ఆపినారటదోచువారికి జైలు శిక్షటదేవళమ్ములు నిలిపినారటముక్తి మార్గం చూపినారటపూజ సలపర తమ్ముడాపున్నె మొచ్చునె చెల్లెలా ప్రణాళికల పరిమళాలటప్రతి గృహానికి ప్రాకినాయటనిరుద్యోగమ పొమ్ము పొమ్మనికొత్తగొంతుక విప్పుతారట సహన ముంచర తమ్ముడాఆలకించవె చెల్లెలా ఎవరి ప్రాణము
కవిత్వం

వినవమ్మా…

నీకు 75 ఎండ్లంటా..రోడ్ల వెంట నివాసం ఉన్నకాలి కడుపును నింపలేనందుకు,ప్రతి పుట సంబరాలు జరుపుకో.. సడక్ సందులో గుడిసేపైకప్పు లేదు,త్రివర్ణ పతాకాన్ని కప్పుదాం అంటే,శుద్ధ నీతులు చెప్పే "దేశ భక్తుల" కత్తులుఎక్కడ నా కడుపులో దిగుతాయని భయంగా ఉంది తల్లి.. నువ్వు నన్ను కన్నవంట కదమ్మ,నా జననం మురికి కాలువలోఎందుకు జరిగిందో,కొంత మంది పుట్టుక అద్దాలమేడలో ఎందుకు జరిగిందో నాకిప్పటకి తెలియదమ్మా.. మూడు రంగులునీకు అలంకరిస్తున్నరమ్మా..మాకేంటి తల్లి ఎప్పటికి జీవితాల్లో"నలుపే" కనపడుతుంది..? 75 సంవత్సరాల వయసున్న నీకు..నా దుఃఖం ఎప్పుడు వినపడుతుంది చెప్పమ్మా..?
కవిత్వం

ఎగరేద్దాం జెండాని

ఎగరేద్దాం జెండానిఆగస్టు 15 ఆనవాయితీ గదాఎగరెయ్యాల్సిందే!అయితే‌ నాదో విన్నపం…ఎవరెవరికి ఏయే సమస్యలున్నాయోఅన్నిటినీ దారంగా కట్టిమరీ ఎగరేద్దాం!.కష్టాల్నీ,కన్నీళ్ళనీ,బాధల్నీ,దీనుల గాధల్నీజెండాకు కుట్టి మరీ ఎగరేద్దాం! తస్మాత్ జాగ్రత్త!జెండా ఎగరెయ్యకపోతేNIA వాళ్ళుమన ఇళ్ళ కొస్తారుఢిల్లీకి వచ్చి సంజాయిషీ ఇమ్మంటారుఎందుకొచ్చిన ఖర్మ?ఎగరేద్దాం జెండాని!75 ఏళ్ళుగాపేదల నిట్టూర్పులఉసురు పోసుకున్నజెండాని ఎగరేద్దాం! ఇంటింటిపై ఎగిరిన జెండాలుఆగస్టు 15 తర్వాతవీథుల్లో,చెత్త కుప్పల్లోపడి దొర్లాడుతుంటేపాపం పింగళి వెంకయ్యఎక్కడున్నాడో!ఆయన ఆత్మకుశాంతి కలగాలనిలేని దేవుణ్ణి ప్రార్థిద్దాం!47 లో డాలర్ కునాలుగు రూపాయలేఈనాటికి80 రూపాయలయ్యాయనిచంక లెగరేసుకొనిఎగరేద్దాం జెండాని!దేశంలో ఎన్ని సవాళ్ళు!ఎన్ని ఉరితాళ్ళు!నోళ్ళు తెరుచుకొంటున్నఎన్నెన్ని జైళ్ళు!అన్నిటినీ గానం చేస్తూఎగరేద్దాం జెండాని!ఎగిరే జెండాని చూసిప్రజా స్వామ్యంవిరగబడి నవ్వకముందేమత్తు వదిలినిద్ర లేవకముందేఎగరేద్దాం జెండాని!
కవిత్వం

 క‌వితా ప‌రాగం

1. ఆశ‌ ఎవరో ఒకరు  నీ తలపై గురిపెడుతూనే వుంటారు ప్రతి క్షణం  నీ చుట్టూ నిఘా పెడుతూనే వుంటారు నీ ఆలోచనలు  సీతాకోకచిలుకలుగా మారి  ఎగరక ముందే  నీ రెప్పలపై ఇనుప తెర వేస్తారు నీ గొంతుపై ఉక్కుపాదం మోపుతారు నీ కాళ్ళకు సంకెళ్లు చుట్టుకుంటాయి ఎవరూ నీ వెంట రాని కాలంలో నువ్వే ఒక‌ ఆకాశం కావాలి నువ్వే ఒక సంద్రం కావాలి నువ్వే ఒక సమూహం కావాలి 2. ఆకాశం వర్షించే వరకూ అతడు లేచి వస్తాడు  ఆమె తోడుగా  రక్తం చిందించిన‌ వారెప్పుడూ తిరిగి వస్తారు అదో భరోసా నీకూ నాకూ అతడు
కవిత్వం

ఉంటాం, అంతే

బతికున్న చావులు లెక్క కట్టడం ఎవరికీ సాధ్యం కాదు మానసిక మరణాలకు ప్రభుత్వం ఎన్నటికీ దోషి కాదు రాజ్యం తన పని తాను చేసుకపోతోంది అడ్డుతగలకండి దరాఘాతానికి వంటిల్లు మూర్చిల్లింది సర్కారును ఎవరూ నిందిచకండి వారు భక్తిరసంలో మునిగి ఉన్నారు పూజా ద్రవ్యాల రేట్లు తగ్గించండి పస్తులుండైనా భజనలు చేస్తాం రెండు పూట్ల భోజనాలను రద్దు చేసుకుంటాం ఒకపూట తిని ఓటు కోసం బతికుంటాం మీరు శూలాలు విల్లంబులు గదలు మేము ఆయుధాలను మోసే బంటులం ఏ అబద్దాలనైనా దృశ్యకావ్యాలుగా మలిస్తే మేము శవాలుగా చప్పట్లు కొడతాం మా పిల్లలకు ప్రేమ స్నేహం దయ పదాలను పలకపై దిద్దించడం