కవిత్వం

ఎంపిక

నేనేమీసుడిగాలుల పిడి గుద్దులకుతుఫానుల రౌడీతనానికీచలించిపోయే గోడను కానుభూమి లోలోపలి పొరల్లోపాతుకు పోయిన రాయినీ కానుగుచ్చుకొన్న దుఃఖపుసూదుల చురుక్కుమనే పోట్లకుపట్టించుకోని తనపు నిర్లక్ష్యపు కత్తిగాట్లకువిలవిలలాడే సున్నితత్వాన్నిగుడ్డులో నుంచి అప్పుడే రెక్కలు విప్పుకొంటున్న సౌకుమార్యాన్నిప్రతి చిన్నదానికీ కరిగి కురిసే చినుకునునా రెక్కల్ని ముక్కల్ని చేసేహక్కు నీకెవరిచ్చారుఅమ్మ గర్భాంతరంలోఉమ్మనీటి తటాకం నుంచిబాహ్య ప్రపంచంలోకి రాగానేఅలా ఉండు ఇలా ఉండకుఈ విధి నిషేధ సూత్రాలే కదానా బ్రతుకు వ్యాకరణం నిండాఈ ప్రపంచపు సూర్యకిరణాల వర్షంలో తడవకుండానా దేహ పుష్పానికీ గాలిసోక కుండాకప్పేసిన ఈ నల్లని ముసుగేమిటి?అసలు నా కట్టుబొట్టుపైపరాయి పెత్తనమేమిటి?నా ఊపిరి మీద నా బట్టల మీదఒకరి ఆజ్ఞ లేమిటిన్యాయమూర్తులైనా పాలకులైనామీ నిర్ణయాలతో పనేమిటిఇక
కవిత్వం

‘మన కాలం పిల్లలు’

మేము మన కాలపు పిల్లలం.ఇది రాజకీయ కాలం.దినమంతా, రాత్రంతాఅన్ని వ్యవహారాలు, మీవి, మావి, వాళ్ళవి -అన్నీ రాజకీయ వ్యవహారాలేమీకిష్టమైనా, కాకపోయినా.నీ జన్యులకి రాజకీయ గతం వుందినీ చర్మం ఒక రాజకీయ కులంనీ కళ్ళు ఒక రాజకీయ దృష్టినువ్వేం చెప్పినా అది ప్రతిధ్వనిస్తుందినువ్వేం చెప్పకపోయినా దానికదే ఒక వ్యక్తీకరణ.కనుక రెండు విధాల నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావు.నువ్వు అడవిలోకి ఎప్పుడైనా పోతున్నప్పుడు కూడనువ్వు రాజకీయ కారణాలతో రాజకీయ ఎత్తుగడలే వేస్తున్నావు.వి/రాజకీయ కవితలు కూడా రాజకీయమేమామీద ప్రకాశిస్తున్న చంద్రుడుఇంకెంత మాత్రమూశుక్ల వర్ణము కాదుఅస్తిత్వంలో ఉన్నామా లేమాఅదీ అసలు ప్రశ్న.అది జీర్ణం చేసుకోవడం కష్టం కావొచ్చుకాని అది ఎల్లప్పుడూ ఒక రాజకీయ ప్రశ్న.రాజకీయ అర్థాన్ని
కవిత్వం

కాల్చిన బూడిద కుప్ప కింద

సత్యం ** సత్యమిపుడు సంకెళ్ల కింద రక్తమోడుతూ ఉండవచ్చు జైల్లో అండా సెల్లో అనారోగ్యంతో కునారిల్లుతూ ఉండవచ్చు ముస్లిం మొహల్లాలలో మురికి వాడల్లో, ఒంటరి పొలాల్లో ఇరుకిరుకు బతుకుల్లో కప్పబడి ఉండవచ్చు అడవిలో గూడేల్లో కాల్చిన బూడిద కుప్ప కింద ఊపిరాడక గింజుకోవచ్చు.. ఇంద్రావతి అలల మీద శవమై తేలి యాడ వచ్చు కోర్టు మెట్ల మీద దిగాలుగా కూర్చుని దిక్కులు చూస్తుండవచ్చు అనేకానేక కమిషన్ల కింద, కేసుల కింద, తీర్పుల కింద శాంతి భద్రతల ఇనుప మూకుడుల కింద ఖండ ఖండాలుగా నరుకబడి ఉండవచ్చు దాన్ని సముద్రంలో ముంచండినిప్పుల్లో కాల్చండిఏడేడు నిలువు ల లోతునభూమి లోపల పాతిపెట్టండి
కవిత్వం

వస్తున్నాను

లేను నేను ఏ కర్రెగుట్టల్లో మధ్య భారతాన్ని ఏలే ఏ దండకారణ్యంలో దిక్కులు దద్దరిల్లే ఏ యుద్ధ క్షేత్రంలో తిరగపడ్డ ఏ గలాల గర్జన పరిధిలో దూసుకొచ్చే ఏ తూటాల దారిలో అయినా నాలో యుద్ధ చురకలు ఉరకలెత్తుతున్నాయి అమరుల గుండె నెత్తుటి వేడి నాలో ప్రవహిస్తుందివెనుతిరగని వీరత్వం అటు వైపుగా నడిపిస్తుందినా ప్రశ్నకు నీ సమాధానం తూట అయితే నా ధైర్యాన్ని చంపే ఆయుధం నీ దగ్గర లేదంటాను నా గమనాన్ని నిలిపే ముగింపు మరణమే అయితే నా ఆలోచనలను ఆపే నీ బలగాలు సరిపోవంటాను తిప్పుతాను దిక్సూచినై నీ వైపు అందరి చూపులని కాల్చుతాను నిప్పునై
కవిత్వం

మొక్కలను నాటుదాం

నీళ్లతో కాదు ఇప్పుడు ఆ నేలంతా నెత్తురుతో సాగు చేయబడుతుంది రండి మనమంతా కలిసి మొక్కలు నాటుదాం మోదుగు పువ్వులను ఆరుద్ర పువ్వులను అరుణతారలను కాస్త దగ్గరగా నాటుదాంఒకనాటికి ఎర్రని పువ్వుల వనాన్ని తయారు చేద్దాం మీకు తుపాకీతో ఎవరైనా కనబడితే ఒక మొక్కను నాటమని చెప్పండి నీడ వారికి కూడా అవసరమే కదా మొక్కలను నాటి నాటి చివరకు మీరు అలసిపోతే మీ కంటిమీద కునుకు ఏదైనా వస్తే ఇక్కడే ఇలాగే కాస్త విశ్రాంతి తీసుకోండి మీ చేతులకంటిన మట్టిని ముద్దాడడానికి మీరు నాటిన మొక్కలను చూడడానికి ఒక ఉదయాన తూర్పు కొండల నుండి ఎర్రని సూర్యుడు
కవిత్వం

సత్యమెప్పుడూ ఓడిపోదు

ఒక్కొక్కరూ నిన్ను చెరిపేస్తామని చెప్పే వాళ్ళే కానీ ప్రతి సారీ నువ్వో కొత్త చరిత్రగా నెత్తుటి సంతకంగా వేలాది పుటలుగా వెలుగొందుతున్నావు కోట్లాది ప్రజల ఆకాంక్ష కలలు నీలో దాగున్నవి వాటిని ఛిద్రం చేసేందుకు వాడెప్పుడూ ఆయుధాలనే నమ్ముకున్నాడు కానీ నువ్వెప్పుడూ నిరాయుధ ప్రజల చేతులలో సుత్తి కొడవలి నాగలిపనిముట్లతోనే ఇన్నేళ్ల యుద్ధాన్ని పోరాడుతూ సేద్యం చేస్తున్నావు పుడమీ ఆకాశమూ సూర్యుడూ చంద్రుడూ తోడుగా సాగే బాట నీది వాడెప్పుడు ఏవేవో కుట్రలు కుతంత్రాలతో నిన్ను ఓడిద్దామని విరుచుకు పడుతుంటాడు కానీ గడ్డి పరకలతో ఏనుగును బంధించిన చేతుల చేవ నీదని చరిత్ర చెబుతోంది మనుషులను చంపితే నిన్ను
సాహిత్యం కవిత్వం

చేతనాస్తిత్వం

సంధ్యాకాశంలో కదులుతున్న సూర్యుడు చేతనలోంచి అచేతనలోకి వెడుతున్నాడు దూసుకొస్తున్న పున్నమి చంద్రుడు సుషుప్తిలోంచి సృజనలోకి వస్తున్నాడు నుసిలా రాలుతున్న చీకటిని కప్పేస్తున్న వెన్నెల వెలుగు దూరంగా వెలుగుతూ మలుగుతున్న చుక్కల రాయబారం ఘనీభవించిన నిద్ర మీద నిప్పురవ్వలా జ్వలిస్తున్న కలల దీపం ముఖం వాల్చిన పెరటితోటలోని పొద్దుతిరుగుడు పువ్వు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బావి గిరక మీద కూర్చున్న ఊరపిచ్చుకల కిచకిచలు అస్తిత్వం చేతనమై కురుస్తున్న వాన చినుకులు చీకటిలోంచి తొంగిచూస్తున్న వెలుగురేఖల దృశ్యం దూరపు కొండలను స్ఫృశిస్తూ సంక్షోభంలోంచి స్పష్టతలోకి సంక్లిష్టతలోంచి సంఘర్షణలోకి సందేహంలోంచి సందోహంలోకి జ్వలిస్తున్న సూర్యుడు
సాహిత్యం కవిత్వం

బహిష్కరిద్దాం

తడికలు అడ్డెట్టి తెల్ల గుడ్డ కట్టి అదే వెండి తెర భావనలో నేల పై మూడు గంటలు కూసుని చూసిన సినిమా నేల టికెట్ నుండి కుర్చీ దాకా జనం ఎగబడితే ఏడాదీ ఆడిన సినిమా కథలో అదే మూస కథనంలో కొత్తదనం కాసులు కురిపించిన సినిమా రీళ్ళ డబ్బాలు టాకీస్ టూ టాకీస్ ఓ మాదిరి పెద్ద వూరిలో ఓ టాకీసు సినిమా బండ్లు పోటాపోటీ పోస్టర్లు మైదాతో గోడలపై వినోదాన్ని పంచిన సినిమా మూకీ నుంచి టాకీ దాకా నలుపు తెలుపు నుంచి రంగుల బొమ్మ దాకా సాంకేతిక హంగుల హోరులో పెంచుకున్న బడ్జెట్ సినిమా
సాహిత్యం కవిత్వం

చివరిదాక

కలంతో కరచాలనమై అక్షరాలను అల్లుకుపోతూ అజ్ఞాతంలో దశాబ్దాలు గడిచిపోయాయి సింహవలోకనంలో గమనా గమనమై నైనాగా ఉప్పెనైపోతూ ప్రజలు అజేయులంటూ రెండుపాదాలు చివరిదాక నడిచాయి చీకటిని శిథిలంచేసే సూర్యోదయకిరణాల కోసం గుండెలుమీద పెంచుకున్న బిడ్డలకు నడకనేర్పిన సింధూరాలు నాలుగుసింహాలు నాలుగుదిక్కులు దారులుమూసి ట్రిగ్గరమీద వేలుపెట్టినా రంగులు మార్చే ఖాకీలు కనికరమైనట్టు నోట్లకట్టలపై నడిపిస్తామన్నా భయమైపోయి కాసులముందు కన్నీరై తలవంచని  తల్లీ లలితమ్మ
కిటికీ పక్కన సీటు
కవిత్వం

కిటికీ పక్కన సీటు

ప్రపంచాన్ని కిటికీలో నుండి చూడడం మీకు అనుభవమేనా.. చల్లని గాలి తనువును తాకుతుంటే జ్ఞాపకాలు మనసును తాకుతుంటాయి పరిసరాలు వెనక్కు పోతుంటే పాత గుర్తులన్ని ముందుకొస్తుంటాయి.  బస్సుతో పాటు టైరు ఆడుతూ  బస్ వెనకాలే పరిగెత్తే పసివాడు మళ్ళీ మన పసితనాన్ని గుర్తు చేస్తాడు బస్ కోసం పరిగెత్తుతూ  వస్తున్న తల్లెంట  వెనకాలే ఏడుస్తూ వస్తున్న చిన్నోడు మన బాల్యాన్ని  బావిలోనుండి నీళ్ళు తోడినట్లుగా తొడుతుంటాడు. ఐదో తరగతి చదివే పిల్లవాడి తల్లిని కండక్టర్ టికెట్ అని అడిగితే మావోడు ఒకటో తరగతే అని అమ్మ చెబితే.. అమ్మ అమాయకత్వ ఆన్సర్ కి  బస్ ఎక్కినప్పుడల్లా మన చదువు