కవిత్వం

కొలమానం

మీ అమరత్వాన్ని కొలవఎన్ని పదాలు చూసినాఎంత సాహిత్యం వెతికినాఏవి సరిపోవటం లేదు.యాభై ఏళ్లుగా త్యాగాలను ముద్దాడుతూతడియారని ఆశయాలతోఊత కర్రలతో నడుస్తూదేశ విప్లవానికి ఊతమైపండుటాకులై కూడాపాలకుల వెన్నులోచలి జ్వరం పుట్టిస్తూవిప్లవాన్ని నిలబెడుతూమిమ్ము కాల్చినాబూడిద చేసినారాజ్యానికి చెమటలు పట్టిస్తున్నమీ త్యాగాలను కొలవఏ భాషలో చూడాలిఏ గ్రంథంలో వెతకాలిమీ భుజాలపై ఎగిసినఎర్ర జెండా సగర్వంతో మురిసిపోతూమరింత ఎర్రగాకాంతులీనుతుంది.ఆ జెండా రెపరెపలేమీ త్యాగాలకు కొలమానం.
కవిత్వం

పూల కాంతి

దేహమంతా సూదిపోట్ల సలపరం పాదాలు ఏనుగేదో తొక్కిపెట్టినట్లు లోలోపల కరకరమమంటూ బాధ తనువంతా రెండు ముక్కలయినట్లుగా భారంగా వేలాడుతుంది కను రెప్పలనెవరో పిన్నులతో ఎక్కుపెట్టినట్లు నిదుర ఎక్కడికో తనను మరచి పారిపోయినట్లుంది రక్తాన్ని తోడుతున్నదెందుకో ఎన్ని పరీక్షలు చేసినా చివరాఖరికి ఏదీ కొత్తగా చెప్పారో తెలియని అయోమయం చికిత్స తెలిసినట్లే వున్నా దేహమెందుకో మొరాయిస్తుంది ఈ తెలవారని రాత్రి మరో ఉదయాన్ని మాత్రమే హామీనివ్వగలుగుతోంది పున్నమి వెన్నెల రాజి గూడులా తన కంటి చుట్టూ వలయాలు అయినా తను పగలబడి నవ్వినప్పుడు అడవి చుట్టూ వెలుతురు పూల కాంతి!!! (కామ్రేడ్ సహోదరికి ప్రేమతో)
కవిత్వం

వివేక్ కవితలు రెండు

ఫాసిస్టు కత్తిపై నా భావాలను, కలాన్ని నీ ఫాసిస్టు కత్తితో నరికినంత మాత్రాన నేను అంతమై పోను అంతకన్నా అదృశ్యమై పోను దోపిడీ వ్యవస్థలో బుసలు కొడుతున్న నీ ఫాసిస్టు భావజాలాన్ని కూకటి వేళ్ళతో సహా అడ్రస్ లేకుండా పెకిలించడానికి నా సైన్యం కలంధారీ, ఆయుధధారీ పదునెక్కుతోంది చిందిస్తున్న నా నెత్తురుతో తడిసిన నెల పొరల్లోంచి పోరు విత్తనాలు మొలకెత్తి నలుమూలల విస్తరించి నీ అంతాన్ని చూస్తాయి. బిగించిన పిదికిలి మా ఆయుధం శతృవు తూటాలకు దడిస్తే ఒక్క తూటా శబ్దమే నిన్ను అవహించి నీ ప్రాణాన్ని వెంటాడుతుంది కామ్రేడ్ నీ లక్ష్యసిద్ధికై పిడికిళ్ళు బిగించి యుద్ధానికి సిద్ధమైతే
కవిత్వం

పలమనేరు బాలాజీ కవితలు మూడు

1. లేనప్పుడు " అప్పుడు గాలి చొరబడదు మాట నిర్మాణం కాదు మనిషి లేనప్పుడే ఉనికికి అర్థం, విలువ! అప్పుడు రాత్రి ఎంతకూ కదలదు రాత్రంతా.. వస్తువులు మాట్లాడుతుంటాయి మనిషి లేనప్పుడు వస్తువులు పుస్తకాలు బొమ్మలే మనుషులవుతాయి, మాటలవుతాయి. అప్పుడు ఏదీ కుదరగా ఉండదు ఎడబాటు తర్వాత సుదీర్ఘ తడబాటే! అప్పుడు పొలమారినట్టు , పొగ చూరినట్టు, మబ్బు కమ్మేసినట్టు కళ్ళ ముందరి వాళ్ళు కన్నీటి పొరలైనట్టు... అప్పుడు మాట్లాడనీ, పోట్లాడనీ అలగనీ, అదిరించనీ, బెదిరించనీ,భయపెట్టనీ.. నీ... నీ...నీ..... అప్పుడు లోకంగా,ప్రాణంగా,దేహంగా ఉండనీ... మనసుని, మనిషినీ, మనసైన మనిషినీ !! 2. కొత్తగా.. ప్రేమించే వాళ్ళు కాబట్టే -వాళ్ళట్లా
కవిత్వం

నా నగర మేదీ

** నా నగరం కోసం వెతుకుతున్నా.. ఎక్కడుందది ఎక్కడుండేదది జ్ఞాపకాలు మసక బారుతున్నాయ్ మస్తిస్కం మొద్దుబారి పోతున్నది అది గోద్రా మురికివాడల్లో ఉండే ది నర్మదా లోయలో తచ్చాడుతుండేది కాదు కాదు . అది హాశింపుర కాలువలో శవమై తేలి లోకాన్ని దిగ్భ్రాంతికి లోను చేసింది నెల్లి మారణకాండలో మౌనంగా దుఃఖించింది కాదు ,కాదు.. అది బస్తర్ మారణకాండలో కల్లోల కాలానికి సాక్షిగా నిలిచింది జీలం నది ఒడ్డున గాయాలతో సొమ్మసిల్లింది. అది కూచిబెదార్లో ఉండేది నంది గ్రామ్ లో ఉండేది జఫ్రాభాగ్, చాంద్బాగ్ ఎన్నని చెప్పను మర్చిపోతున్నా అలసిపోతున్నా నన్ను నేను నిలబెట్టుకోవడానికి నాతో నేను నిరంతరం
కవిత్వం

అనిశ్చయం

రాత్రి నేను ప్రార్ధించేసమయంలో తోడెళ్ళు యోనిని గాయపరుస్తాయి లాఠీ చేయకూడని తప్పు చేస్తుంది వైద్యం కరెన్సీ పడక మీద నిద్దురపోతుంది ఆకలి బాధ గడ్డకట్టుకపోయి నిశ్చలమవుతుంది అప్పులనీడ ఊరితాడై కుటుంబాన్ని జనాభా లెక్కల నుంచి వేరుచేస్తుంది పేద , మధ్యతరగతి మనుషులు సగం రాత్రి చచ్చి మిగతా సగం పగలు చావడానికి దేహాల్ని దాచుకుంటారు భద్రత లేని లోకంలో పండుముఖాలు నిరాశ శూన్యాలై లోలోన గొణుక్కుంటూ ఉంటాయి ఎక్కడో పసినిద్ర ఉలిక్కిపడుతుంది భ్రమల్లో బతుకుతోన్న ఆశలు కోడినిద్దురతో కుస్తీ పడుతుంటాయి.
కవిత్వం

ఉదయ్ కిరణ్ కవితలు

1ఓ యుద్ధ ప్రకటన చుట్టూ గోడలపై వున్న అక్షరాలన్నీ ఏకమై మరో కొత్త యుద్ధాన్ని ప్రకటించినట్లు మూలకున్న ముసలవ్వలా ఆ పాత గొంగడి ఎర్రగుడ్డ నా భుజాన్ని తట్టి ముందుకు నడిపినట్లు నాలోని కటిక చీకటికి ఎడిసన్ బల్బులు ప్రపంచాన్ని వెలిగించమని సైగ చేసినట్లు కాలువలై పారుతున్న నా కన్నీళ్ళను తుడవడానికి ఆ పాత పుస్తకాలే కదా! మరో కొత్త మార్గాన్ని చూపించే సన్నిహితులు. మరి ఇంకెందుకు ఆలస్యం? దేశమంతా మతపిచ్చితో మారణహోమంలో మునిగిపోతుంటే మరెంత కాలం.... ఆ నాలుగు గోడల మధ్య స్వప్నపు కాంతులంటూ కలలు కంటావ్? లే.......! ఆ చీకటి ప్రపంచంలో నుండి బయటికి రా....
కవిత్వం

నెలబాలుడు

అడవి ఇప్పుడు గాయపడింది వెదురు వనాలు నరికి వేయబడ్డాయి మహా వృక్షాలు కూకటి వేళ్ళతో పెళ్ళగించబడ్డాయిపులులు జింకలు అభయారణ్యాలకుతరలింపబడ్డాయినెమళ్ళు గోరపిట్టలు వలలలో చిక్కుబడ్డాయికాకులు దూరని కారడవి దారులన్నీ బుల్డోజర్లు చేరాయి భూమి గర్భంలోకి గునపాలు దిగి పుడమి పొత్తిళ్ళుచీల్చబడుతున్నాయివీరులంతా నేలపై ఒరుగుతూనెత్తుటి బాట వేస్తున్నారుచివరిగా వారి ఆశయాన్ని అందుకొనితూరుపున నెలబాలుడుఉదయిస్తున్నాడు!!
కవిత్వం

భంగపడ్డ ఏకాంతం

సాయం సంధ్య వేళ ఒంటరిగా ఇంటి పైకప్పు మీద కూర్చుని వినీలాకాశం చేసి ఆశగా చూస్తాను చల్లని పిల్లగాలి నా ముఖాన్ని ముద్దాడుతుంది ఒక్కోసారి మృదువుగా, ఒక్కోసారి కవిత్వంగా ..ఒక్కసారిగా ఈ ప్రపంచమంతా నాదేనని ఈ నా ఆకాశం నా చేతుల్ని మృదువుగా, దృఢంగా పట్టుకుని నీలి మేఘాల మీద నడిపిస్తున్నట్టనిపిస్తుంది కానీ ..ఒక్క ఐదు నిమిషాలు కలల రెక్కల మీద ఎగురుతానో లేదో నే పాడిన ఫైరుజ్ పాట "కెనడాలో ఒక చిన్న ఇల్లు" లోని వినూత్న ,సుందర జీవితం ఆస్వాదించే లోపల ఓ భయానక విస్పోటనం...పాట బద్దలైరక్తమోడుతదివినీలాకాశం బూడిద రంగుతో మసకబారుతది ఎటువంటి హెచ్చరిక లేకుండానే
కవిత్వం

విప్లవం అజేయం

అవును...వాళ్ళిప్పుడు రాజ్యం చేతిలోదెబ్బమీద దెబ్బ తింటున్నారు.. వాళ్ళ సహచరులెందరో అమరులవుతున్నారు...నిజమే..సామ్రాజ్యవాదుల, దళారీ కార్పొరేట్ల ఆజ్ఞల్ని శిరసావహించిన కాషాయ అష్టదిగ్బంధనంలో వాళ్ళ 'పొత్తిళ్ళలోని ప్రజాసైన్యం'చుట్టుముట్టివేయబడుతున్నది.నిజమే..జనతన సర్కార్....వాళ్ళ నాలుగు దశాబ్దాల శ్రమ ఫలితం.. అదొక ఒక ప్రత్యామ్నాయ ప్రజా స్వయం పరిపాలనా యంత్రాంగం...అదొక భవిష్యత్ సోవియెట్ నమూనా.. దాన్నిప్పుడుహస్తినాపుర రాక్షస కబంధహస్తాలు చిదిమివేస్తున్నాయి...నిజమే.. అయినప్పటికీ ...వాళ్ళ ఈ ఓటమి తాత్కాలికం...గెరిల్లా స్థావరప్రాంతాలు గెరిల్లా ప్రాంతాలుగా, గెరిల్లా ప్రాంతాలు గెరిల్లా స్థావరప్రాంతాలుగాచేతులు మారడం ప్రపంచ విప్లవ చరిత్రలో అపూర్వం కాదు. అంచేత...ప్రపంచవ్యాప్త విప్లవ పరిస్థితి అంతకంతకూ తీవ్రమవుతున్న నేపధ్యంలోవాళ్ళు త్వరలోనే దెబ్బకాచుకొని లేచినిలబడతారు. జబ్బచరిచి లేచినిలబడతారు.తప్పదు...వాళ్ళు తాము తలపడుతున్న భారత రాజ్యంఅత్యంత శక్తివంతమైన