కవిత్వం

కవితా పరాగం

కిటికీ కవితలు - 1 ఒట్టి కిటికీ అనే అనుకుంటామా..ఏదో కాసింత గాలీ , వెలుతురు ఇస్తుందని ప్రేమ దానిపై..కానీ ..నాకనిపిస్తుంది..కిటికీకి దేహం ఉంది.హృదయమూ ..కళ్ళూ ఉన్నాయి.అది ఎలా చూస్తుందనుకున్నారు?బయట భళ్ళున తెల్లవారటాన్ని?లోపల ..కలలు కరిగి కన్నీరైన చీకటి రాత్రుళ్ళని?కిటికీకి ఉపిరితిత్తులున్నాయి..గది లోపలి మనుషుల ఆశ నిరాశలను…ఊపిరాడ ని ఉక్కిరిబిక్కిరి తనాలను తను కాదూ శ్వాసించేది..శ్వాసఇచ్చేది? కిటికీ..ఒకసారి అమ్మ అయిపోయి..మరోసారి నాన్నగా మారి పోతుంది.కిటికీ ..తనని పట్టుకుని వేలాడే మనుషుల దుఃఖంతో….దీర్ఘ సంభాషణ చేస్తుంది… వాదోపవాదాలు చేస్తుంది.రెక్కలు చాచి..ఒంటరి మనుషుల్ని కావలించుకుంటుంది.అమ్మ దేహం మీది వంటింటి వేడి సెగలని.. చమట ను చల్లని గాలితో చల్ల బరుస్తుందివిరహాన వేగిపోయే
కవిత్వం

ఒక ఎండా కాలపు దాహం    

ఈ వేసవి కాలందోసిళ్ళ లోంచి క్షణాల్ని ఒంపుకుంటూగొంతులోని తడిని ఎగరేసుకుపోతూఎండను రాల్చుకుంటుంది .ఇంటిలోంచి కళ్ళు బయట ఆరేస్తే చాలుపిల్లలు మూగిన ఐస్ క్రీం బండిబాధ్యత రెక్కల్ని విప్పుతుంది .కన్నీటి దుఃఖాల్నిలోలోపల ఆరేసుకుంటుంది .ఇంటి  లోపల ఉతికిన వస్త్రాల్ని చూస్తే చాలు బయట ఎండలోవయసు భారాన్ని లెక్కచేయనిఇస్తిరి పెట్టి ముసలివాడుబొగ్గుల నిప్పుల్లోంచి జీవితాన్ని చూపిస్తాడు .ఎండ పేలిపోతున్నబండి కదలదు .శ్వాస ఆగిపోతున్నబతుకు పోరాటం ఆగదు .చూపులు తిప్పుకునినీటి టబ్బు వైపు చూస్తే చాలు గడపలో నీటి కోసం కాకులుఊగుతుంటాయి.నీట మునుగుతుంటాయి . ఒక ఎండా కాలం నీటి స్పర్శ కోసంగొంతులు మధన పడుతుంటాయి .నా చుట్టూ ఎండను తీసిగొడుగులా  కాసిఒక్కో గొంతులో నీటినిపోసిస్వచ్ఛంగా  స్వేచ్ఛగాపక్షిలా బతకాలనుంటుంది .ఒక ఎండాకాలపు దాహంమనిషిని కాల్చకుంటే ఎంతబావుణ్ణు.చినుకునై కురిస్తే ఇంకెంత బావుణ్ణు . ===========================
కవిత్వం

కవితా పరాగం

తేనె ఫలం1.ఆ మెత్తటి ఇసుకతిన్నెల్లోపడ్డ నీ పాద ముద్ర లోఒలికిన నా చూపు లోసగం చీకటిసగం వెలుతురు ఇప్పుడు..2.ఎంత తీరైన నడకఇసుక పై రంగవల్లి అల్లినట్టుఏ తోట్రుపాటు లేదురంగు జాతీయత పట్టింపు లేనిఆలింగనపు మహత్తుపాదాన్ని నేల ముద్దాడుతుందిమాటని పెదవి విహంగం చేస్తుందిభాష కు భవబంధాలు తెలియవుపరిస్థితులతో సంబంధం లేని పయనం నీదిమన్ను దేహంగా పొందిన నదిలాంటిది నీ ప్రయాణంఎడారి స్థితికి వాన మీదావానకి ఎడారి మీదా మమకారం పెంచిఒకే రకమైన ప్రేమ ను పంచిప్రేమ తెలియని ప్రాంతాల్లోనీ కనుచూపును చిలకరించినవ్వుల్ని మొలిపించేసేద్యం నీ పధంవెలుతరూ చీకటి విత్తులుగా నాటిమానవత్వపు పంట పండించడంనీ వృత్తి3.ఎడారి తిన్నెల మీంచి మట్టి వేణువు
కవిత్వం

వరి

నా నేల రకం నాకెరుక పదును చూసి విత్తడం నా జ్ఞానం చిన్న మళ్ళుగా  చేసుకోవటం నా అనుభవం నా నేల నా ఇష్టం నా విత్తనం  నా నేలలో నిరుడు పండిందే మోట కొట్టిన నాటి నుండే వరి నా నేలన సుఖం మేమెరుగం నా ఎడ్లూ ఎరుగవు నా తిండికి నేను వాటి మేతకు అవి కష్ట పడటం అలవాటు నీళ్ళు పట్టి తొక్కి తొక్కి దున్ని దున్ని మట్టంతా మెత్తగా బురదగా చేయటమంటే ప్రతిభ కాదా! మడంతా చదును పెద్ద చెక్కను గుంజే నాఎడ్ల సత్తువ గట్ల మీది చెట్ల ఆకులు బురదలో తొక్కే
కవిత్వం

నాకిప్ప‌డు  న‌ది కావాలి

నాకిప్పుడు కావల్సింది సూర్యునితో పాటు తిరిగి చీకటికి తలవంచిన పొద్దుతిరుగుళ్లు కాదు చీకటిలోను తలవంచని ఎర్ర మందారాలు కావాలి వాటి పరిమళాలు కావాలి నాకిప్పుడు కావల్సింది కొద్ది జల్లులకే నిండి కొద్ది ఎండకే ఎండిన కుంటలు కాదు కుచించుకుపోని యాంగ్సీ లాంటి నదులు కావాలి దాని ఘర్జనలు కావాలి నాకిప్పుడు కావల్సింది వసంతంలో మాత్రమే ఎగిరే బురక పిట్టలు కాదు ఏ కాలంలో నైనా పైకెగిరే ఫినిక్స్‌ పక్షులు కావాలి వాటి వేగం కావాలి నాకిప్పుడు కావల్సింది బిగించిన పిడికిళ్లు వాలిపోయిన చేతులు కాదు బందూకు చివరి వరకు దించని భుజాలు కావాలి వాళ్ల ధైర్యం కావాలి
కవిత్వం

కవితా పరాగం

1.  వొక నగ్నదేశభక్తి    చంపింది రైలేనా? రూపాయి రుచి ఎరుగని    చెమట చుక్కల్ని    ఆకలి నుండి ఆకలికి   అనంత యాత్త్రైన ఆకలి చేతుల్ని    ఆర్థికమొసళ్ళ నోటికందించింది     సుభాషితాల సింహాసనం! దేశం గిడ్డంగి    పేరుకుపోయిన ఆకలి నిల్వ!   గుర్తుపట్టని నట గుడ్డి    ఆహారభద్రత నిల్వ !!   దేశాన్ని పోతపోసే          చెమట చేతులు   ఆకలినదై     ముంచుతున్నప్పుడే     68,607కోట్ల నగ్న దేశభక్తి పొర్లి పొంగింది   సోకెవడిదో?   సొమ్మెవడిదో?     చెమట చుక్కలారా!    ఇంత నోరుంది     ఇన్ని అక్షరాలున్నై కాని    మీ
సాహిత్యం కవిత్వం

క‌విత్వ‌మూ -క‌వీ

టి. వెంక‌టేశ్ క‌విత‌లు తొమ్మిది 1నలుదిక్కులు తిరిగేదిమ్మరుల అజ్ఞాత జ్ఞానమే కవిత్వంస్వప్న మార్మికతనుసత్యంగా అనువదించేదే కవిత్వంరాసిన ప్రతిసారిఆనవాలు లేకుండానువ్వు చేసుకునే ఆత్మహత్య కవిత్వం  .2ఒడ్డున నిల్చుంటావుపడవ రాదుసణుకుంటూ వెనుదిరుగుతావుమరలిన తరువాతపడవ వచ్చి వెడుతుందిఆ రాత్రి ' ప్రయాణం ' ముగుస్తుందిపడవకు తెలియదువస్తూ పోతూ ఉంటుందిఒడ్డున నీ ఆఖరి పాదస్పర్శగాలి చెరిపేస్తుందిబతికిన పద్యంఅజ్ఞాతంగా తిరుగాడుతూ ఉంటుందిపడవ దిగిన పరదేశి ఒకరుకవిత్వాన్ని గుర్తిస్తాడుకవి మరణించిలేడని.3 అలా నీవు గడ్డకట్టినపుడుకవిత్వపు నెగడు అంటించుపద్యం వెలుగు ఓ ప్రశాంతత.4అనేకులుశబ్దం లో ఒలుకుతున్నపుడుకవికి పద్యం ఓ ధ్యానం.5వరద ఉధృతిలానీలో అనుభూతి వానకుమొలకెత్తె పచ్చి మట్టివాసన పద్యం.6ఆగిపోయి నిల్చున్నావుఅలాగే ఉండిపోకుఒఠ్ఠిపోతావురెండు పద్యాల్ని సాయమడుగుమళ్ళీ కవి జన్మ నీకు కొత్త.7చూరుకు
సాహిత్యం కవిత్వం

యుద్ధమూ – మనమూ

యుద్ధం అంటే ప్రేమ లేనిదెవ్వరికి నీకూ నాకూ తప్ప ఒకరిపై ఒకరు దాడులు చేస్తూ స్మశానాలపై జెండాలెగరేస్తారు సమాధులపై ఇన్ని గులాబీ రేకులు పోసి‌ చేతులు జోడిస్తారు కనురెప్పలకింద ఉప్పగా ఊరిన నీటిని తుడుచుకుంటూ నడిచిపోతారు రేపటికి మిగలని వాటిపై మరల కొత్త పునాదులేస్తారు సదులన్నీ కుదించబడి సముద్రపు పక్కలో ఒరిగిపోయాయి కానీ ఆ తల్లి మాత్రం కడుపు చించుకుంటోంది రాని కొడుకో కానరాని కూతురో ఇంక రారని కనుపాపల వెనక శూన్యాన్ని గుండెలకద్దుకుంటూ యుద్ధం వాడికొక వస్తుమార్పిడి యుద్ధం వాడికొక వ్యసనం యుద్ధం వాడికొక పాచికలాట యుద్ధం నీకూ నాకూ విముక్తి సాధనం యుద్ధం నీకూ నాకూ
సాహిత్యం కవిత్వం

కన్నా..

అదొక నిర్జన మైదానం అప్పుడే గతమైన బాల్యం కన్నీటి కడలి మాటున చిట్టిపొట్ట కోసం నెత్తికెత్తుకున్న పెద్దరికం నీవు పుట్టిన ఈ నేలలో విగ్రహాల నిర్మాణం అతి ముఖ్యం కూల్చివేతా వాళ్లిష్టం అయినా ఎందరికో ఊపిరి చిహ్నం శ్వేదాశ్రువులతో వెలిసిన నిండైన అంబేద్కర్‌ విగ్రహం ఆ నీడలోకి కాసేపయినారా మన బతుకు గాయానికి ఆయనే ఒక లేపనం.
సాహిత్యం కవిత్వం

ఈ క్షణం

వయసు మనుషుల్ని దూరం చేసింది మమత పురాతన అవశేషమయింది ముదిమి ఊతకర్రగా మారింది ప్రేమించడమే మరిచిపోతున్న  మనుషుల్ని వదిలి రాని కాళ్ల వెంట కానని చూపుల దారులలో చిక్కుకున్న నిన్ను ఎక్కడనీ వెతకను నా చిట్టి కూనా.. గ్రీష్మంలో మలయ మారుతంలా రాలుతున్న విత్తుకు జీవం తొడిగావు ఇప్పుడు నా మేనంతా సంతోషం అవును ఈ క్షణం అపురూపం ఉద్వేగం, ఉత్తేజం సంగీతంలా నాకు కొత్త ఊపిరినద్దుతోంది.. మబ్బులు పట్టిన ఆకాశం నా కన్నీటి తెరగా దారంతా పరచుకొంది ఈ మహా వృక్షం దాపున కాసేపు  సేద తీరుదాం ఈ క్షణం నాకెంతో అపురూపం గతం తాలూకు నీలి