అస్తవ్యస్తంగా భారత ఆర్థిక వ్యవస్థ
భారత దేశ ఆర్థిక, రాజకీయ చిత్రం పరిశీలిస్తే దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుకుందని తెలుస్తోంది. నిత్య జీవితావసర వస్తువులు గోధుమలు, బియ్యం, వంట నూనెలు, వంట గ్యాస్, పాలు వంటి వాటి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. కానీ సాధారణ కార్మికుల వేతనాలు సంవత్సరాల తరబడి ఎదుగుబొదుగు లేకుండా ఉన్నాయి. వేతన జీవుల మధ్య వ్యత్యాసం రోజురోజుకు పెరిగిపోతున్నది. విద్య, వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షగా మారిపోయింది. దేశంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తున్నది. వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుంది. గ్రామీణ నిరుద్యోగాన్ని కొంతమేర నిలువరించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను 30శాతం ఈ సంవత్సరంలో తగ్గించి