కార్పొరేట్ దురాశ వల్లే అసమానతలు
ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ఐదుగురి సంపద 2020 నుండి రెట్టింపుకు పైగా పెరిగింది. అదే సమయంలో 4.8 బిలియన్ల (480 కోట్లు) మంది అంటే జనాభాలో 60శాతం మంది మరింత పేదలుగా మారారు. ఈ లెక్కన చూస్తే ప్రపంచంలో ఏ ఒక్కరూ పేదరికంతో బాధపడకుండా ఉండాలంటే 229 సంత్సరాలు పడుతుందని అంచనా వేసిన ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ప్రచురించిన నివేదికను దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా జనవరి 14న విడుదల చేశారు. ‘ఈ అంతరాలను మేం గమనిస్తున్నాం. కొవిడ్, ద్రవ్యోల్బణం, యుద్దాలు వంటి ప్రతికూల పరిణామాలతో కోట్లాది మంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు బిలియనీర్ల సంపద