కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ
సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. మనుషులు పెట్టుబడి చదరంగంలో పావులుగా ఉపయోగించబడుతున్న సందర్భంలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా వృద్ధి సాధిస్తోందని.. ఇది మాములు విషయం కాదని ఇటీవల ప్రధాని మోడీ ఘనంగా ప్రకటించారు. ఇదే నిజమైతే భారత ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఎందుకు నెలకొని ఉందని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో నిరుద్యోగం, పేదరికం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని మూడీస్, స్టాండర్డ్ అండ్ పూర్, ఫిచ్ వంటి రేటింగ్ సంస్థలు, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(ఎన్‌ఎస్‌ఓ) ఘోషిస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థ(ఐయంఎఫ్) 2023-24 వృద్ధి అంచనాను అంతకుముందున్న 6.1 శాతం