ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతున్న మాంద్యం
కొవిడ్ తరువాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న దశలో పులి మీద పుట్రలా యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం రావడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి కుంగిపోతుందన్న భయాలు పెరుగుతున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్య్లూటిఓ) మాంద్యం తప్పదని హెచ్చరిస్తోంది. డాలర్ దెబ్బకు ప్రపంచ దేశాల కరెన్సీలు కుదేలవుతున్నాయి. డాలర్ డామినేషన్ దినదినం పెరుగుతోంది. ప్రపంచం మరో ఉత్పాతానికి దగ్గరగా చేరుకుంటోంది. ద్రవ్యోల్బణం, రుణభారం, మాంద్యం ఒకపక్క, ఇంధన కొరతలు, ఆకలికేకలు, ఎంతకీ వీడని కొవిడ్ వైరస్, యుద్ధ ప్రభావం మరోవైపు కలిసి ఏకకాలంలో మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మాంద్యం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది 2008 ఆర్థిక సంక్షోభమే.