ఆర్ధికం కాలమ్స్

పారుబాకీలతో బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభం

భారతదేశంలో అధికార బదిలీకి ముందు, తర్వాత ప్రైవేట్‌ బ్యాంకుల చరిత్ర అంతా అక్రమాలతో, మోసాలతో ముడిపడి ఉంది. వలసపాలన కాలంలో దేశంలో ఏర్పడిన ప్రైవేట్‌ బ్యాంకులు ప్రజల వద్ద నుండి వసూలు చేసిన డిపాజిట్లను తమ స్వప్రయోజనాలకు వినియోగించుకున్నాయి. ఆనాటికి ఉన్న 600 బ్యాంకులు పెద్ద పరిశ్రమలకు, వాణిజ్య వర్గాలకు పరిశ్రమల నిర్మాణం, వర్కింగ్‌ కాపిటల్‌, ఇతర అవసరాలకు రుణాలు ఇస్తుండేవి. చిన్న వృత్తులు, వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు తదితరాలకు రుణాలు అందేవి కాదు. తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించకపోవటం, వసూలుపై బ్యాంకులు తగినంత శద్ధ పెట్టకపోవటం, రుణాలు తీసుకున్న సంస్థలు చేసే మోసాలలో బ్యాంకులు కూడా భాగస్వాములు
ఆర్ధికం

అస్తవ్యస్తంగా భారత ఆర్థిక వ్యవస్థ

భారత దేశ ఆర్థిక, రాజకీయ చిత్రం పరిశీలిస్తే దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుకుందని తెలుస్తోంది. నిత్య జీవితావసర వస్తువులు గోధుమలు, బియ్యం, వంట నూనెలు, వంట గ్యాస్‌, పాలు వంటి వాటి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. కానీ సాధారణ కార్మికుల వేతనాలు సంవత్సరాల తరబడి ఎదుగుబొదుగు లేకుండా ఉన్నాయి. వేతన జీవుల మధ్య వ్యత్యాసం రోజురోజుకు పెరిగిపోతున్నది. విద్య, వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షగా మారిపోయింది. దేశంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తున్నది. వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుంది.  గ్రామీణ నిరుద్యోగాన్ని కొంతమేర నిలువరించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను 30శాతం ఈ సంవత్సరంలో తగ్గించి
ఆర్ధికం

కృత్రిమ మేధస్సు 

‘మన కలలను సాకారం చేసుకోవడానికి, మనం ఊహించలేని వాటిని సృష్టించడానికి ఉపయోగించే ఒక సాధనం- టెక్నాలజీ’ అంటాడు లైనక్స్‌ కెర్నల్‌ (ఏకశిలా, మాడ్యులర్‌, మల్టీ టాస్కింగ్‌ వంటి ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కెర్నల్‌) సృష్టికర్త లైనస్‌ టోర్వాల్డ్‌. కృత్రిమ మేధ లేదా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌... సంక్షిప్తంగా చెప్పాలంటే ఎఐ.. దీని వినియోగం ప్రపంచానికి మేలు చేస్తుందో లేదో తెలియని పరిస్థితి. అంతేకాదు... భవిష్యత్తులో ఎన్ని కొత్త మలుపులు తిరుగుతుందో చెప్పడం అసాధ్యం. మనిషి మేధస్సును కృత్రిమ మేధ అధిగమిస్తుందని నిపుణుల అంచనా. ఇప్పటికే కృత్రిమ మేధ ఎన్నో రకాల ఉద్యోగాలకు ఎసరు పెట్టింది. ఉద్యోగులను నిలువునా ముంచేస్తున్నది. డిగ్రీలు చేత
ఆర్ధికం

ఆకలి కేకలకు అంతమెప్పుడు?

ఐక్యరాజ్యసమితి ప్రధాన శాఖలైన ప్రపంచ ఆహార సంస్థ (యఫ్‌ఎఒ), యునిసెఫ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్‌ఓ), ఇంటర్నేషనల్‌ ఫండ్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ డెవలప్‌మెంట్‌(ఐఎఫ్‌ఎడి), వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ (డబ్య్లూఎఫ్‌పి)లు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనాల ఆధారంగా మే 2న ప్రపంచ ఆహార సంక్షోభాలపై నివేదికను విడుదల చేశాయి. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్‌డిజి) భాగంగా 2030 నాటికి ప్రపంచంలో ఆకలి చావులు, పోషకాహార లోపం లేకుండా చూస్తూ, ‘జీరో హంగర్‌ (ఆకలి లేని లోకం)’ సాధించాలనే ఉన్నత, ఉత్తమ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో పోషకాహార లోపం అత్యధికంగా ఆసియా దేశాల్లో 418 మిలియన్లు ఉండగా, ఆఫ్రికాలో 282 మిలియన్లు ఉన్నారని