కాలమ్స్ ఆర్ధికం

అమ్మకానికి దేశం – దళారిగా ప్రభుత్వం

మనది ప్రజాస్వామ్య లౌకిక సర్వసత్తాక గణతంత్ర దేశం. గణతంత్ర రాజ్యమంటే యావత్తు దేశం స్వీయ సంపుష్టి పొందడం. స్వావలంబన (ఆత్మనిర్భర్‌) అంటే స్వంత వనరులు, స్వంత పరిజ్ఞానం, స్వంతశ్రమతో ఉత్పత్తి చేసి వినియోగించడంగా ఉంటుంది. దీనికోసం పౌరులకు స్వేచ్చ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు అడుగులు వేయాలి. ఇప్పుడు ఈ రెండూ ప్రమాదంలో ఉన్నాయి. అయితే మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు దేశ వనరులను, దేశ సంపదను, దేశ శ్రమను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు దారాదత్తం చేసేవిధంగా ఉంది. గణతంత్ర దేశంలో ప్రజలే విదాన నిర్ణయ కర్తలు. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. సమాజ సంపుష్టితత్వం కోసం ప్రధాన రంగాలైన
కాలమ్స్ ఆర్ధికం

పారుబాకీలతో బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభం

భారతదేశంలో అధికార బదిలీకి ముందు, తర్వాత ప్రైవేట్‌ బ్యాంకుల చరిత్ర అంతా అక్రమాలతో, మోసాలతో ముడిపడి ఉంది. వలసపాలన కాలంలో దేశంలో ఏర్పడిన ప్రైవేట్‌ బ్యాంకులు ప్రజల వద్ద నుండి వసూలు చేసిన డిపాజిట్లను తమ స్వప్రయోజనాలకు వినియోగించుకున్నాయి. ఆనాటికి ఉన్న 600 బ్యాంకులు పెద్ద పరిశ్రమలకు, వాణిజ్య వర్గాలకు పరిశ్రమల నిర్మాణం, వర్కింగ్‌ కాపిటల్‌, ఇతర అవసరాలకు రుణాలు ఇస్తుండేవి. చిన్న వృత్తులు, వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు తదితరాలకు రుణాలు అందేవి కాదు. తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించకపోవటం, వసూలుపై బ్యాంకులు తగినంత శద్ధ పెట్టకపోవటం, రుణాలు తీసుకున్న సంస్థలు చేసే మోసాలలో బ్యాంకులు కూడా భాగస్వాములు