ఒక వీరునికి కడసారి వీడ్కోలు
2024 అక్టోబర్ 14,హైదరాబాద్, మౌలాలిలోని ఒక పెద్ద అపార్ట్ మెంట్ కింద కార్ పార్కింగ్ ప్లేస్ అంతా జనంతో కిటకిటలాడుతోంది. మధ్యాహ్నం 12 దాటుతోంది. జనం వస్తూనే వున్నారు. అల్విదా.. సాయిబాబా అంటున్నారెవరో! ఎర్ర గులాబీల దండల కింద ఒక కవిఏ కదలికా లేకుండా వున్నాడు. సుత్తికొడవలితో మెరుస్తున్న ఎర్ర జెండా కింద... రాజీపడని, తలవంచని, భయమెరుగని యోధుడొకడు అచేతనంగా వున్నాడు. ప్రొఫెసర్ గోకరకొండ నాగసాయిబాబా అనే ప్రజల మనిషినిచివరిసారి చూడడం కోసం జనం తోసుకుని వస్తున్నారు. జోహార్ కామ్రేడ్ సాయిబాబా అంటూ నినదిస్తున్నారు. అక్కడంతా ఉద్రిక్తంగా వుంది. ఒక ఉద్వేగం, విషాదం కలిసి అక్కడ ప్రవహిస్తున్నాయి.వందలమంది స్త్రీలు