ఇంటర్వ్యూ

కశ్మీర్ ఒక ప్రయోగశాల

(2023 మే 2న, కశ్మీర్‌లో లోయలో రాజ్యహింసకు పాల్పడుతున్న ఒక ప్రసిద్ధ జర్నలిస్టును రెజాజ్ ఎం షీబా సైదీక్ ఇంటర్వ్యూ చేశారు. భారత ప్రభుత్వం నుండి రాబోయే పరిణామాలను ఊహించిన ఆ జర్నలిస్ట్ తన పేరు బయటపెట్టవద్దని అంటే అతనికి "ఫ్రీడమ్" (స్వేచ్ఛ) అని పేరు పెట్టాం. హడావిడిగా తీసుకున్న ఈ చిన్న ఇంటర్వ్యూ వెనుక ఉన్న రాజకీయ కారణాన్ని తన పేరును అజ్ఞాతంగా వుంచాలనే అతని అభ్యర్థన నుండి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అనామకతను పిరికితనం అనే  దృష్టితో చూడలేం. కానీ "ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో" వున్న"ప్రజాస్వామ్యం- స్వాతంత్ర్యాల "వాస్తవాన్ని, భారతదేశ ప్రధాన భూభాగంలోనూ, కశ్మీర్‌లోనూ
ఇంటర్వ్యూ సంభాషణ

ప్రజాస్వామ్యంలోనూ ఫాసిజం వస్తుంది

- సిద్ధికీ కప్పన్‌, రైహానాలతో ఇంటర్వ్యూ  (సిద్ధికీ కప్పన్‌ 43సంవత్సరాల వయసున్న మళయాళీ జర్నలిస్టు. కేరళ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ ఢల్లీి శాఖకు కార్యదర్శి. ఆయన్ను 5 అక్టోబర్‌ 2020న ఉత్తరప్రదేశ్‌లోని మథుర టాల్‌ప్లాజా వద్ద అరెస్టు చేశారు. ఆయనతోపాటు ఇద్దరు విద్యార్థి కార్యకర్తలు అతికూర్‌ రహ్మన్‌, మసూద్‌ అహ్మద్‌, డ్రైవర్‌ మొహ్మద్‌ ఆలంను కూడా నిర్బంధించారు. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌ అనే గ్రామంలో నలుగురు అగ్రకుల ఠాకూర్‌లు ఒక దళిత బాలికమీద సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనలో నిజనిర్ధారణకోసం ఆ గ్రామానికి వెళుతుండగా ఈ అరెస్టులు జరిగాయి. కప్పన్‌పై ఊపా, పియమ్‌ఎల్‌ఏ లతో సహా అనేక ఇతర
ఇంటర్వ్యూ

చరిత్రను తిరగ రాయడం  వీరోచితం అనుకుంటున్నారా ?

గణేష్‌ నారాయణ్‌ దేవి జ్ఞానానికి, శక్తికి మధ్య వుండే సంబంధం గురించి పరిశోధిస్తూ అనేక పుస్తకాలు, వ్యాసాలు రచించారు. మానవ చరిత్రలో శిష్టవర్గాలు, జ్ఞానాన్ని నిర్వచిస్తూ దానిపై గుత్తాధిపత్యాన్ని ఎలా సాధించారో ఆయన వివరించారు.  ఆయన గుజరాత్‌లోని వడోదరా (బరోడా)లో ‘‘భాషా రీసెర్చ్‌ అండ్‌ పబ్లికేషన్‌ సెంటర్‌’’ను, తేజ్‌ఘర్‌లో ‘‘ఆదివాసీ అకాడమీ’’ని స్థాపించారు.  2010లో ఆయన నాయకత్వంలో జరిగిన ‘‘భారతదేశంలో ప్రజల భాషల సర్వే’’ నేటికీ సజీవంగా వున్న 780 భారతీయ భాషలను రికార్డు చేసింది. ఆయనకు సాహిత్య అకాడమీ అవార్టు, సార్క్‌ దేశాల సాహిత్య అవార్డు, ప్రిన్స్‌ క్లాస్‌ (PrinceClaus)1 అవార్డు, అంతర్జాతీయ లింగ్వాపాక్స్‌ బహుమతి (
సంభాషణ వ్యాసాలు

శ్రమ సంబంధాలఅమ్మ

నవంబర్‌ 1 నాడు మల్లోజుల మధురమ్మ తన వందవ ఏట కన్నుమూసింది. ఆమె నిండా నూరేళ్లు బతికింది. బతికినన్నాళ్లు ఆమె విప్లవ సానుభూతిరాలుగానే బతికింది. ఇటీవలి కాలంలో చాల మందే అమ్మలు, నాన్నలు కన్నుమూస్తున్న వార్తలు వినాల్సి వస్తున్నది. కొద్ది రోజుల క్రితం మా సహచర కామ్రేడ్‌ హన్మంతు తండ్రి  పాక చంద్రయ్య 90వ ఏట సెప్టెంబర్‌ 30నాడు కన్ను మూసిన విషయం వార్త పత్రికల ద్వార తెలిసింది. ఆయన తొమ్మిది పదులు నిండిన వయసులో కన్ను మూశాడు. ఆయనకు ఆరుగురి సంతానంలో మా కామ్రేడ్‌ హన్మంతే పెద్ద కుమారుడు. ఆయన మరణం బాధాకరం.  కానీ ప్రతి జీవికి
వ్యాసాలు సంభాషణ

మానని గాయమూ, తీరని ఆగ్రహమూ వాకపల్లి..

‌ (వాకపల్లి మహిళల కు  న్యాయం జరిగిందా ?  ఆదివాసులకు, అందునా ఆదివాసీ మహిళ లకు న్యాయం చేసే వ్యవస్థలోనే మనం ఉన్నామా? కోర్టు తీర్పు నేపథ్యంలో విరసం . ఆర్గ్ జూన్ 1 , 2016 లో గతంలో అచ్చయిన ఈ వ్యాసం పాఠకుల కోసం.. - వసంతమేఘం టీం ) విశాఖపట్నం దగ్గర కరకవానిపాలెంలో అమరుడు కామ్రేడ్‌ అజాద్‌ ‌సంస్మరణ సభ భావోద్వేగాలతో జరుగుతున్నది. ఆ సమయంలో నా పక్కన కూర్చున్న లాయర్‌ ‌బాలక్రిష్ణ ‘వాకపల్లి వెళుతున్నాం వస్తారా?’ అని అడిగాడు. ఛిద్రమైపోతున్న ప్రజల జీవితం గురించి దాదాపుగా రెండు గంటలుగా ఆ సభ జరుగుతున్నది.
వ్యాసాలు సంభాషణ

అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

(డానియల్ అడుగుతున్నాడు.. మా ఊరి మహిళకు న్యాయం జరిగిందా? అని. న్యాయం అంటే ఏమిటని అమరుడు డానియల్ మనలను నిలదీస్తున్నాడు.. ఈ రోజు ఆయన కూడా లేకపోవచ్చు..    బాధిత మహిళల్లో కొందరు మరణించి ఉండవచ్చు..  కానీ వాళ్ళ కన్నీరు, దుఃఖం , నెత్తురు, అమరత్వం  మనలను నిలదీయడం లేదా? న్యాయం అంటే ఏమిటో చెప్పమని ..18.11.2016 (virasam.org లో ప్రచురి తమైన ఈ వ్యాసం పాఠకుల కోసం.. వసంత మేఘం టీం) విశాఖ ఏజెన్సీలో విస్తరించి ఉన్న 2వేల ఎకరాల చింతపల్లి అడవులను దుబాయికి చెందిన ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చేందుకు 1999లో అప్పటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి
ఇంటర్వ్యూ సంభాషణ

ప్రజల్లోకి వెళ్లి రాసాను

(ప్రముఖ సాహిత్య, జీవిత చరిత్రల పరిశోధకుడు డా. కె ముత్యం *శ్రీకాకుళ విప్లవోద్యమం - తెలుగు సాహిత్యంపై ప్రభావం* అనే అంశంపై 1984 - 90 మధ్య పరిశోధన చేశారు. ఆ సందర్భంగా ఆయన శ్రీకాకుళ విప్లవోద్యమంతో, ఆ  సాహిత్యంతో  పరిచయం ఉన్న అనేక మందిని కలిశారు. వారి అభిప్రాయాలు సేకరించారు. వాటిని ఇటీవల ముత్యం  వెలుగులోకి తెచ్చారు. ఎక్కడా అచ్చుకాని అభిప్రాయాలు ఇవి. ఇందులో ప్రముఖ బుర్ర కథ కళాకారుడు షేక్ నాజర్ 9-3- 1987  కె ముత్యంతో పంచుకున్న అనుభవాలు పాఠకుల కోసం .. వసంతమేఘం టీం ) 1. శ్రీకాకుళం ప్రాంతమంతా మీరు కలెదిరిగారు
సాహిత్యం సంభాషణ

యుద్ధం మధ్య దండకారణ్య కథకుల సమావేశం

నా సన్నిహిత మితృడు కామ్రేడ్‌ చందూ దండకారణ్యంలో సాహితీ కార్యశాల నడుపుతున్నాం, విధిగా మీరు రావాలని నన్ను కోరాడు. డేట్‌ పంపాడు. వాస్తవంగా అ తేదీలలో నాకు అప్పటికే నిర్ణయమైపోయిన ఇతరత్ర పలు పనులున్నాయి. కానీ, ఏం చేయడం? నేనూ సాహితీ ప్రియుడినే! నాకూ వెళ్లాలనే వుంది. చందుకు దండకారణ్యంలో పాట రచనపై కార్యశాలలు నడిపిన అనుభవం వుంది. స్వతహాగా అనేక పాటలు రాశాడు. తాను పాడుతాడు, పాటపై అడుతాడు. కానీ, కథల కార్యశాల నడిపిన అనుభవం మాత్రం ఆయనకు లేదు. కథలు రాసిన అనుభవం కూడా లేదు. కథలు చదివింది కూడ తక్కువేననీ ఆయన నిర్మాహమాటంగానే తెలిపాడు.
సంభాషణ

మీరు నడిచినంత మేరా…

‌రేపో, ఎల్లుండో కలుస్తారనుకున్న సమయంలోనే ఒక విషాద వార్త చెవిన పడింది. కామ్రేడ్స్ రైను, అనిల్ లు ఇక లేరని. తేరుకోవటానికి కొంత సమయమే పట్టింది. ‌పొడవుగా, చామనఛాయగా ఉన్న కా. రైను పరిచయం ఎఓబి నుంచి ఒక పని మీద వచ్చినప్పుడు. దాదాపు పది సంవత్సరాల కిందట. ఎస్. ఎల్. ఆర్. తో ఠీవీగా ఉన్న ఆకారం. తన మాటల్లో అర్థమైంది, తనకు కొంచెం కొంచెం తెలుగు వస్తుందని. కానీ తన తెలుగు ఉచ్ఛరణ గమ్మత్తుగా ఉండేది. ఎలాగంటే, చదువుకునే రోజుల్లో నా స్నేహితురాలు అస్మా బేగం మాట్లాడిన 'తురక తెలుగులా'.  . తను వచ్చిన పని
సంభాషణ నివేదిక

సాంస్కృతిక ప్రతివ్యూహపు కలనేత

విరసం సాహిత్య పాఠశాల నివేదిక విరసం 23వ సాహిత్య పాఠశాల జనవరి 7,8 తేదీల్లో  హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉత్తేజకరంగా జరిగింది. ఫాసిస్టు వ్యతిరేక పోరాటాల ప్రాంగణం, వాసం శివ హాలులో, నర్మద వేదికపైన రెండు రోజులు ‘ఫాసిజం ` సాంస్కృతిక ప్రతివ్యూహం’ అనే అంశంపై లోతైన చర్చ సాగింది. 7వ తేదీ శనివారం ఉదయం 11.00 గంటలకు సభా ప్రాంగణం ముందు పతాకావిష్కరణతో ప్రారంభమై ఆదివారం రాత్రి 9.00 గంటల దాకా సుమారు 16 గంటలపాటు నడిచిన సాహిత్య పాఠశాలలో వందలాది సాహిత్యాభిమానులు, సామాజిక కార్యకర్తలు, విప్లవాభిమానులు పూర్తి నిమగ్నతతో పాల్గొన్నారు.  విరసం సీనియర్‌ సభ్యులు