సంభాషణ

నిమ్మలపాడు దీర్ఘకాలిక పోరాటం

న్యాయస్థానాల్లో విజయం పొందినప్పటికీ మైనింగ్‌ తవ్వకాల నుండి భూమిని కాపాడుకోవడానికి పోరాడుతున్న 3 ఆంధ్ర ఆదివాసీ గ్రామాల ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మలపాడు గ్రామ ప్రజలు 1997లో అనూహ్యమైన ఒక విజయాన్ని సాధించారు. మైనింగ్‌ కార్యకలాపాల నుండి తమ గ్రామాన్ని కాపాడుకోవడంకోసం రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక ప్రైవేటు కంపెనీకి వ్యతిరేకంగా సాగిన న్యాయపోరాటంలో వాళ్ళు విజయం పొందారు. సుప్రీంకోర్టు 1993లో, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా యిచ్చిన తీర్పును కొట్టివేసింది. 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతాలలోని ఖనిజ సంపదను వెలికితీసే హక్కు కొండదొర తెగకు చెందిన ప్రజలకు మరియు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సహకార సంఘాలకు మాత్రమే వుందని,  ప్రభుత్వం
సంభాషణ

ఇద్దరు మిత్రులు – విప్లవోద్యమంలో రెండు స్రవంతులు

కత్తి మోహన్‌ రావు స్మృతిలో ఎంఎస్‌సి కెమెస్ట్రీ విద్యార్థిగా, ఆర్‌ఎస్‌యు నాయకుడుగా 1982 నుంచి మా ఇంట్లో అందరికీ తెలిసిన సన్నిహిత మిత్రుడు కత్తి మోహన్‌రావు గుండెపోటుతో మరణించి ఇప్పటికీ ఏడాదిన్నర కావొస్తుంది. ఆయన స్మృతిలో గుర్తుచేసుకోవాల్సిన విషయాలు రెండు - కాకతీయ యూనివర్సిటీలో కెమెస్ట్రీ ల్యాబ్‌ తగులబడినపుడు పోలీసులు ఆయనను అందుకు బాధ్యుణ్ణి చేసి ముద్దాయిని చేయడం. ఒకే ఊరు, సహ విద్యార్థులు చైతన్య పూర్వకంగా ఎంచుకొని ఒకరు మెడిసిన్‌లోకి ఒకరు కెమెస్ట్రీలోకి వచ్చిన ఒకే ఊరు విదార్థులు డా. ఆమడ నారాయణ, మోహన్‌రావుల ఆదర్శ జీవితం. చివరిసారి ఆయనను వరంగల్‌ జైలు నుంచి బెయిల్‌ మీద
ఇంటర్వ్యూ సంభాషణ

భార‌త రాజ్యానికి ఆధునిక స్వ‌భావం లేదు

(రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌లు, మార్పు గురించి ముమ్మరంగా చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలోవ‌సంత‌మేఘంతో ప్ర‌ముఖ న్యాయ‌వాది, సామాజిక ఉద్య‌మ‌కారుడు వై.కే పంచుకున్న విమ‌ర్శ‌నాత్మ‌క అభిప్రాయాలు మీ కోసం..) 1. రాజ్యాంగాన్ని మార్చాల‌ని కేసీఆర్ అన‌గానే ఇంత ప్ర‌తిస్పంద‌న ఎందుకు వ‌స్తోంది?  రాజ్యాంగాన్ని మార్చాలనడం, సవరించాలనడం - ఈ రెండూ ఒకటి కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ను సవరించడానికి ఆర్టికల్‌ ౩68 ద్వారా రాజ్యాంగమే అవకాశం కల్పించింది. అయితే, సాధారణ బిల్లును ఆమోదించటానికి భిన్నంగా రాజ్యాంగ సవరణ చేయటానికి ఒక ప్రత్యేక ప్రొసీజర్‌ను 368లోనే పొందుపరిచారు. ఆ ప్రకారం 107 రాజ్యాంగ సవరణ చట్టాలను ఇప్పటికే పార్లమెంట్‌ ఆమోదించింది. కానీ, కెసిఆర్‌ చెబుతున్న కొత్త
సంభాషణ

బిర్సాముండా కేంద్రకారాగారం, రాంచీ నుంచి సాంస్కృతిక కళాకారుడు జీతన్‌ మరాండీ విజ్ఞప్తి!

 (కా.   జీతన్‌ మరాండీ  మ‌న కాల‌పు గొప్ప వాగ్గేయ‌కారుడు.  ఆయ‌న  గానానికి, ప్ర‌సంగాల‌కు రాజ్యం భీతిల్లిపోయింది.  మ‌ర‌ణ దండ‌న విధించింది. ఆయ‌న‌తోపాటు త‌న  న‌లుగురు స‌హ‌చ‌రులకు కూడా. ఈ ఆదివాసీ, ద‌ళిత సాంస్కృతికోద్య‌మ క‌ళాకారుల కోసం స‌మాజ‌మంతా క‌దిలింది. వాళ్ల‌ను ఉరి తాడు నుంచి త‌ప్పించింది. జీత‌న్ ఈ నెల 13 న అనారోగ్యంతో అమరుడ‌య్యాడు.   జైలులో ఉన్నప్పుడు ఆయ‌న   బయటి మేధావులకు రాసిన లేఖ ఇది.  అయన స్మృతిలో పునర్ముద్రిస్తున్నాం.- సంపాదకవర్గం) విజ్ఞప్తి ప్రగతి శీల రచయితలు, కళాకారులు, బుద్ధిజీవులు, సాంస్కృతిక, సామాజిక కార్యకర్తలు మానవహక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ చైతన్యం గల పౌరులు, కార్మికులు,
సంభాషణ

విప్లవంలో రూపొందిన మానవుడు

కామ్రేడ్‌ చీమల నరుసయ్య నవ యవ్వన ప్రాయంలోనే అడవి దారి పట్టాడు. అప్పటికి ఆయన వయసు రెండుపదులు నిండి వుంటాయేమో! అప్పటివరకు ఆయన గురించి మాకు తప్ప బయట ఎవరికి తెలుసు? 1978లో ప్రస్తుత పెద్దపల్లి జిల్లా రాఘనేడు భూస్వాములను ‘సార్లు’ (మల్లోజుల కోటేశ్వర్లు) అపహరించి రైతాంగ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు జరిపిన నాటికి నరుసయ్య ఇంకా వెలుగులోకి రాలేదు. కేశోరాం సిమెంట్‌ కంపెనీలో కార్మిక నాయకుడిగా చలామణి అవుతూ గూండాగిరి, దాదాగిరి చలాయించే హసనొద్దీన్‌ను నక్సలైట్లు మట్టుబెట్టిన నాటికి కూడ నరుసయ్య సాధారణ ఊరి యువకుడే. మా పొరుగూరు పాల్తెం గన్ను పటేల్‌ ఆగడాలపై ప్రజాపంచాయతీ జరిపిన
సంభాషణ

రాజ్యం ఆ ‘సంథాలీ సిరింగ్‌’ గొంతు నులమకుండా ఆపాల్సింది మనమే

( కా.   జీతన్‌ మరాండీ  మ‌న కాల‌పు గొప్ప వాగ్గేయ‌కారుడు.  ఆయ‌న  గానానికి, ప్ర‌సంగాల‌కు రాజ్యం భీతిల్లిపోయింది.  మ‌ర‌ణ దండ‌న విధించింది. ఆయ‌న‌తోపాటు త‌న  న‌లుగురు స‌హ‌చ‌రులకు కూడా. ఈ ఆదివాసీ, ద‌ళిత సాంస్కృతికోద్య‌మ క‌ళాకారుల కోసం స‌మాజ‌మంతా క‌దిలింది. వాళ్ల‌ను ఉరి తాడు నుంచి త‌ప్పించింది. జీత‌న్ ఈ నెల 13 న అనారోగ్యంతో అమరుడ‌య్యాడు.   జైలులో ఉన్నప్పుడు ఆయ‌న  గురుంచి, ఝార్ఖండ్ ఉద్యమం గురుంచి అమృత రాసిన వ్యాసం ఇది.  అయన స్మృతిలో పునర్ముద్రిస్తున్నాం.- సంపాదకవర్గం   )  జీతన్‌ మరాండీని నేను చూడలేదు. అనిల్‌రామ్‌, మనోజ్‌ రాజ్‌వర్‌, ఛత్రపతి మండల్‌ల గురించిన వివరాలు నాకు తెలీవు. కానీ
సంభాషణ

విప్లవోద్యమ వ్యక్తిత్వమే సాకేత్‌

‌అక్టోబర్‌ 14వ తారీఖు భారతదేశ విప్లవోద్యమానికి, విప్లవ శ్రేణులకు, విప్లవ కార్యకర్తలకు అత్యంత దుఃఖదాయకమైన రోజు. ఒక ఆత్మీయుడు, ఒక స్నేహశీలి, ఒక ఓదార్పు, ఒక ఊరట, ఒక నిరాడంబర, నిస్వార్థజీవి,  ఒడిదుడుకుల్లో ఆత్మవిశ్వాసం నింపే ఒక ఆపన్నహస్తం, మచ్చుకైనా కోపతాపాలు ప్రదర్శించని సహన సౌమ్యశీలి, ఒక అన్వేషి, ఒక ఆర్గనైజర్‌, ఒక సైద్ధాంతిక రాజకీయ వ్యూహాకర్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రామకృష్ణగా చిరపరిచితుడైన  ప్రియతమ నాయకుడు కామ్రేడ్‌ సాకేత్‌, రామకృష్ణ, శ్రీనివాస్‌ (యస్‌.వి.), గోపాలం మాష్టారు (అక్కిరాజు హరగోపాల్‌) తీవ్రమైన కిడ్నీ జబ్బుతో 2021వ సంవత్సరం అక్టోబర్‌ 14వ తేదీన ఉదయం 6.30 నిమిషాలకు అమరత్వం చెందారు.  
ఇంటర్వ్యూ సంభాషణ

పాత జీతాల కోసం పోరాడాల్సి వ‌స్తోంది

 ( ప్ర‌జాధ‌నాన్ని అనుత్పాద‌క రంగానికే ఎక్కువ‌గా త‌ర‌లిస్తున్నార‌ని, అందువ‌ల్లే ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డం కూడా భార‌మైపోయింద‌ని పీఆర్‌సీ ఉద్య‌మంలో ప‌ని చేస్తున్న డీటీఎఫ్ నాయ‌కుడు కె. ర‌త్నం ఏసేపు అంటున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు మెరుగైన పిఆర్‌సి కోసం  చేస్తున్న ఉద్యమం కార్మికవర్గ సంక్షేమంతో ముడిపడి వుంద‌ని అంటున్నారు. దాదాపుగా నూరు శాతం ఉద్యోగ‌వ‌ర్గాలు ఈ ఉద్య‌మంలో భాగ‌మ‌య్యాయ‌ని ఆయ‌న అంటున్నారు. అయితే గ‌తంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద‌, రైతు ఉద్య‌మం లాంటి వాటి మీద ఉద్యోగ‌, ఉపాధ్యాయ వ‌ర్గాలు క‌లిసి వ‌చ్చి ఉంటే ఇప్ప‌డు పీఆర్సీ పోరాటానికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు దొరికేది. దీన్ని అడ్డంపెట్టుకొనే పాల‌కులు ఉద్యోగుల‌కు వ్య‌తిరేకంగా
సంభాషణ

త‌మ‌ల‌పాకు రైతుల‌పై లాఠీ

2022 జనవరి 14న ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఒడిస్సా రాష్ట్రం లోని జగసింగ్ పూర్ జిల్లా ధింకియా, గోవింద్‌పురా, పటానా, మహాలా గ్రామాల త‌మ‌ల‌పాకు రైతుల‌పై భారీ సంఖ్యలో పోలీసు బలగాలు విరుచుక‌ప‌డ్డాయి. వాళ్ల‌ను తోట‌ల‌కుకు వెళ్లకుండా  అడ్డంప‌డ్డాయి. అక్క‌డితో ఆగ‌లేదు. ఘోరంగా లాఠీ చార్జి చేశారు.   పైకి క‌నిపించే ఈ ఘ‌ట‌న వెనుక చాలా క‌థ ఉంది.  దాన్ని తెలుసుకోడానికి  నిజ‌నిర్ధార‌ణ‌కు దేశంలోని ప‌లు పౌర‌హ‌క్కుల సంస్థ‌లు, వేదిక‌లు 2022, జనవరి 29-30 న వెళ్లాయి. ఇందులో కో ఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్స్(CDRO) సభ్యులు  ఏడుగురు, గణతంత్రిక్ అధికార్ సురక్ష్య‌ సంఘటన్ (GASS) సభ్యులు