ఆధిపత్య లక్ష్యంతో బైడెన్ విదేశాంగ విధానం
అమెరికా అధ్యక్ష పీఠంపై ఎవరున్నా దాని సామ్రాజ్యవాద విధానాల్లో మార్పు ఉండదన్న విషయాన్ని డెమోక్రాటిక్ పార్టీకి చెందిన నూతన అధ్యక్షుడు జో బైడెన్ తన భౌగోళిక రాజకీయ విధానాల ద్వారా రుజువు చేస్తున్నారు. ట్రంప్ విధానాల వల్ల దూరం జరిగిన మిత్రులను ఒకటి చేసే పనిలో బైడెన్ నిమగ్నమై ఉన్నారు. కొంత కాలంగా జి-20 దేశాల ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా అమెరికా నాయకత్వంలోని పాత సామ్రాజ్యవాద కూటమి అయిన జి-7 దేశాల ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక తిరిగి అమెరికా ప్రపంచ ఆధిపత్యం కోసం పాత మిత్రులందరిని సమన్వయం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు..










