సాహిత్యం కవిత్వం

వీరగాధ

యాది వెన్నెల కాస్తుందివన భూమంతపురా కాల మ్రానుకోటలోజ్ఞాపకాల జాతర ఒక కుంకుమ్భరినివీర మరణాల మీంచినడిచి వస్తున్న కాలాన్ని కథలు చెబుతుంది కరువు గెల్చిన నేల మీదకడుపు పగుళ్ళు బడిఆకలికన్నీళ్లతోకొండలు కోనలు తడిసిపోయినాఓరుగల్లు మట్టికోట చెమ్మగిల్ల లేదు నిలువెల్లా గాయల్తో ఆత్మాభిమానంఆదివాసీ యుద్ధ మైంది శక్తి వంత ఆయుధాల్నిసవాల్ చేసినసంప్రదాయబాణం చెల్లా చెదురైన మోసం గెలిచాకతుది శ్వాస చిలుకలగుట్టందుకుందిఆగిపోకుండా- ప్రాణాల్ని దాచుకోలేనిఒక నిష్కల్మష కాలంప్రాణం పోస్కోని మానవాళికిఆకుపచ్చ తోరణాల అడివి కడుతుంది ఒక వీరోచిత త్యాగాలసంస్మరణప్రకృతోత్సవంఒక చేదు నిజాలతియ్యనిబంగారి జాతర పాలకుల కుటుంబ కణకణంప్రజల సొమ్మని ప్రకటించినబతుకుపోరు వెదురుచెట్లషామియనాలుపెద్ద పెద్ద చెట్లపందిళ్ళుప్రకృతి పిలిచిన ధ్వని ఇప్పపువ్వై గుప్పుమంటూఒక ఆదిమ జీవనవాసనేదోమనసును
సాహిత్యం కవిత్వం

ఆకలి జోలె

జోలెకుఅటు అతడుఇటు నేను.. మా ఇద్దరి మధ్యజోలె పెరు ఆకలి.. అల్యూమినియం బిళ్ళ కోసంఇద్దరిని దేహీ అంటూ అడిగిందిదేశ భవిష్యత్తు.. జోలెకు అటువైపు వ్యక్తి..ప్రభువు దుఃఖంతో నిండినదరిత్రి మీదికి వస్తున్నాడని చెప్పాడు..ఇటు వైపు నేను..వస్తే ఛిద్రమైతూమనమద్యున్నా ఈ దేశ భవిష్యత్ తో మాట్లాడే ధైర్యం చెయ్యమన్నాను.. రాం, రహీం,జీసస్ఎవరచ్చిన అంగట్లోఅర్థకలితో,ఆర్తితో పోటీపడుతున్నభవిష్యత్ భారతవనిని పలకరిస్తారా..?అంతటి ధైర్యం చేస్తారా..? (కరీంనగర్ బస్ స్టాండ్ లో జోలెతో ఉన్న చిన్నారితో ఎదురైనా సంఘటన పై)21/01/2022
సాహిత్యం కవిత్వం

నా తలపుల తలుపులు తెరిచీ..

నా జ్ఞాపకాలునీ రెక్కలునీ రెక్కలునా జ్ఞాపకాలు ఎగరు సీతాకోకనింగి అందేదాకా ఎంత సున్నితంగాతాకుతాయో కదా నీ రెక్కలుగాలిని నీ రెక్కల కుంచెతోగాలి కాన్వాస్ మీదఎన్ని వర్ణచిత్రాలు వర్షిస్తావో కదా రుతువుల మోములన్నీమోహపు వీణలౌతాయి కవితలేవో నేను అల్లడానికికుట్ర పన్నుతాయి నీ రెక్కలు కదిలినప్పుడంతానాలో స్ళేఛ్ఛా కాంక్ష పురి విప్పిన నెమలి అవుతుందిఅరణ్యం పై పరుచుకునే కెంజాయరంగౌతుంది అపుడునా ఏకాంతాన్నీ,నా భావాలనూనీ భుజాలు నొప్పెట్టెలా  మోస్తావు నా ఊహల స్పర్శతోనీ రెక్కలు పులికిస్తాయోనీ రెక్కల స్పర్ళతో నా ఊహలు అలలై కదులుతాయో తెలియదు కానీ నీ రెక్కలు కదిలేప్పుడంతానేనూ కదులుతానునా గుండెకొక లయ ఉన్నట్టనిపిస్తూనాకు నేను కొత్త కావ్యాన్నై పరిచయమౌతాను
సాహిత్యం కవిత్వం

ఎడారి పుష్పం

పొగమంచు కౌగిలిలో ఈ రోజు తెలవారింది.నేల తన దేహాన్ని చలిపూలతో సింగారించుకుంది. నెగళ్ళ వేడిలో లోకం సెదదీరుతోంది మనసుని మంచుగడ్డలా మార్చేసినఈ శీతాకాల వేళనా రెప్పల మీద వెచ్చటి పెదవుల బరువునిమోపిపోయావుదేహం పులకరింతల పూల తపనల పలవరింతలలోచలించిపోయింది రేపన్నదొకటి నా ఆయుష్షులోకి దిగిఉంటేనేనేం కోరుకోవాలి? తల్లి ఒడిలాంటి వెచ్చదనం తెలిసిననీ ముద్దూనీ ఆలింగనం తప్పనీతో ఏకాంతంలో నడిచే కొన్ని అడుగులు తప్ప భయపడకు ప్రియామన అడుగులు పడే  దారిలో నీకై పూలూనాకై ముళ్ళూ ఉంచబడ్డాయిగాయాలనే పూలని నమ్మే నాకుపూలు కూడా గాయం చేయగల సున్నితమైన ప్రియురాలుండడం గొప్ప బహుమానం కదూ? కాదనే అనుకుందాం కాసేపు ఎడారి లాంటి నా
సాహిత్యం కవిత్వం

గణ “తంత్రం”

హక్కులు వచ్చాయనిఆనందపడే వాళ్ళుఅరడజను అయితే.. హక్కంటే ఏంటోతెలియక పూట తింటేమారు కూటికి లేనోల్లు 94 మంది.. ప్రజలను పాచికలు చేసిఆడిన ఈ చదరంగంలోహక్కుల కాలరాసేవాడు "రాజకీయనాయకుడ"య్యాడువాటి కోసం గొంతు చించేవాడు"రాజకీయ ఖైదీ" అయ్యాడు ఇదే గణతంత్రంనేటికి ఈ ఘనమైన "తంత్రం"ఏంటో అర్థం కాక బలి పశువైతున్నది మనమే.. చీకటి నిండినఈ మాయాజాలం లోనక్షత్రాల వెలుగు వచ్చేదెప్పుడో..! (72 ఏండ్ల గణ"తంత్ర" రాజ్యం పై)
సాహిత్యం కవిత్వం

చేతనాస్తిత్వం

సంధ్యాకాశంలో కదులుతున్న సూర్యుడు చేతనలోంచి అచేతనలోకి వెడుతున్నాడు దూసుకొస్తున్న పున్నమి చంద్రుడు సుషుప్తిలోంచి సృజనలోకి వస్తున్నాడు నుసిలా రాలుతున్న చీకటిని కప్పేస్తున్న వెన్నెల వెలుగు దూరంగా వెలుగుతూ మలుగుతున్న చుక్కల రాయబారం ఘనీభవించిన నిద్ర మీద నిప్పురవ్వలా జ్వలిస్తున్న కలల దీపం ముఖం వాల్చిన పెరటితోటలోని పొద్దుతిరుగుడు పువ్వు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బావి గిరక మీద కూర్చున్న ఊరపిచ్చుకల కిచకిచలు అస్తిత్వం చేతనమై కురుస్తున్న వాన చినుకులు చీకటిలోంచి తొంగిచూస్తున్న వెలుగురేఖల దృశ్యం దూరపు కొండలను స్ఫృశిస్తూ సంక్షోభంలోంచి స్పష్టతలోకి సంక్లిష్టతలోంచి సంఘర్షణలోకి సందేహంలోంచి సందోహంలోకి జ్వలిస్తున్న సూర్యుడు
సాహిత్యం కవిత్వం

బహిష్కరిద్దాం

తడికలు అడ్డెట్టి తెల్ల గుడ్డ కట్టి అదే వెండి తెర భావనలో నేల పై మూడు గంటలు కూసుని చూసిన సినిమా నేల టికెట్ నుండి కుర్చీ దాకా జనం ఎగబడితే ఏడాదీ ఆడిన సినిమా కథలో అదే మూస కథనంలో కొత్తదనం కాసులు కురిపించిన సినిమా రీళ్ళ డబ్బాలు టాకీస్ టూ టాకీస్ ఓ మాదిరి పెద్ద వూరిలో ఓ టాకీసు సినిమా బండ్లు పోటాపోటీ పోస్టర్లు మైదాతో గోడలపై వినోదాన్ని పంచిన సినిమా మూకీ నుంచి టాకీ దాకా నలుపు తెలుపు నుంచి రంగుల బొమ్మ దాకా సాంకేతిక హంగుల హోరులో పెంచుకున్న బడ్జెట్ సినిమా
సాహిత్యం కవిత్వం

చివరిదాక

కలంతో కరచాలనమై అక్షరాలను అల్లుకుపోతూ అజ్ఞాతంలో దశాబ్దాలు గడిచిపోయాయి సింహవలోకనంలో గమనా గమనమై నైనాగా ఉప్పెనైపోతూ ప్రజలు అజేయులంటూ రెండుపాదాలు చివరిదాక నడిచాయి చీకటిని శిథిలంచేసే సూర్యోదయకిరణాల కోసం గుండెలుమీద పెంచుకున్న బిడ్డలకు నడకనేర్పిన సింధూరాలు నాలుగుసింహాలు నాలుగుదిక్కులు దారులుమూసి ట్రిగ్గరమీద వేలుపెట్టినా రంగులు మార్చే ఖాకీలు కనికరమైనట్టు నోట్లకట్టలపై నడిపిస్తామన్నా భయమైపోయి కాసులముందు కన్నీరై తలవంచని  తల్లీ లలితమ్మ
సాహిత్యం కవిత్వం

మృత్యువు దాడిచేసిన రాత్రి అక్షరాలకు జీవం పోస్తున్నాడు

రాత్రి గడియారంలో కాలం నిలిచిపోయింది రక్తం కక్కుకుని ప్రభాకర్ కన్నుమూసాడని గాలిలో సగం తెగిన నరాల తరంగాల స్వరాలు కాలం నిలిచేమీ పోలేదు నీ శవం దగ్గర కూడా గతమూ వర్తమానమూ ఘర్షణ పడి నీ ఆశయ నినాదాలతో మేమే ముందుకు సాగాం సూర్యుడు సంక్రాంతి లోకి పయనించాడు రాస్తూ రాస్తూ అలవాటుగా గోడవైపు చూశాను అవును నేస్తం నువు ప్రేమగా యిచ్చిన గడియారంలో ముళ్ళు ఆగిపోయాయి సరిగ్గా నీ అస్తమయం దగ్గర కాలం ఫ్రీజ్ అయినట్లు కాదు, నీ ముళ్లబాట జీవితం అక్కడితో ముగిసింది నీ ఊపిరితిత్తుల నుంచి తీసిన నెత్తుటి సిరంజిలా సెకన్ల ముల్లు ఆగిపోయింది
సాహిత్యం కవిత్వం

నేను

నేను ఎవరినంటేపుట్టుకతో ప్రమేయం లేనివాడినిమరణంతోనూ ప్రమేయం ఉండీ లేనివాడినిమధ్యకాలంలో నేను,నేనే! గత నా మానవసారాన్ని అకళింపు చేసుకుంటున్నవాడినిగతం వర్తమానంలోకి ఎగబాకిన వైనాన్ని అధ్యయనంచేస్తున్నవాడినివర్తమానం భవిష్యత్‌లోకి పురోగమించే గతిశీలతనువిశ్వసించినవాడిని అందుకే నేనుచరిత్ర పురోగమిస్తుందని నమ్మినవాడినిఆ చరిత్ర పురోగమనంలో భాగమైనవాడినిచరిత్రను నడిపించే చోదకశక్తిని ఇక ఇప్పుడునేను ఎవరినంటే,నేను కమ్యూనిస్టును - విప్లవ కమ్యూనిస్టును.