సర్వ ఆదివాసీ సమాజ్ ఉపాధ్యక్షులు, బస్తర్ జన్ సంఘర్ష్ సమన్వయ్ సమితి కన్వీనర్, సుర్జు టేకమ్‌ను 2024ఏప్రిల్ 2  న క్రూర ఉపా, ఛత్తీస్‌గఢ్ స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్  కింద అరెస్టు చేయడం దిగ్భ్రాంతి కలిగించింది. సుర్జు “మావోయిస్ట్ సానుభూతిపరుడు” అనే సాకుతో తెల్లవారుజామున 4 గంటలకు, ఛత్తీస్‌గఢ్‌లోని మన్‌పూర్-మొహ్లా-అంబగఢ్ జిల్లాలోని కల్వార్ గ్రామంలోని అతని ఇంటి నుండి బలవంతంగా తీసుకెళ్లారు. సాక్షుల వాంగ్మూలాల ప్రకారం, అతని ఇంట్లో జరిగిన మొదటి దఫా సోదాలో పోలీసులు, పారామిలటరీ సిబ్బందికి ఏమీ దొరకలేదు. కానీ ఆ తర్వాత వారు తిరిగి లోపలికి వెళ్లి, సర్జు టెకామ్ మావోయిస్టు సానుభూతిపరుడు, “ఆయుధాల సరఫరాదారు” అని కల్పిత కథను కట్టడానికి పేలుడు పదార్థాలు వున్న సంచితో పాటు నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)కి సంబంధించిన సాహిత్యాన్ని పెట్టారు. అధికారులు అతనిని కొడుతూ  ఇంటి నుండి ఎత్తుకెళ్ళారు.

ఏప్రిల్ 3వ తేదీన బిలాస్‌పూర్‌లోని ఎన్‌ఐఏ కోర్టు ముందు టెకామ్‌ను హాజరుపరిచారు. ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా ఎన్నికైన బిజెపి ప్రభుత్వంలో పూర్తిగా సాకారం అవుతున్న సూరజ్‌కుండ్ పథకంలో భాగంగా బస్తర్‌లో ఎక్కువవుతున్న భారత రాజ్య నిర్బంధ తీవ్రతలో భాగంగా సర్జు టేకం అరెస్టు జరిగింది. ఒక వార్తాపత్రిక టి‌ఓ‌ఐ సమాచారం ప్రకారం “నక్సల్ కమాండర్ల” ప్రభావంతో ఆదివాసీల అన్ని నిరసనలు, ర్యాలీలకు నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టి  అరెస్టు చేశామని ఒక అధికారి చెప్పాడు. అరెస్టు చేయడం,  ఆదివాసీల శాంతియుత సామూహిక ఉద్యమాన్ని మావోయిస్టులచే  ప్రభావితమైనది అని ముద్ర వేయడం ద్వారా  , ఆదివాసీ రైతాంగంపై కొనసాగుతున్న మారణహోమానికి వ్యతిరేకంగా గళం విప్పిన గొంతులను నిశ్శబ్దం చేయాలని రాజ్యం ఆశిస్తోంది. ఈ ప్రాంతంలో “విశ్వాసం, అబివృద్ధి, భద్రత (విశ్వాస్, వికాస్  ఔర్ సురక్ష)” అనే రాజ్య కథనాన్ని బహిర్గతం చేయవచ్చు.

2024 జనవరి 1 నుండి, బస్తర్‌లో 20 కంటే ఎక్కువ బూటకపు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. ఆరు నెలల పసికందుతో సహా పౌరుల అనాలోచిత హత్యలు, మైనింగ్ వ్యతిరేక నిర్వాసిత ఆదివాసీ ఉద్యమాలకు సంబంధించిన అనేక ముఖ్య నాయకుల అరెస్టులు, ఇవన్నీ నక్సలిజాన్ని ఎదుర్కోవడం సాకుతో జరిగాయి. అమ్దాయి ఘాటి కొండల్లో గని త్రవ్వకాలని, పారామిలటరీ క్యాంపులను వ్యతిరేకిస్తున్న మొరోహ్‌నార్, ఓర్చా జన్ ఆందోళన్‌లోని నేతృత్వాన్ని ఈ మధ్య కాలంలో అరెస్టు చేసారు. సుర్జు అరెస్ట్ తర్వాత, 2024 ఏప్రిల్ 3 న, నారాయణపూర్ జిల్లాలో, రాజ్‌మెన్ నేతమ్, మరొకరు, సంత నుండి తిరిగి వస్తున్నప్పుడు మావోయిస్టులు అనే ఆరోపణతో అరెస్టు చేసారు. వారి కుటుంబాలకు ఇంకా సమాచారం అందలేదు.

అదే సమయంలో, తరచుగా మావోయిస్టులనే  ఆరోపణతో పట్టుకొని,  ఆ తరువాత “ఎన్‌కౌంటర్ హత్యలలో” కాల్చేసారు. 2024 ఏప్రిల్ 27న, బీజాపూర్ జిల్లాలోని చీపుర్‌భట్టిలో అరుగురిని సీపీఐ (మావోయిస్ట్) సభ్యులని ఆరోపిస్తూ కాల్చి చంపారు. అయితే ఘటన జరిగిన స్థలం నుండి సాక్ష్యాలుగా తీసుకు వచ్చిన వస్తువులను చూస్తే వాటితో పోలీసులతో ఎదురుకాల్పులు జరిపే సామర్థ్యంఉన్నట్లుగా కనిపించడంలేదు. హత్యకు గురైన వారిలో కొందరు తమ వూరు వారని గ్రామస్తులు చెబుతున్నారు. హత్యచేయడానికి ముందు వారిని పట్టుకుని కట్టేసినట్లు ఫొటోలు కూడా బయటపడ్డాయి.

“లోక్‌సభ ఎన్నికల సమయంలో నక్సలైట్ల ప్రచారం” చేయకుండా చూసేందుకు సుర్జును అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో, ఒక సముదాయ నాయకుడిగా, కార్పొరేటీకరణ, సైనికీకరణకు వ్యతిరేకంగా బస్తర్‌లో జరిగిన ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న సుర్జు టేకం, రాజ్యం ప్రజలపై విచక్షణారహితంగా యుద్ధం చేస్తున్నప్పుడు బస్తర్‌లో జరిగే ఎన్నికలకున్న యోగ్యత  ఏమిటి అని ప్రశ్నించారు.

2023లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అసెంబ్లీలో బిజెపి గెలుపొందడానికి ముందు సర్జు స్వయంగా హెచ్చరించారు, అదే కారణంగా అరెస్టు అయ్యారు కూడా. స్థానిక ప్రజా ఉద్యమాలు బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా రాజకీయ అసమ్మతిని లేవనెత్తకుండా చూసుకోవడానికి; దాని దోపిడీని ప్రశ్నించే గొంతులు లేకుండా చేయడానికి; కార్పొరేట్ల సేవలో ప్రజలపై జరుపుతున్న క్రూరమైన యుద్ధానికి సాక్ష్యాలు లేకుండా చేయడానికి బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ కూటమి నానా యాతనలు  పడుతోంది.

1 జనవరి 2024 నుండి బస్తర్‌లో జరిగిన 20+ బూటకపు ఎన్‌కౌంటర్లతోపాటు ఆదివాసీ నాయకుడు సుర్జు టేకం అరెస్టు, ప్రజా ఉద్యమాల కార్యకర్తలపై నిరంతర అరెస్టులు, వేధింపులను తీవ్రంగా ఖండిస్తున్నాం.

  • 1) సర్జు టేకం, యితర రాజకీయ ఖైదీలందరినీ తక్షణమే విడుదల చేయాలి.
  • 2) 2024 జనవరి 1 నుండి సాధారణ ఆదివాసీల 20+ బూటకపు ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలి.
  • 3) 2024 మార్చి 27న మావోయిస్టులు ఆరోపించిన ఎన్‌కౌంటర్ హత్యలు అని పిలవబడే వాటిపై న్యాయ విచారణ జరపాలి.
  • 4) సూరజ్‌కుండ్ పథకం కింద బస్తర్‌లో ప్రజలపై జరుగుతున్న యుద్ధాన్ని అంతం చేయాలి.
  • 5) ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అధికమైన మారణహోమ వ్యూహాలను నామమాత్రపు ప్రజాస్వామ్య హక్కులన్నింటినీ తగ్గించడాన్ని ఆపివేయాలి.

కార్పోరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక

భాగస్వామ్య సంఘాలు : ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA), ఆల్ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (AIRSO), ఆల్ ఇండియా రివల్యూషనరీ ఉమెన్స్ ఆర్గనైజేషన్ (AIRWO), భీమ్ ఆర్మీ స్టూడెంట్ ఫెడరేషన్ (BASF), భగత్ సింగ్ అంబేద్కర్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (BASO), భగత్ సింగ్ ఛాత్ర ఏక్తా మంచ్ (bsCEM) , కలెక్టివ్, కామన్ టీచర్స్ ఫోరమ్ (CTF), డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (DSU), ఫ్రటర్నిటీ మూవ్‌మెంట్, నజారియా మ్యాగజైన్, ప్రోగ్రెసివ్ లాయర్స్ అసోసియేషన్ (PLA), మజ్దూర్ అధికార్ సంఘటన్ (MAS), ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI), విశ్వవిద్యాలయ ఛాత్ర ఫెడరేషన్ ( VCF)

06/04/2024

https://countercurrents.org/2024/04/release-adivasi-leader-surju-tekam-end-fake-encounters-and-false-arrests

Leave a Reply