చెక్కిళ్ళపైన గులాబీ రంగు అద్దుకొని, మెడ చుట్టూ నెక్లెస్ వేసుకుని
షేవ్ చేసిన గడ్డం పై గాఢమైన మేకప్  అద్దుకొని
ఆమె తనని తాను అద్దంలో  చూసుకుంది
ముక్కలైన అద్దంలో తన లక్షల ప్రతిబింబాలను  ఒకేసారి ఆమెగా/ అతనుగా చూసుకుంది
అద్దంలో ఆ బొమ్మలు ఒకదాన్ని మరొకటి వెక్కిరించుకున్నట్లు గా అనిపించింది
మరొకరి దేహంలో తను ఇరుక్కు పోయి వూపిరాడనట్లు అనిపించింది
తన దేహపు ఆకృతికి...కోరికలకు పొంతనే లేదు
నేను ఎక్కడికి/దేనికి సంబంధించిన దాన్ని ?
సరిగ్గా నేను ఎక్కడ ఇమడగలను ?
లాంటి ప్రశ్నలు ఎడతెరిపిలేకుండా ఆమెని వేధిస్తాయి

****
కొయ్యడానికి కూడా సాధ్యం కాని రంపపు చివర్లున్న గరుకైన రాయి 
పవిత్రమైన గుడి కట్టటానికి పనికి రాదని    పక్కకి పడేసి నట్లు అచ్ఛం ఆ రాయి తానే అయినట్లు  వేదన చెందుతుంది

**
జీవితం మెలికలు తిరిగిన చిట్టడవిలా కనిపించినప్పుడల్లా..ఆమె ఆగని దుఃఖంతో దట్టమైన పొగ మంచులో ఖంగారుగా నడుస్తూ ఉంటుంది
ప్రతీసారీ ఆమె తన పంజాలతో దారి చేసుకుంటూ వెళుతుంటుందా..
ఎప్పుడూ ఆమెకి తనని బలవంతంగా పదే.. పదే లోపలికి నెట్టివేస్తున్న పరదాల అంచులే కనిపిస్తాయి
నరకం లాంటి పొగమంచులో ఆమె తిరుగుతూ ఉండగానే..
మాంత్రికమైన అంధకారం ఆమెను కమ్మేస్తుంది
ప్రచండమైన మార్పులు గాలితో పాటు ఆమెనీ గాయపరుస్తాయి
ఋతువులు వాటి దారిన అవి వస్తూ.. పోతుంటాయి 

***
కానీ ఆమె మాత్రం ఒక అసాధారణమైన ప్రతిసృష్టి లాగా సంకెళ్ల ల్లో ఎప్పటిలాగే బందీ అయి ఉంటుంది.
ఒక శాపగ్రస్త లా...నిషిధ్ద లాగా..
కళంకాన్ని..అత్యాచారాన్ని విషంలా నిశ్శబ్దం గా గుక్కిళ్ళు మింగుతూ ఉంటుంది
ప్రతీ రోజూ ఉదయం నిద్ర లేస్తూనే తాను ఇటు పురుషుణ్ణి కాదు /స్త్రీ కూడా కాకుండా ఒక యుగళాన్ని కాకుండా శపించబడ్డ ట్రాన్సజెండర్ అనే ఎరుకతో జాగ్రత్తగా
గౌరవనీయమైన చూపులని ఆహ్వానిస్తూ..
వింతగా చూసే వారి వెటకారపు పోకడలను మౌనంగా భరిస్తూ ఉంటుంది
జనం ఆమెను నపుంసకుడు  అంటారు
రెండుగా విడిపోయిన ఒకే మనిషని ..
ఈ దయలేని లోకంలో ఎవరూ.. ఎవరూ కూడా ఆతిధ్యం ఇవ్వని
ఒక అభాగ్య ప్రవాసీ అని..
కన్న తల్లిదండ్రులతో కూడా వెలివేయ బడ్డదని..సానుభూతి చూపిస్తారు
సరే..ఆమె ఎన్నో తప్పులున్న అసంపూర్ణ !  
కానీ ఆమె కూడా తనకు తాను ఒక ప్రత్యేక మైన మనిషి 
ఆమె ఒక్క భగవంతుడి కనుల ద్వారా మాత్రమే చూడదగిన అద్భుతమైన సృష్టి !!

 ట్రాన్స్ పోయెట్రీ sereis లో మొదటి కవిత..

(వాల్స జార్జి సాహిత్య ప్రయాణం  వాల్సా జార్జి కేరళ లోని తిరువనంతపురం లో..ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యారు.2007లో 53 ఏళ్ల వయసులో ఆమె తీవ్రమైన అనారోగ్యంతో మంచాన పడ్డప్పుడు ఆ ఒంటరి తనపు బాధలోంచి కవిత్వం రాయడం మొదలు పెట్టి ఇప్పటిదాకా కొన్ని వాల్యూ మ్స్ లో 700ల కవితలు రాసారు. గ్లోబల్ గా అనేక సాహిత్య కవితవ వెబ్ సైట్స్ లో  వాల్స కవిత్వం ప్రచురించబడింది.దేశ విదేశాల కవుల మధ్య వాల్స కవిత్వం చర్చించబడింది.వాల్స అభిమానులు ఆమె.కవిత్వం గాయానికి లేపానంలాగా అనిపిస్తుంది అనడం తనకి ఎంతో ఆనందాన్నిస్తుంది అని చెప్తారు వాల్సా.  ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన 500ల కవుల్లో వాల్స 153 వ స్థానం పొందారు.వాల్స కవిత్వ ప్రక్రియల్లో హైకూ ల దగ్గర నుంచి లిమిరెక్స్ దాకా అన్ని ప్రక్రియల్లో కవిత్వం రాసారు. కవిత్వం ఎప్పుడు ప్రేరణ ఇచ్చేదిగా, సూటిగా, లయాత్మక సంగీతంలా ఉండాలి అంటారు వాల్స.సామాన్య ప్రజల జీవితాల్లోని ప్రేమ,ఆశ, నిరాశలు తన కవితా వస్తువులు అంటారు ఆమె.ట్రాన్సజెండర్  కవితలో తనను తీవ్రంగా కదిలించిన ట్రాన్సవుమేన్..మానసిక ఘర్షణ..వేదన.. సమాజపు వెలివేత,కుటుంబ సభ్యుల బహిష్కరణ..జెండర్ ఐడెంటిటీ కోసం సమాజంతో..కుటుంబంతో చేసే ఆత్మ గౌరవ పోరాటం..ఇంతలో గెలుపు,అంతలో ఓటమి కలిగించే దుఃఖాన్ని  చాలా ఆర్తిగా చిత్రించారు.వాల్సా జార్జి కవిత్వం —పోయెట్, టు మై అనానిమస్ లవర్,డస్ట్ అంటు డస్ట్,వింగ్ద్ వర్డ్స్,ఎ సడ్డెన్ డౌన్ పోర్,ఏ సాంగ్ ఆఫ్ హోప్,ఈగల్ ఆఫ్ వింగ్స్.,ఏ స్పేస్ ఒడిసి,రెయిన్బో హ్యూస్,ఏ సైకిల్ ఆఫ్ లైఫ్.)

Leave a Reply