దండకారణ్య సమయం

బస్తర్‍లో సైనికీకరణ

దేశంలోని ఆదివాసీ ప్రాంతాలలో అత్యధికంగా సైనికీకరణ జరుగుతున్న  ప్రాంతాలలో బస్తర్  ఒకటి. తరచుగా అక్కడ "తిరుగుబాట్లు",  పోలీసు "ఎన్‌కౌంటర్లు" జరుగుతుంటాయి. గణనీయమైన ఆదివాసీ జనాభా వున్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ దేశంలోని భారీ సైనికీకరణ జరుగుతున్నా ప్రాంతాలలో ఒకటి. ఇది తరచుగా సాయుధ పోరులు, ఘర్షణలు జరుగుతుంటాయి. ఈ సైనికీకరణ ధోరణి దక్షిణ ఒడిషా వంటి పొరుగు ప్రాంతాలకు కూడా విస్తరించింది, ఈ ప్రాంతమంతటా సుదీర్ఘ కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అడ్డూ అదుపూ లేని ఈ సైనికీకరణకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో అనేక ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి.  "ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ నిరసనలలో  ఎవరైనా అందులో భాగం కావచ్చు" అని
వ్యాసాలు

కార్పొరేట్ విస్తరణ – ఆదివాసీల ప్రతిఘటన

మహారాష్ట్రలోని సుర్జాగఢ్‌ గ్రామంలోనూ, మహారాష్ట్ర కొండలలోనూ ఆదివాసీ నిరసనకారులు, నాయకులు విపరీతమైన అణచివేతను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా సూర్జాగఢ్ ప్రాంతం కేంద్రంగా కార్పొరేటికరణ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో లాయిడ్ మెటల్ కంపెనీ గణితవ్వకాల విస్తరణ కోసం సత్వర కార్పొరేటీకరణకు లొంగిపోవాలని స్థానిక సముదాయాల మీద రాజ్యం – కార్పొరేట్ శక్తులు ఒత్తిడి తీసుకు వస్తున్నాయి. నవంబర్ 20న, మహారాష్ట్రలోని సుర్జాగఢ్‌లోని నిరసన ప్రదేశాన్ని పారామిలటరీ బలగాలు చుట్టుముట్టి విధ్వంసం చేసాయి. ఎనిమిది మంది క్షేత్రస్థాయి కార్యకర్తలను వారి గ్రామాల్లో గాలించి పట్టుకుని, అరెస్టుచేసి,  జీపుల్లో తీసుకెళ్ళడం అనే సాధారణ పద్ధతిని వదిలేసి, హెలికాప్టర్ల ద్వారా అదే రాష్ట్రంలోని