ఆర్ధికం

అసమానతలు పెంచుతున్నఉపాధి రహిత వృద్ధి

తొమ్మిదేళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి పాలనలో రాజ్యాంగం అమలు కావడం లేదు.  సమానత్వాన్ని, లౌకిక  తత్వాన్ని తృణీకరించే మనువాద భావజాల పాలన కొనసాగుతోంది. ఈ కాలంలో ఆర్థిక అసమానతలు, సంపద కేంద్రీకరణ విపరీతంగా పెరిగింది. సామాజిక, ఆర్థిక సమానత్వ ఆదర్శం బిజెపి- కార్పొరేట్‌ ఫాసిస్టు పెట్టుబడిదారీ విధానం వల్ల బీటలు బారింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో ఉంటూ దేశ సహజ వనరులను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ మన దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టింది. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని, ప్రభుత్వరంగ అభివృద్ధి, పౌరస్వేచ్ఛ, మానవ హక్కులను తుడిచివేసే ఫాసిస్టు పాలన కొనసాగుతోంది. ఫలితంగా
ఆర్ధికం

మాంద్యంలోకి ప్రపంచ దేశాలు

            మరోసారి ఆర్థిక సంక్షోభం రాబోతున్నదా! ప్రపంచ దేశాలు మాంద్యం బారిన పడబోతున్నవా! రష్యా-యుక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధంతో ఇప్పడికే భారీగా నష్టబోయిన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు మళ్లీ చిల్లులు పడబోతున్నాయా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. గత ఆరు మాసాలుగా ప్రపంచ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు క్రమంగా ఒక్కొక్కటి వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకున్నదన్న సాకును చూపెడుతూ అన్ని దేశాల బ్యాంకులు వడ్డీ రేట్లను ఒక్క శాతం పైనే పెంచేశాయి. ఈ నిర్ణయాలతో మదుపరుల్లో ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకున్నది. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. కరోనా సంక్షోభం
ఆర్ధికం

అస్తవ్యస్తంగా భారత ఆర్థికం

ఫిబ్రవరి 24వ తేదీ న్యూఢిల్లీలో జరిగిన జి-20 దేశాల ఆర్థిక మంత్రుల, సెంట్రల్‍ బ్యాకుంకు గవర్నర్ల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సందేశం ఇది! ‘‘భారత ఆర్థిక వ్యవస్థ అద్బుతంగా పురోగమిస్తోంది.భారతీయ వినియోగదారులు, ఉత్పత్తిదారులు భవిష్యత్తు పట్ల ఆశాజనకంగానూ, విశ్వాసంగానూ ఉన్నారు. దీని నుండి ప్రపంచ దేశాలు స్ఫూర్తిని పొందాలి. ఈ సమావేశంలో పాల్గొంటున్న వారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అదే సానుకూల దృక్పథాన్ని అందించగలరని మేం ఆశిస్తున్నాం. ప్రపంచ వృద్ధిలో స్థిరత్వాన్ని, నమ్మకాన్ని సాధించాలంటే అదొక్కటే మార్గం’’. ప్రధాని ఆ మాటలు చెప్పి పది రోజులు గడవకవ•ందే వాల్‍స్ట్రీట్‍ జర్నల్‍ తాజాగా దానికి పూర్తి భిన్నమైన
కాలమ్స్ ఆర్ధికం

అదానీ గుట్టు విప్పిన హిండెన్‌బర్గ్‌

ప్రధాని నరేంద్ర మోడీకి ఎంతో సన్నిహితుడు గుజరాత్‌ వ్యాపారి గౌతమ్‌ అదానీ ఇప్పుడు ఆయన  సిరుల శిఖరాల వెనుక అతి పెద్ద కుట్ర దాగి ఉన్నదని అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ అనే అంతర్జాతీయ సంస్థ జనవరి 24న వెల్లడించిన  సమాచారం సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే మూడవ అత్యంత ధనవంతునిగా ఖ్యాతికెక్కిన గౌతమ్‌ అదానీ వ్యాపార మోసాల పుట్ట పగిలింది. ఇంతకాలం ఆయన చక్కబెట్టిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. అదానీ నెరపిన మార్కెట్‌ కుంభకోణాలను దాంతో డబ్బు సంపాదనా పరులకు ఆదర్శంగా నిలిచిన అదానీ ఆర్థిక ఎదుగుదల వెనుక గల