వ్యాసాలు

జాతీయ విద్యా రాజకీయాలు

జాతీయ విద్యా విధానం-2020(జా.వి.వి.)ని భారత యూనియన్ ప్రభుత్వం కేవలం ఒక ప్రకటన ద్వారానే పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పార్లమెంటులో ఎటువంటి చర్చ గాని, ఆమోదం గాని లేకుండానే ప్రవేశపెట్టబడిన ఈ జా.వి.వి. కవర్ పేజీ సరిగ్గా జా.వి. వి-1986 కవర్ పేజీ లాగే కనబడుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి, ఆర్థిక మంత్రుల ప్రసంగాలలో దీనిని అత్యంత గొప్పదిగా ప్రశంసించారు. ఇప్పటికే ఇందులోని అనేక అంశాలను అమలులోకి తీసుకొచ్చారు. ఇంకా ఇతర అంశాలను తన అధికారిక ప్రకటనలు, మెమొరాండాల ద్వారా యూనియన్ ప్రభుత్వం ముందుకు తెస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలను, అకడెమిక్ సంస్థలను  కూడా త్వరగా అమలు చేయమని ఒత్తిడి చేస్తోంది. నిజానికి