మీ ఇంటిపైనే ఎందుకు దాడి చేశారు.. మా ఇంటిపై ఎందుకు చేయలేదు?
సెప్టెంబరు 5న మా ఇంటితో పాటు ఎనిమిది చోట్ల ఎన్ఐఏ దాడులు చేసిన తర్వాత.. ‘మీ ఇంటిపైనే ఎందుకు దాడులు చేశారు.. మా ఇంటిపై ఎందుకు దాడి చేయలేదు?” అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ముందుగా, ఈరోజు మేం పడుతున్న మానసిక వేదన మరెవరికీ రాకూడదని కోరుకుంటున్నామని చెప్పాలి. అయితే, అది మన యిష్టాయిష్టాలపై ఆధారపడి ఉండదు. కానీ ఎవరైనా ముస్లింలని అరెస్టు చేసినప్పుడు లేదా వారి యింటిపై దాడి జరిగినప్పుడు, సాధారణంగా ముస్లింలు మీ యింటి మీదనే ఎందుకు దాడి చేశారు అని ప్రశ్నించరు. సూరత్‌లో అరెస్టయిన ముస్లింలను నిర్దోషులుగా జైలు నుంచి విడుదల చేసిన తర్వాత ప్రముఖ