సాహిత్యం కవిత్వం

తండ్రి తొవ్వ‌లో

మున్నా మున్నా మున్నా- నా చిన్నారి పొన్నారి కన్నా నాన్న ప్రేమకు నువ్వు వారధివి నా కలల ప్రపంచం సారధివి పృథ్వి అడిగే ప్రశ్న ఆకాశం నడుమ అడివే తీర్చింద సందేహం ॥ము­న్నా॥ నీ తండ్రి భుజంపైన బందూకురా నిన్నెత్తుకునే జాగ యాడుందిరా నీలాగే సుట్టూత జనసేనరా కొడుకైన జనంలో భాగమేరా పొద్దంత మీ నాన్న సూర్యుడైతే రాత్రంత ఎన్నెలై సెంట్రీగాస్తివా ॥ము­న్నా॥ నిన్ను పొమ్మంటు దీవించలేనైతిరా నిన్ను వద్దంటు నేచెప్పలేనైతిరా నువు మెచ్చినా వనమంత జ్ఞానమేరా నీకిచ్చిన ఆస్తంత త్యాగమేరా నిన్ను చుట్టు వ­ట్టిందో పద్మవ్యూహం నువ్వభిమన్యుడైనావా ప్రజల కోసం   ॥ము­న్నా॥ పృథ్వంటు ఒక పేరు