ఎబివిపి మూకదాడితోనే విద్యార్థి మరణం
ఎబివిపి హింస,వర్శిటీ యాజమాన్యం మౌనం ఒక విద్యార్థి ప్రాణాన్ని తీసింది. మే 17 రాత్రి, ఎబివిపి అనుబంధ విద్యార్థులు మరియు స్టూడెంట్స్ యూనియన్ సభ్యులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎఫ్-హాస్టల్ ముందు గుంపుగా చేరారు. ఒక విద్యార్థి ల్యాప్‌టాప్‌లు దొంగిలించాడనే ఆరోపణలపై వెంటనే చర్య తీసుకోవాలనేదే ఈ గుంపు సమీకరణానికి చెప్పిన కారణం.అయితే, ఆ గుంపు త్వరలోనే అత్యంత మూక దాడి స్వభావంతో మారి,ఆ విద్యార్థిని తమ అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించింది. అక్కడికి పరిస్థితిని అదుపు చేయడానికి వచ్చిన ఒక దళిత అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (ASO) పై కూడా దాడి చేసి, అందరి ముందూ దూషణలు చేస్తూ










