సమీక్షలు

విముక్తి పోరాట కథలు

ఇటీవ‌ల *కొలిమి* ప్ర‌చుర‌ణ‌గా విడుద‌లైన *అల్లం రాజ‌య్య క‌థ‌లు-నేప‌థ్యం* పుస్త‌కానికి రాసిన ముందుమాట‌)  కొన్ని కథలు మనల్ని నిద్రపోనీయవు. వెంటాడతై. నిద్రలోనూ. మెలకువలోనూ. లోలోపల కల్లోలం రేపుతై. మనసంతా దిగులు నింపుతై. కన్నీళ్లు నింపుతై. జీవితాంతం గుర్తొస్తయి. అట్లాంటి కథకులు కొందరే ఉంట‌రు. తమ చుట్టూ ఉన్న జీవితాలను నిశితంగా పరిశీలించి రాస్తరు. లోలోపల దగ్దమవుతూ వెన్నెల కురిపించే వాక్యాలు రాస్తరు. తెలంగాణ నేలన ఉవ్వెత్తున ఎగసిన ప్రజాపోరాటాలను కథలుగా రాసిన అల్లం రాజయ్యదీ అదే దారి. ఆ దారి ప్రజా గర్జనై ఉరిమిన ఉత్తర తెలంగాణ భూపోరాటాల దారి. నాగేటి సాళ్లల్ల రగిలిన రైతుకూలీల జైత్రయాత్ర దారి.
సమీక్షలు

మట్టి పరిమళం వెదజల్లే కథలు

(ఇటీవ‌ల విడుద‌లైన తాయ‌మ్మ క‌రుణ   క‌థ‌ల సంపుటి *విభ‌జ‌న రేఖ‌*కు రాసిన ముందుమాట‌) రచయితగా కరుణ పాఠకులకి కొత్త కాదు. దాదాపు మూడు దశాబ్దాల కాలంగా కథలు రాస్తోంది. ‘తాయమ్మ కథ’తో సాహిత్య రంగంలోకి అడుగుపెట్టిన కరుణ, మొట్టమొదటి కథతోనే చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఆ కథ పేరే ఇంటి పేరుగా మారిపోయి తాయమ్మ కరుణ అయ్యింది. ఇప్పటికే రెండు కథా సంకలనాలు ప్రచురించి ఉంది. విప్లవోద్యమం నేపథ్యంలో కథలు రాసిన తొలి తరం అజ్ఞాత విప్లవ మహిళా రచయితల్లో కరుణ కూడా ఒకరు. నక్సల్బరి ఉద్యమం భారత ప్రజల ఉద్యమ చరిత్రలో ఒక కీలక మలుపు. ఇది
సమీక్షలు

గతం కూడా వర్తమానమే..

 కవిత్వ రచనలో అనేక ప్రాపంచిక దృక్పథాలు ఉంటాయి. సృజనాత్మకత ఏదో ఒక దగ్గర స్థిరం కాదు. కవి చుట్టు పరిభ్రమిస్తున్న సామాజిక స్థితి యొక్క వ్యక్తీకరణ ప్రధానం. అనుసంధానం కూడా ప్రధానమైనదే. ప్రాంతం, సామాజికత లేదా ఇతర భిన్న రూపాలు కవిత్వంలో ఇమడవచ్చు. ఆ ఇమడిక లో సాంధ్రత ముఖ్యమైనది. ఒకానొక ప్రాంతానికి ప్రాతినిత్య కవి అనలేము. దృక్పథానికి సంబంధించిన భావజాలం. కవి పుట్టుక, కవిత్వ రచన ఏచలనం దగ్గర మొదలైంది. కేంద్ర స్థానాన్ని వెతకాలి. ఈ వెతకడంలో కవి అంత రంగం కనబడతుంది. కేవలం సంవేదన మాత్రమేనా? ఈ రసాయినిక ప్రక్రియ వెనుక దాగిన కల్లోలం ఏదో
సమీక్షలు

త్యాగాల చరిత్ర తల్లులు-బిడ్డలు

తల్లులు బిడ్డలు రచించినది హుస్సేన్. సుదీర్ఘకాలం విప్లవోద్యమంలో పనిచేసిన వ్యక్తి. తల్లులు బిడ్డల మధ్య ఉన్న ప్రేమ కన్నా, తల్లులకై బిడ్డలు చేసిన పోరాటాలు త్యాగాలే ఎక్కువ ఉన్నాయి ఇందులో. తల్లుల కొరకై బిడ్డలు,బిడ్డల కొరకై తల్లులు,తల్లడిల్లిన క్రమం, బిడ్డలు విప్లవంలో ఎదుగుతున్న తీరు చూసి సంతోషించిన తల్లులు, దూరమవుతున్న పిల్లలను చూస్తూ బాధపడతారు.బిడ్డల క్షేమాన్ని కోరుకుంటారు. ఈ పుస్తకం కేవలం తల్లులు బిడ్డల మధ్య జరిగినది కాదు. ఇది ఒక తరం ధైర్యానికి సాహసానికి, త్యాగనిరతికి, ప్రతీక ఈ పుస్తకం. ఉత్తర తెలంగాణ ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల,మంచిర్యాల, ప్రాంతంలో చెలరేగిన ఉద్యమాల ఊట చెలిమ. సింగరేణి
సమీక్షలు

క‌థ‌ల సేద్యం

శ్రీనివాస మూర్తి ‘ఖబర్‌కె సాత్‌’ పదిహేను కథలు చ‌ద‌వ‌డ‌మంటే రాయలసీమ ముప్పై సంవత్సరాల రాజకీయార్థిక పోరాటాల భావోద్వేగాలతో మిళితం కావ‌డ‌మే. 1978 నుండి మా వూరంత ప్రేమగా ` రాయలసీమతో నాకు అనుబంధం ఉంది. మధురాంతకం రాజారాం, నరేంద్ర, మహేంద్ర, పిసి నర్సింహారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, వడ్డెర చండీదాస్‌, సింగంనేని నారాయణ, శేషయ్య, శశికళ, బండి నారాయణస్వామి, నాగేశ్వ‌రాచారి,  శాంతినారాయ‌ణ‌, దేవపుత్ర, కేశవరెడ్డి, నామిని, రాసాని, సడ్లపల్లి చిదంబర రెడ్డి, పాణి, వరలక్ష్మి, వెంక‌ట‌కృష్ణ‌, సుభాషిణి, రామ‌కృష్ణ‌, రాప్తాడు గోపాలకృష్ణ, చక్రవేణు, సౌదా,  త్రిపురనేని శ్రీనివాస్‌, విష్ణు వంటి ఆత్మీయులంద‌రితో క‌లిసి తిరిగిన రోజుల‌వి.    విద్యార్థి ఉద్యమాలు,
సమీక్షలు

అశాంత, అవిశ్రాంత విజయగాథ

ముందే నిర్ణయమైన పరిస్థితుల మధ్య, నియంత్రించలేని పరిణామాల మధ్య, మనుషులు సొంత వ్యక్తిత్వాల్ని ఎట్లా తీర్చిదిద్దుకోగలరు? జీవితగమనాన్ని తామే నిర్దేశించుకునే ఇచ్ఛను ఎట్లా నెరవేర్చుకోగలరు?  విధింపులను కాదని ఎంపికలను సాధన చేయడం ఎట్లా? యథాస్థితికీ మార్పుకూ మధ్యనే కాదు, అనేక కొత్తదారుల మధ్య, అనేక మంచిదారుల మధ్య దిక్కుతోచని తనాన్ని అధిగమించడం సాధ్యమా? పై ప్రశ్నలను ఉదాహరణలతో సహా చర్చించుకుంటూ పోతే, అది శాంత జీవితం అవుతుంది. ఆమె ప్రయాణాన్ని  దాని ముళ్ల దారుల నుంచి కాలిబాటల నుంచి సొంతంగా వేసుకున్నరహదారుల దాకా,  ఆటుపోట్లు, జయాపజయాలు, రాజీలూ సర్దుబాట్ల తో సహా, బొమ్మకడితే అది ‘చుక్కపొడుపు’ నవల.  శాంత
సమీక్షలు

Renuka Becoming Midko

Comrade GumudavelliRenuka (Midko)’s literature is a great contribution to Telugu literature, especially revolutionary literature. It was through Renuka’s stories that everyone came to know that "Midko" means "a firefly." Today, these stories are no longer confined to Telugu speaking states but have crossed the linguistic and regional barriers in the country by being translated into multiple Indian languages. They are even crossing national boundaries and gaining a global readership. However,
సమీక్షలు

మన కాలపు తల్లులు-బిడ్డల కథే విప్లవోద్యమం

హుస్సేన్‌ రచించిన తల్లులు, బిడ్డలు చారిత్రిక స్మృతులు సింగరేణి విప్లవోద్యమ చరిత్రను ఈ తరానికి హృద్యంగా పరిచయం చేస్తుంది. “'తల్లులు-బిడ్డలు” చదువుతున్నసేపు గోర్కీ 'అమ్మ” నవల గుర్తుకు వస్తూ ఉంటుందని, ముందుమాట రాసిన విమల్‌ అంటాడు. ఇది వాస్తవమే. రష్యన్‌ విప్లవోద్యమలో   వచ్చిన సాహిత్యాగానికి   ఎంతో లోతు, విస్తృతి ఉంది. అది ప్రపంచంలోనే ఒక గొప్ప సాహిత్యంగా గుర్తించబడింది. అందులో అమ్మ నవల మహా రచయిత గోర్కీ కలం నుండి జాలువారింది. అమ్మ నవలను ప్రపంచంలో కోట్లాది మంది చదివారు. ఎంతో మంది ఆ నవల చదివి విప్లవకారులుగా మారారు. 1905 లో రష్యాలో విప్లవం ఓడిపోయి కార్మిక
సమీక్షలు

చరిత్ర పుటల్లోకి ..పోరాట దారి మలుపే ‘తిరుగబడు’ కవిత్వం

'తిరుగబడు' కవితా సంకలనం వచ్చిన 53 ఏళ్లకు  తిరుగబడు కవులమీద తిరిగి చర్చ జరగటం ఆహ్వానించదగిన విషయం. " ఇలా వచ్చి అలా వెళ్లిన 'తిరుగబడు కవులు...' " శీర్షికతో రజా హుసేన్ రాసిన విమర్శ చదివాక ఇది రాయాల్సి వచ్చింది. దిగంబర కవులకు లేని లక్ష్యశుద్ధి తిరుగబడు కవులకు ఉన్నది అని రచయిత స్వయంగా ప్రశంసించిన తర్వాత పై రెండు కవిత్వ పాయల లక్ష్యాలు వేర్వేరు అని తేటతెల్లం అవుతుంది వేర్వేరు పరిధుల్లోని  కవిత్వాలమధ్య పోలిక అసంబద్ధమైంది. దిగంబర కవులదికుళ్లిపోయిన సమాజం పట్ల ఒక బలమైన ప్రతిస్పందన. దాని వికృతిని పతనావస్థను  పదునైన మాటల్లో వర్ణించారు. కాని
పరిచయం

ప్ర‌జాస్వామ్యం కోసం అన్వేష‌ణ‌

కాలికి బలపం కట్టుకొని అన్నట్టుగా ఈ మధ్య కాలమంతా తెలుగు నేలంతా తెలంగాణ అడుగడుగునా దేశం నాలుగు చెరగులా శాంతి కపోతమై తిరుగాడుతూ, తన ఉపన్యాసాలతో మధ్య తరగతిని, యువతను, విద్యార్థులను చైతన్యవంతం చేస్తూన్న, శాంతి చర్చల మేధావి మనందరికీ సుపరిచితులైన ప్రొఫెసర్ జి. హరగోపాల్ గారి ఇంటర్వ్యూలు, ఉపన్యాసాల వ్యాసాల పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని  రచయిత శాంతి చర్చల సాధనలో నిత్య కృషీవలుడైన ఎస్ ఆర్. శంకరన్ గారికి అత్యంత గౌరవంతో అంకితం చేశారు. ఇది రచన ఆచరణ రెండు చేతులా  చేస్తున్న పాలమూరు అధ్యయన వేదిక ప్రచురణ.  నేటి వ్యవస్థీకృత హింసకు శాంతి చర్చలే