*అభివృద్ధి*ని ప్రశ్నిస్తున్న కథ
సీనియర్ కథా రచయిత్రి ముదిగంటి సుజాతా రెడ్డి 2018 లో ప్రచురించిన "నిత్యకల్లోలం" కథాసంపుటి లోని , ఈ కథను చదివితే నిజానికి అభివృద్ధి అంటే ఏమిటి ? అది ఎవరి కోసం? అభివృద్ధి ఫలితాలు ఏమిటి? అవి ఎవరి కోసం ?నిత్యం సమాజంలో జరుగుతున్న సంఘటనలు వార్తా కథనాలై, ప్రత్యక్ష ప్రసారాలై, మనసులో ఎలాంటి ఆలోచనలు కలిగిస్తున్నాయి ? మనిషి వాటికి ఎలా స్పందిస్తున్నాడు అనే ప్రశ్నలు మనల్ని వెంటాడతాయి.నిద్రపుచ్చటం కన్నా ప్రశ్నించటం మంచిది అనుకుంటే, ప్రశ్నించే గుణం ,తత్వం ఈ రచయిత్రి కి ఈ రచయిత్రి సృష్టించిన అనేక పాత్రలకు పుష్కలంగా ఉన్నాయి.*అన్నీ మరిచిపోయి మనిషి


