రూర్ఖండ్‌లోని సరండా అడవుల గురించి మీరు వినే ఉంటారు. భారతదేశంలోనే అనేక పోరాటాలతో ప్రజ్వరిల్లుతున్న నేల అది. ఆ ఉద్యమాలను అణచివేయడానికి చాలా ఏళ్లుగా అక్కడ దారుణ నిర్బంధం కొనసాగుతోంది. అయినా ఆదివాసులు వెనక్కి తగ్గలేదు. చిడియాబేడా, లోవాబేడా, హాథిబురు అడవులలో కోబ్రా బటాలియన్‌ 209, 205, రూర్జండ్‌ జాగ్వార్‌, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన పోలీసు బలగాలు గాలింపులు జరుపగా కొన్ని పోస్టర్లు, బ్యానర్లు సహ రోజువారిగా వాడుకునే దినుసులు దొరికినట్టు, సీరిస్‌ కనెక్షన్‌లో వుంచిన మందుపాతరలను కనుగొని వాటిని డిఫ్యూజ్‌ చేసినట్టు 12 నవంబర్‌ 2022 (ప్రభాత్‌ ఖబర్‌, దైనిక్‌ భాస్కర్‌ తదితర హింది పత్రికలలో) వార్త ప్రచురితమైంది. ఈ సందర్భంగా ఆదివాసులపై భద్రతా దళాలు దాడులు చేశాయి. దీంతో రూర్ఖండ్‌ జనాధికార్‌ మహాసభ తరపున కమల్‌ పూర్తి, నారాయణ్‌ కాండెయాంగ్‌, రమేశ్‌ జెరాఈ, సిరాజ్‌ దత్తా నిజ నిర్ధారణ బృందం క్షేత్ర పరిశీలన చేసి నివేదికతను తయారు చేసింది. దాని తెలుగు అనువాదాన్ని పాఠకులకు అందిస్తున్నాం – వసంతమేఘం టీం

అంజన్‌బేడా రెవెన్యూ గ్రామానికి చెందిన, అడవిపై ఆధారపడిన టోలా చిడియాబేడా. సదర్‌ మండలంలోని పండాబీర్‌ గ్రామపంచాయతీకి చెందిన అంజన్‌బేడా జిల్లా ముఖ్యాలయానికి ఇంచుమించు 21 కి.మీల దూరంలో వుంటుంది. అంజన్‌బేడాకు చిడియాబేడాకు మధ్య 6కి.మీల దూరం వుంటుంది. ఇది భౌగోళికంగా గోఇల్‌కేరా మండలంలోకి వస్తుంది. ఈ వూరు నాల్గువైపుల అడవి, కొండలతో కప్పేసి వుంటుంది. చిడియాబేడాలో 25-30 ఇండ్లుంటాయి. వీళ్లలో అత్యధిక అదివాసులు ‘హో’ సముదాయానికి చెందిన వారే. వాళ్లు ‘హో’ భాష మాట్లాడుతారు. గ్రామస్థులు తమ జీవిక కోసం ప్రధానంగా వ్యవసాయంతో పాటు అటవీ వుత్పత్తుల (ఎండు కర్రలు, పళ్ల పుల్లలు, అకులు ఇత్యాది) పైనే అధారపడుతారు. అందరిళ్లలో పశువులు, ముఖ్యంగా మేకలు ఉంటాయి.

చిడియాబేడాలో అంగన్‌వాడీ లేదు. సమీప ప్రాథమిక పాఠశాల అంటే 6 కి.మీల దూరంలోని అంజన్‌బేడాలోనే వుంది. ఫలితంగా, పిల్లలు అంగన్‌వాడీ సేవల నుండి వంచితులవుతున్నారు. చిడియాబేడాకు చెందిన చాలా మంది పిల్లలు బడి దూరం వుండడంతో పాటు చుట్టూ దట్టమైన అడవే వుండడంతో (ఎలాంటి ప్రజా రవాణా సౌకర్యం కూడ లేదు) వెళ్లడం లేదు. ఈ వూళ్లో బావి కానీ బోరింగ్‌ కానీ లేవు. మంచినీళ్ల కోసం గ్రామస్థులు యేటా ఓ బొంద (తాగు నీటిగుంత) తవ్వుకుంటారు. కొన్ని కుటుంబాలకు రేషన్‌ కార్డు లేదు. చాలా మంది ముసలివాళ్లకు, విధవలను పింఛన్‌ దొరుకడం లేదు. అంజన్‌బేడాకు చెందిన 8 కుటుంబాలకు గత యేడాది కాలంగా రేషన్‌ ఇవ్వడం లేదు. అధికారులకు విన్నవించుకున్నా అతీ గతీ లేదు. స్థానికంగా పనులు లేకపోవడంతో, గ్రామీణ యువకులు పెద్ద ఎత్తున వలస కూలీలుగా వెళుతుంటారు.

పోలీసుల దాడుల వివరాలు:
11 నవంబర్‌ 2022 రోజు వేల సంఖ్యలో భద్రతా బలగాలు చిడియాబేడా చేరాయి. వాళ్లు గాలింపు పేరుతో ఇల్లిల్లూ గాలించి ఇళ్లలోని దినుసులలో (ధాన్యం, బట్టలు, గంజులు మొదలైనవి) పాటు కళ్లంలో వున్న ధాన్యాన్నీ నాశనం చేశారు. వాళ్లు ఊరివాళ్లతో హిందీలో ‘దున్నపోతులు’, ‘పార్టీ వాళ్లు’, ‘మావోయిస్టులు’ ఎక్కడున్నారంటూ ప్రశ్నిస్తూ హిందీలోనే జవాబివ్వాలన్నారు. కానీ వాళ్లు తమకు హిందీ సరిగా రాదంటూ తమ హో భాషలోనే చెప్పే ప్రయత్నం చేశారు. అ క్రమంలో భద్రతా బలగాలు అనేక మంది మహిళలపై చేయి చేసుకున్నారు. ఒక అమ్మాయితో అసభ్యంగా వ్యవహరించారు. ఊళ్లో అంతా భయపడ్డారు. ఏం చేయాలో వాళ్లకు తోచలేదు.

నోనీ కుఈ జోజో అనే వృద్ధ మహిళ వాకిట్లో కూచోని వుండగా తన కూతురు శాంతి జోజో పరుగెత్తుకొచ్చి పెద్ద ఎత్తున పోలీసులు తమ ఇంటివైపు వస్తున్నారని చెప్పింది. ఆమె పరుగెత్తుకుంటూనే ఇంట్లోకి వెళ్లింది. అప్పటికే 20-30 మంది పోలీసులు వాళ్లింటికి చేరుకున్నారు. ఇద్దరు పోలీసులు తలుపులకు అడ్డంగా నిలబడి శాంతిని బయటకు రాకుండా అడ్డగించారు. ఇంట్లో వున్న ధాన్యాన్ని పారపోశారు. పోలీసులు నోనీని తన భర్త గురించి

అడుగ్గా తాను విధవరాలినని చెప్పింది. తాను, తన కూతురు మేకలు కాసుకుంటూ బతుకుతున్నాం అని చెప్పింది. అయితే అవిడ భాష వాళ్లకు అర్థమే కాలేదు.

లోపల ఇద్దరు జవానులు శాంతి పెడ రిక్కలు విరిచిపట్టుకోగా, మరో జవాన్‌(ఎర్రగున్నడు) అమె ఎదను నలిపేయసాగాడు. అమె ఏదో విధంగా విడిపించుకొని అ గది నుండి బయటపడి ఏడ్చుకుంటూ తన తల్లిని వాటేసుకుంది. వెనుకనుండి ఓ పోలీసు శాంతిని పట్టుకోబోతే వాడికి అమె వంటిపై నున్న తువ్వాల అందింది. వాడు శాంతిని లాగుతూ అడవి వైపు గుంజుకుపోయాడు. కానీ, తల్లి శాంతిని విడువకపోవడంతో లావుపాటి కర్రతో నోనీ కుఈ వీపు మీద రెండు దెబ్బలు వేసేసరికి కర్ర విరిగింది. దానితో మరో కర్రతో విపరీతంగా బాదాడు. అయినప్పటికీ తల్లి తన కూతురును వదలకపోయేసరికి భద్రతా బలగాలు ఏదో తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత, మహిళలందరిని కూచుండపెడుతున్నచోటికి వెళ్లి నోనీ తన కూతురుతో కూచుంది. శాంతి జోజో తనతో అసభ్యంగా వ్యవహరించిన పోలీసులు తనపై అత్యాచారానికి పాల్పడతారని భయపడ్డట్లు ్ట నిజనిర్ధారణ బృందంతో  చెప్పింది. 

ఊళ్లో ఇంకా అనేక మందిపై దౌర్జన్యానికి పూనుకున్నారు. 16 ఏళ్ల బామియా బహందా అమ్డా చెట్టు ఎక్కి పంద్లు కోసుకుంటుండగా భద్రతా బలగాలు ఆయన్ని చుట్టుముట్టి కిందికి దిగుమన్నారు. మళ్లీ హిందీలోనే ఆయనను ప్రశ్నలడగడం మొదలుపెట్టారు. ఆయన్ని ఇంట్లోకి తీసుకువెళ్లి ఇంట్లో వున్న వడ్లు ఎగజల్లారు. బామియా మెడలు పిసికుతూ, చెవులు గట్టిగా వడిపెట్టారు. గొంతు నులుముతూ మెడ పట్టుకొని పైకి లేపి తరువాత బాగా కొట్టారు. కుడిచెవు ఇప్పటికీ నొప్పిగానే వుంది. ఆయనను కాపాడుకోవడానికి తల్లి కద్మా వెళితే ఆమెను కూడ కొట్టారు. ఆమె రెండు చెవులు పట్టుకొని ముందూ, వెనుకా వీపు మీద కాళ్లతో తంతూ తుపాకి బట్‌తో మోదుతూ ఇంటివరకు తీసుకువెళ్లారు. ఇప్పటికీ ఛాతీ నొప్పిగానే వుంది. అమె వెంట్రుకలను పట్టుకొని ఇటూ అటూ అమెను గిర గిర తిప్పారు. అ తరువాత ఇంట్లో పెట్టెలో వున్న బట్టలన్నీ తీసి బయట పడేశారు.

పోలీసుల ఘాతుకాలన్నీ చూసిన ననికా తాంసోయి తన కొడుకు వీళ్ల చెరన పడకూడదని కొడుకును వెతుక్కుంటూ వెళ్లింది. అ లోపు పోలీసులు ఆమె ఇంటి తాళం పగులకొట్టి ఇంట్లో వున్న మొత్తం వడ్లు ఇతర దినుసులు చెల్లా చెదురు చేసి ఇంట్లో వున్న సామానులన్నీ చిందరవందర చేశారు.

పైన పేర్కొన్న వ్యక్తులు తమపై జరిగిన ఘాతుకాలను సత్యాన్వేషణ బృందానికి చెప్పుకున్నట్టే మిగితా మహిళలు కూడ కింది విధంగా చెప్పుకున్నారు. 

శురూ గోప్‌:
నేను సీఆర్‌పీఎఫ్‌ వాళ్లను చూసి ఇంటి తలుపులకు గొడ్డలితో బేడం వేసిన. కానీ, అక్కడికి చేరుకున్న సీఆర్‌పీఎఫ్‌ వాళ్లు ఒక్క తన్ను తన్ని తలుపులు దొబ్బుకొని లోపలికి జొరితే, ఒక పోలీసుతో నేను గొడ్డలి కోసం గింజులాడుతుంటే మిగితావారు ఇంట్లో వున్న దినుసులు,బట్టలు అన్నీ ఎక్కడికక్కడ చెల్లాచెదురు చేశారు. వాకిట్లో వున్న వడ్ల కట్టలు ఇటు అటు పారేశారు. వాళ్లు ఇంట్లోకి బూట్లతోనే సొచ్చారు. దేవునింట్లకు కూడ అట్లనే పోయారు. నేను వాళ్లను బూట్లతో వెళ్లకండి, మేం పూజ చేసుకునేవాళ్లం బూట్లు విడిచి లోపలికి పోండి అని వారించాను. అపుడు ఓ పోలీసు తన తుపాకి నాపై పెట్టిండు. మా ఆధార్‌ కార్డులన్నీ పట్టుకుపోతుంటే, నా కోడలు గుంజుకొని తెచ్చింది. తరువాత ఇంట్లో వున్న బాతు గుడ్లు పట్టుకుపోయారు.

శురూ తాంసోయి, వయసు దాదాపు 35 సంవత్సరాలు, భర్త పచాయి తాంసోయిః:
నేను గర్భవతిని. నేను ఇంట్లోను వుండగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌లు వవచ్చారు. నేరుగా ఇంట్లోకి బూట్లతోనే జొరబడుతుంటే, నేను వాళ్లను చొరబడనీయలేదు. దానితో వాళ్లు నా ఛాతీ మీద బందూక్‌ పెట్టేసరికి నేను ఏం మాట్లాడలేకపోయిన. వాళ్లు ఇంట్లో వున్న వడ్లన్నీ చెల్లాచెదురు చేశారు.

ముగింపు:
బాధితులు చెప్పేదాన్ని బట్టి గాలింపుల పేరుతో మరోమారు చిడియాబేడ ఆదివాసీలపై భద్రతా బలగాల హింస కొనసాగిందనేది స్పష్టం. ఎంతో మందిని కొట్టారు. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి అసభ్యంగా వ్యవహరించారు. ఇండ్లల్లో పెట్టుకున్న సామాన్లన్నీ చెల్లాచెదురు చేశారు. మీడియా రిపోర్టు ( భద్రతా బలగాలు విడుదల చేసిన ప్రెస్‌ విజ్ఞప్తిపె ౖఅధారపడిరది)లో అడవిలో కొనసాగించిన కేంపెయిన్‌లో మావోయిస్టుల సామగ్రి గురించి విస్తృతంగా రాశారు. కానీ, నిరపరాధులైన ఆదివాసీలపై జరిగిన హింస దౌర్జన్యాల గురించి కనీసంగానైనా ప్రస్తావించ లేదు.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేమంటే, 15 జూన్‌, 2020లో కూడ పోలీసులు నక్సలైట్ల గాలింపు కేంపెయిన్‌ సందర్భంగా చిడియాబేడ ఊరు ఆదివాసులను కర్రలతో, రైఫిల్‌ ఐట్లతో, బూట్లతో దారుణంగా కొట్టారు. 11 మందిని విపరీతంగా కొట్టారు. వారిలో ముగ్గురికి బాగా గాయాలయ్యాయి. మహాసభ వాళ్లు సమస్య లేవనెత్తగా దానిని విచారించాలని తమ ట్విట్టర్‌పై పోలీసులకు ఆదేశాలిచ్చారు. కానీ, పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సీఆర్‌పీఫ్‌ వాళ్ల దౌర్జన్యాల గురించి కనీసంగానైనా ఉల్లేఖించలేదు. బాధితులు అనేకసార్లు వివిధ స్థాయిలలోని అధికారులకు విన్నవించుకున్నారు. కానీ ఈనాటి వరకు నిందితులైన సీఆర్‌పీఎఫ్‌ వాళ్ల మీద ఎలాంటి చర్యా తీసుకోలేదు. బాధితులకు నష్ట పరిహారం ఇవ్వలేదు. పీడితుల అభ్యర్థనను కోర్టులో ప్రవేశపెట్టడంలో కూడ దర్యాప్తు అధికారుల వైఖరి నకారాత్మకంగా, ఉదాసీనంగానే వుంది. భద్రతా బలగాల ద్వార తిరిగి ఇదే వూరి వాళ్ల పై పోలీసులు హింసకు పాల్పడ్డారంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదివాసీల ప్రాథమిక హక్కులను కాపాడుతూ భద్రతా బలగాలతో చట్టం పట్ల విధేయతను ప్రదర్శింపచేయడానికి బదులు అదివాసీల హక్కులను కాలరాచివేస్తూ చట్ట పరిధి నుండి పోలీసులను మినహాయింప చేస్తున్నాయని అర్ధమవుతోంది. గాలింపుల సందర్భంగా అదివాసీల, బాధితుల పట్ల పోలీసుల వైఖరి అమానవీయంగా వుంటుందనేది కూడ స్పష్టంగానే వుంది. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు వుండవచ్చు. వారికి ఊరివాళ్లు అప్పుడపుడు తిండి కూడ పెడుతుండవచ్చు. కాన్సీ గ్రామస్థుల ప్రత్యేక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి బదులు వాళ్లపై హింసకు పూనుకుంటున్నారు. మానవహక్కులను హననం చేస్తున్నారు. అలాగే సారండా ప్రాంతంలో గ్రామీణులు వ్యతిరేకిస్తున్నప్పటికీ, గ్రామసభల అనుమతి లేకుండానే భద్రతా బలగాల క్యాంపులు నెలకొల్పుతున్నారనే విషయం కూడ అగుపడుతోంది. ఇలా చేయడం ఐదవ షెడ్యూల్డ్‌, పెసా చట్టాన్ని ఉల్లంఘించడమే. ఈ ప్రాంతంలోని అదివాసీ-మూలవాసీ-వంచితులను తప్పుడుగా మావోయిస్టు ఘటనలలో ముద్దాయిలను చేస్తున్నారనేది కూడ అగుపడుతోంది.

రూర్ఖండ్‌ జనాధికార్‌ మహాసభ కింది డిమాండ్లను ముందుంచుతోంది:

 1. 11 నవంబర్‌ 2022 నాడు చిడియాబేడ గ్రామస్థులపై హింసకు పాల్పడి మైనర్‌ అమ్మాయితో అసభ్యంగా వ్యవహరించిన పోలీసులపై నేర విచారణ జరిపించి చర్య తీసుకోవాలి. వేధింపులకు గురైనవారికి నష్ట పరిహారం ఇవ్వాలి. నిజాలు వెల్లడిరచిన బాధితులకు ప్రభుత్వం, పోలీసులు, భద్రతా బలగాల నుండి ఎలాంటి ఇబ్బందులుండకుండా చూడాలి.
 2. 15 జూన్‌ 2020నాడు ఈ ఊరివాళ్లపై హింసకు పాల్పడిన పోలీసులకు వ్యతిరేకంగా సముచితమైన చర్య తీసుకోవాలి. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి.
 3. కేవలం సందేహాలతో, మావోయిస్టులకు తిండి పెట్టారనో నిరపరాధులైన అదివాసీలను మావోయిస్టు ఘటనలలో ముద్దాయిలుగా పేర్కొనకూడదు.
 4. నక్సలైట్ల గాలింపు చర్యల పేరుతో భద్రతా బలగాలు ప్రజలను వేధించకూడదు. ఆదివాసీలపై హింసకు పాల్పడకూడదు. ప్రజలపై తప్పుడు కేసులు మోపడం మొత్తానికే బందు పెట్టాలి. ప్రాథమిక నేరారోపణలను చెప్పుకోవడానికి బాధితులు వచ్చినపుడు పోలీసులు వారికి ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా వారి ఆరోపణలను స్వీకరించాలనే స్పష్టమైన ఆదేశాలు స్థానిక పోలీసులకు ఇవ్వాలి.
 5. ఐదవ షెడ్యూల్డ్‌ ప్రాంత సరిహద్దులలో ఎలాంటి గాలింపు కేంపెయిన్‌లకు తలపడినా ముందస్థుగా గ్రామసభ లేదా గ్రామ పెద్దల ఆమోదం తీసుకోవాలి. స్థానిక పోలీసులకు, భద్రతా బలగాలకు ఆదివాసీల భాష, అచార-వ్యవహారాలు, సంస్కృతి, వాళ్ల జీవన విలువల గురించి తర్ఫీÛదు ఇచ్చి వాటిపట్ల గౌరవంగా వ్యవహరించేలా చూడాలి.
 6. గ్రామస్థులతో చర్చించకుండా, గ్రామసభ అనుమతి లేకుండా బలవంతంగా పోలీసు క్యాంపులు పెట్టకూడదు.

(అదనపు సమాచారం కోసం కమల్‌ పూర్తి (9801979253), రమేష్‌ జెరాఈ(9162168149), సిరాజ్‌ దత్తా (9939819763) లతో సంప్రదించండి. లేదా జార్ఖండ్‌ జనాధార్‌మహాసభను సంప్రదించండి.

(నోటు: గత సంవత్సరం నుండి మోదీ ప్రభుత్వం దేశ అదివాసుల గౌరవ దినంగా బిర్సాముండా జయంతి రోజును (నవంబర్‌ 15) పాటిస్తున్నది. చిడియాబేడ అదివాసీ ప్రజలపైసరిగ్గా దానికి నాలుగు రోజుల ముందు దాడులు జరుగడం గమనార్హం – అనువాదకులు)

అనువాదం: అవని

Leave a Reply