Stories

Comrade Pojje’s Letter

“Come what may, today I must write the letter. I was told that Idumaal dada and others would be leaving within two days,” thought Pojje while going for her 6 am sentry duty. She was not yet twenty. She stopped at the camp ‘B’ tent that was on her way and looked for Sajonti. But she did not find her. “She hasn’t returned from her sentry duty yet,” replied Reena
కథలు

నిర్ణయం

అమ్మను వదిలి ఒకరోజు అయిపోయింది. అయినా అమ్మ నాతో మాట్లాడుతున్నట్లుగానే అనిపిస్తోంది. నా చుట్టూ జరుగుతున్న వాటిల్లో పడి అమ్మనూ, అమ్మ చుట్టూ తిరుగుతున్న ఆలోచనలనూ తాత్కాలికంగా దూరంపెడుతున్నానే తప్ప పూర్తిగా తనను గుర్తుచేసుకోకుండా ఒక గంట కూడా వుండలేకపోతున్నాను. నేను అనుకున్న గమ్యానికి చేరువలో వున్నానని నన్ను రిసీవ్ చేసుకున్న అన్నయ్య మాటల్లో అర్థమయ్యింది. ఇంతలో మా జీప్ ఒక ఊరి దగ్గర ఆగింది. చూసేసరికి అటు పూరి గుడిసే కాదూ, పెంకుటిల్లూ కాదు. ఏదో డిఫరెంట్ గా వుందే అని అనుకుంటూ చూస్తుంటే నల్లగా పొడుగ్గా వున్న ఒక అతను " కామ్రేడ్ నీ కిట్టు
వ్యాసాలు

ఆదివాసులను పరిహసించే  ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’  

బిర్సా ముండా ఊరు ఉలిహతు (ఖుంటి) నుంచి ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 నవంబర్ 15న ప్రారంభించారు.  ఇది ప్రభుత్వ విజయాల ప్రచారం కోసం అని చెబుతున్నారు కానీ వాస్తవానికి ఇది 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ యాత్ర. కార్యక్రమానికి బీజేపీ రంగు పులిమేందుకు ప్రభుత్వ అధికారులకు రథ బాధ్యులు అని పెట్టిన పేరును, ప్రజల నిరసనతో నోడల్ అధికారిగా మార్చారు. మోడీ ప్రతిష్టను మెరిపించడానికి చేస్తున్న ఈ యాత్ర డబ్బు వృధా తప్ప మరొకటి కాదని, ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకంగా ఉందని జార్ఖండ్‌లోని అనేక ప్రజా సంస్థలు, సామాజిక
వ్యాసాలు

తిజిమాలి మా ఆత్మ

“మేము తిజ్‌రాజా పిల్లలం, మా తిజిమాలిని తవ్వడానికి ఎలా అనుమతిస్తాం? తిజిమాలి మా ఆత్మ, ఆత్మ లేకుండా ఎలా జీవించగలం? వాగులను మాత్రమే కాదు మా గుర్తింపును కూడా నాశనం చేసే గనుల తవ్వకానికి ఎలా అనుమతినిస్తాం? మేము మా మాలి కొండ కోసం, మా అడవుల కోసం, అన్ని విధాలుగా పోరాడుతామే కానీ మా ఆత్మను వేదాంత కంపెనీ తవ్వడాన్ని ఒప్పుకోం.” అక్టోబర్ 16న ఒడిశాలోని రాయగడ, సుంగర్ పంచాయతీ, కాశీపూర్ బ్లాక్‌లో జరిగే బహిరంగ విచారణకు ముందు రోజు రాత్రి తిజిమాలి పర్వత ప్రాంతంలోని బంతేజీ గ్రామానికి చెందిన మహిళలు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించాలని ఏకగ్రీవంగా
వ్యాసాలు

పాలస్తీనా గర్జన ప్రతిధ్వనించాలి

అక్టోబర్ 7వ తేదీన ఆక్రమిత పాలస్తీనాలోని గాజాలో ఒక ప్రతిఘటనా వెల్లువ ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఫాసిజాన్ని  ఆసరా చేసుకుని ప్రజలకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాదం ముందుకు వస్తున్న సమయంలో, దానిక వ్యతిరేకంగా పోరాడాలన్న ఆలోచన వచ్చింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్యలో దాన్ని గత ఏడాది సామ్రాజ్యవాద అంతర్గత సంఘర్షణ తీవ్రతరం చేసింది. ఈ మధ్యలో సామ్రాజ్యవాదుల మధ్య సంక్షోభం సాగుతున్న సమయంలో ఇజ్రాయిల్ లో జియోనిస్టుల ఆక్రమణకు వ్యతిరేకంగా వారి అస్తిత్వానికి వీర పాలస్తీనా ప్రజలు అగ్గిరాజేశారు. హమాస్ (ఇస్లామిక్ ప్రతిఘటనా ఉద్యమం ), పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా, డెమోక్రటిక్
వ్యాసాలు

ఇరవై ఐదేళ్ల విప్లవాచరణ

( నవంబర్ 24 న కృష్ణా జిల్లా కోడూరు మండలం నారేవారి పాలెంలో జరిగిన కామ్రేడ్  గౌతమ్ సంస్మరణ సభలో  ఆవిష్కరించిన *సమాజ శిల్పి* పుస్తకానికి రాసిన ముందు మాట) కామ్రేడ్ గౌతమ్ ను 2006 నవంబర్ 23న పోలీసులు దొంగ ఎదురు కాల్పుల్లో హత్యచేశారు. 24న తెల్లారికల్లా పత్రికల్లో ఈ విషాద వార్త వచ్చింది. మేము కొద్దిమందిమి రాత్రికి బయల్దేరాలి అనుకున్నాము. అప్పటికే గౌతం కుటుంబ సభ్యులు విజయవాడలో పౌరహక్కుల సంఘం నాయకులను కలిశారు. మృత దేహాన్ని స్వాధీనం చేసుకోడానికి గౌతమ్ కుటుంబ సభ్యులతోపాటు మీరెవరైనా వెళతారా? అని లాయర్ ఆంజనేయులుగారు అడిగారు. మేము రావడానికి లేటు
ఆర్థికం

ఆందోళనకరంగా ఆర్థిక వ్యవస్థ

ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌(ఎఫ్‌ఇ) నివేదిక ప్రకారం దేశంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమౌతోంది. రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం, రూపాయి విలువ జీవనకాల కనిష్టానికి క్షీణత, విదేశీ మారక నిల్వలు కరిగిపోతున్నాయి, స్టాక్‌ మార్కెట్ల నష్టాల్లోకి జారుకుంటున్నాయి. గ్యాస్‌, డిజిల్‌, పెట్రోల్‌ రేట్లు ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్నాయి. నిరుద్యోగం పెరిగిపోతోంది, ఆహార పదార్థాల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. భారత జనాభాలో యువత 50 శాతం వరకు ఉంది. వారి నైపుణ్యానికి తగిన ఉపాధి లేకపోవడంతో ఉత్పాదక శక్తి పుంజుకోవడం లేదని, పర్యవసానంగా  పారిశ్రామిక వృద్ధి కుంటుపడుతుందని, ఇందుకు పాలకుల అనుచిత విధానాలే కారణమని ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ స్పష్టం చేసింది. గత సంవత్సర
సమీక్షలు

లోపలి, బైటి ఘర్షణల్లో ‘శికారి’

‘శికారి’నవలలోని కథ జీవితానికి సంబంధించిన ఒక ప్రవాహం. ఆ ప్రవాహం కెసి కెనాల్‌ అనే జల ప్రవాహం ఒడ్డున పెనవేసుకున్న  శికారీల జీవితం.  ఈ జీవన ప్రవాహం ఒక భార్యాభర్తల గొడవతో మొదలౌతుంది..అక్కడ నుండి  శికారిల లోపలి, బైటి వైరుధ్యాల మీదుగా  అలా కొనసాగుతుంది.  చివరికి ఒక ఉత్సవంతో ముగుస్తుంది. ఈ ఆశ నిరాశల జీవన గమ్యం-గమనం ఏమిటి? నిత్యం మారే రాజకీయార్థిక పరిస్థితులు జీవితాన్ని స్థిమితంగా ఒక చోట ఉండనిస్తాయా?  ఆ కదలిక ఈ కథలో ఉంది. చుట్టూ మారుతున్న రాజకీయార్థిక పరిస్థితులు శికారీలను కూడా ప్రభావితం చేస్తాయి. కథనంలో శికారీ పాత్రలు వస్తూ ఉంటాయి. జీవన