కవిత్వం

నాకిప్ప‌డు  న‌ది కావాలి

నాకిప్పుడు కావల్సింది సూర్యునితో పాటు తిరిగి చీకటికి తలవంచిన పొద్దుతిరుగుళ్లు కాదు చీకటిలోను తలవంచని ఎర్ర మందారాలు కావాలి వాటి పరిమళాలు కావాలి నాకిప్పుడు కావల్సింది కొద్ది జల్లులకే నిండి కొద్ది ఎండకే ఎండిన కుంటలు కాదు కుచించుకుపోని యాంగ్సీ లాంటి నదులు కావాలి దాని ఘర్జనలు కావాలి నాకిప్పుడు కావల్సింది వసంతంలో మాత్రమే ఎగిరే బురక పిట్టలు కాదు ఏ కాలంలో నైనా పైకెగిరే ఫినిక్స్‌ పక్షులు కావాలి వాటి వేగం కావాలి నాకిప్పుడు కావల్సింది బిగించిన పిడికిళ్లు వాలిపోయిన చేతులు కాదు బందూకు చివరి వరకు దించని భుజాలు కావాలి వాళ్ల ధైర్యం కావాలి
సాహిత్యం కవిత్వం

అమరుని స్వప్నం

ఎంతటి నిషి ఈ వసంతాన్ని ఆవరించిననూ ఎంతటి కుంభవృష్టి ఈ వాసంతాన్ని ముంచిననూ ఎంతటి అనావృష్టి ఈ వసంతాన్ని వంచించిననూ వారు చుక్కలవలే వెలిగి జ్ఞానాన్ని వెలువర్చారు సూర్యునివలే గర్జించి శక్తిని చేకూర్చారు చినుకువలే స్పందించి వసంతానికి ఉపిరిపోసారు వారు ఉల్కాపాతం వలే ఊపిరినొదిలి ఈ పాలపుంతలో వారి జ్ఞాపకాలను ఆశయాలను వదిలిపోయారు అయితే మేమే శృష్టికర్తలమను గర్వంతో విర్రవీగే వాళ్ళకు వారి అమరత్వం తలచుకున్నా వెన్నులో వనుకే అందుకే స్థూపాన్ని ఆపాలనుకుంటారు సభలని అడ్డుకుంటారు పుస్తకాన్ని నిషేదిస్తారు
సాహిత్యం కవిత్వం

*రెవల్యూషనరీ స్ప్రింగ్*

ఏవో ఏవేవోమరుపురానిగురుతులతోకరచాలనం చేసేసనివేశాలుసందేశాలు,పూర్తిగాఆయుధంతోసాయుధమైనఓ స్వాప్నికుడిఓ ప్రేమికుడిఆలోచనతోఆశయంతోరక్తం చిందించేఆ పాదాల నడకలుఈ దేశానికిదేహాన్ని అర్పించేఆజాదిని అందించేసాహసాలుఅహామీరు ఏంతటి ప్రేమికులుఅచంగా మా భగత్ లామీరు ఎంతటి సాహసీయులు
కవిత్వం

నా తుపాకీకి మనసుంది

ఏమిటో..అంతా విచిత్రంగా ఉంది కదూ ఎక్కడో నిశీధి చీకట్లను అలుముకొనికూర్చున్న నేనుఈ వసంతానికో వాన చినుకు నయ్యానంటేనీకు నమ్మాలని లేదు కదూ అయినా నాకు తెలుసు..నీకు ప్రశ్నంటే నచ్చదని అసత్యాన్ని ఆలింగనం చేసుకున్నఅన్యాయానికి అత్మీయుడవు నీవుఅహంకారపు అధిపతివి నీవు మరి నీకు నిజాలు చెప్పేవారంటేనిజాన్నిపాడేవారంటేనిజం కోసం పోరేవారంటేనీకు ఎలా గిట్టుతుంది మది నిండా మతాన్నిమతి నిండా పెట్టుబడిని పెట్టుకున్నప్రేతాత్మవి నీవు నీకు స్వేచ్ఛ కోసం వేసే అడుగులంటే భయంనీ భయమే నా ఆయుధంఅదే నా తుపాకీనా తుపాకీకి మనసుందిప్రపంచ ప్రేమకు నా తుపాకే చిహ్నం.
సాహిత్యం కవిత్వం

ప్రేమికుల

ఇసక తిన్నెల మీదఇనుపబూట్ల మహమ్మారినితరిమి కొట్టినిండు ఎడారిలోనీటిని నింపినప్రేమ మనదిగాలికి తాడు కట్టిగండ్ర గొడ్డలి తెచ్చివిష వాయువును నరికిగరికపూల వనంలోనిద్రించిన ధీరత్వం మనదిఅలసిన అడవిని లేపిపాటల పరవళ్ళు తెచ్చిదండోరా మ్రోగించిననేర్పు మనదిడియర్ఈ సుందరమధురానుభూతులుచరిత్ర తొలిపొద్దులోమహోత్తర విప్లవ జ్వాలలైఎగిసిపడుతాయి.
సాహిత్యం కవిత్వం

ప్రతిధ్వని

నేను ఉరిమితేనీ సింహాసనం కదిలిందినేను వర్షిస్తేవసంతం పులకించిందినాలుగు గోడల బందీఖాననా ఆలోచల్ని ఆపలేదుఅవి ప్రాణ వాయువులాప్రజల ఉచ్వాస నిశ్వాసలనుతడుముతూనే ఉంటాయినేను నిర్జీవంగాఇచ్చట వాలిపోలేదునా నినాదాలుప్రపంచ వ్యాపితంగాప్రతి ద్వనిస్తూనే ఉంటాయినేను స్వేచ్ఛా మానవినిఏ చెరసాలకు లొంగే దాన్ని కాదు
కవిత్వం

మన ప్రేమ అజరామరం

నీవు నాకునేను నీకుఎన్నటికీ దూరం కాదు నీ ప్రతిఉచ్ఛ్వాస నిశ్వాస‌లోమాత్రమే కాదు నీ కన్నీటిచుక్కల్లోనే కాదు నీ ఆనందక్షణాల్లోనే కాదు నీ అంతర్మథ‌నంలోనే కాదు నీవు నేనుగానేను నీవుగాతొలి చూపులోనేతొలి స్పర్శలోనేఏకమై ఉన్నాము ఏ నిర్భంధ‌మూమనలను విడదీయలేదు మనంమృత్యుంజయులంమన ప్రేమాఅజరామరం.
కవిత్వం

మీ యుద్ధం ఎవరి కోసం…?

ఎవరి కోసంమీ త్యాగంఎవరి పైమీ పోరాటం నరహంతకుడు రాజైరాజముద్రీకుడైప్రజా….ప్రాణాన్నిమానాన్నితీస్తుంటే ఎవరి పై మీ పోరాటం ఫాసిజంప్రజలను చీల్చే యుద్ధంగా మారి తడిగుడ్డతోగొంతులు కోస్తుంటే ఎవరి కోసం మీ త్యాగం మాయన్నలారవీర జవానులారఎవరి పై మీ పోరాటం చచ్చినా శవాన్ని లేపిజ్ఞాన మార్గపుదారులేసికటిక చీకట్లనెల్లాకాలరాసినవీరులపైనా ఎవరి కోసంమీ పోరాటంఎవరి కొసంమీ త్యాగం పచ్చినెత్తూరుమరిగినట్టిపడగవిప్పీనిలిచినట్టీఆధునికనీరో చక్రవర్తినైజాం చక్రవర్తుల పైన అన్నలారవీర జవానులారవాని పైన చేయియుద్ధంఅదే ప్రజా యుద్ధం
సాహిత్యం కవిత్వం

ఏది ప్రజాస్వామ్యం

శవాలపైన భవంతులు కట్టిబంగారు పళ్ళెంలోపంచభక్ష్య పరమాన్నాలు తినేదొరలుగల్ల దేశంలోఏది ప్రజాస్వామ్యం రెడ్ కార్పెట్ వేసికుక్కల్ని పిలిచితల్లి దేహాన్నిముక్కలుగ నరికివిందునేర్పరిచేగుంట నక్కలున్నఈ రామ రాజ్యంలోఏది ప్రజాస్వామ్యం సైన్సును సాగిలబడేసినాన్ సైన్స్నునాన్సెన్స్లచేతుల బెట్టిననపుంసకులెలేఈ దేశంలోఏది ప్రజాస్వామ్యం ప్రశ్నించేప్రజాస్వామ్యంఅని చెప్పిఉపా చట్టాలు బెట్టిఅండా సెల్లులోజీవితాలనుఅంధకారంచేస్తున్న ఈ దేశంలోఏది ప్రజాస్వామ్యం మూడత్వంమురుగు నీటిలోదైవత్వందయా దక్షిన్యాలతోఉపొంగుతూ ప్రవహిస్తున్నశవాల కాల్వలున్నఈ దేశంలోఏది ప్రజాస్వామ్యం
సాహిత్యం కవిత్వం

వసంతం

చిన్నబోయినా కనుల కన్నీటిని తుడిసిన వేళ నిండు పున్నమి నదిపై పరుసుకున్న వేళ ఎర్రని మేఘంపైఎగిరే పక్షిని నేనై రాగం పాడే వేళ రంగస్థలములో నేను ప్రేమ రంగులద్దిన వేళ రానే వచ్చింది వసంతం ప్రేమను పేర్చింది వసంతం రానే వచ్చింది వసంతం స్వేచ్ఛను తెచ్చింది వసంతం