ఎవరి కోసం
మీ త్యాగం
ఎవరి పై
మీ పోరాటం

నరహంతకుడు రాజై
రాజముద్రీకుడై
ప్రజా….
ప్రాణాన్ని
మానాన్ని
తీస్తుంటే

ఎవరి పై మీ పోరాటం

ఫాసిజం
ప్రజలను చీల్చే యుద్ధంగా మారి
తడిగుడ్డతో
గొంతులు కోస్తుంటే

ఎవరి కోసం మీ త్యాగం

మాయన్నలార
వీర జవానులార
ఎవరి పై మీ పోరాటం

చచ్చినా శవాన్ని లేపి
జ్ఞాన మార్గపు
దారులేసి
కటిక చీకట్లనెల్లా
కాలరాసిన
వీరులపైనా

ఎవరి కోసం
మీ పోరాటం
ఎవరి కొసం
మీ త్యాగం

పచ్చినెత్తూరు
మరిగినట్టి
పడగవిప్పీ
నిలిచినట్టీ
ఆధునిక
నీరో చక్రవర్తి
నైజాం చక్రవర్తుల పైన

అన్నలార
వీర జవానులార
వాని పైన చేయి
యుద్ధం
అదే ప్రజా యుద్ధం

Leave a Reply