కవిత్వం

మహమూద్ కవితలు రెండు

స్వప్న స్పర్శ ------------ భూగ్రహం మీద ఉల్కల వంటి వారు మట్టితో కలిసి చిగుళ్ళకు ప్రాణం పోసే ఉల్కలు అరణ్యంలో పిట్టలకు కాంతిని ఆయుధంగా ఇస్తారు అవి అడవిని కాపలా కాస్తుంటాయి తమ నీడలని రాత్రింబవళ్ళకి రెక్కలు గా తొడిగి 1. సముద్రపుటలల మీంచి జారే సూర్యరశ్మి లాంటి పారదర్శక జీవితాలవి తమతో తాము పోరాడుతూనే చుట్టూ పరిసరాల్తో తీరని సంఘర్షణలో మునిగి ఉంటాయి గాయమయమౌతూనో, గానమయమౌతూనో, 2. లేత కాంతికి బట్టలుగా తొడిగినట్టు నిండైన దృష్టి ఆదివాసి ఊదే బూరలాంటి స్పష్టాతిషైపష్టమైన కంఠస్వరం ఖంగున మ్రోగే మాట వినగానే మెదడులో రూపం ప్రసారమయేంత తాజా ఉద్యమ ప్రతిబింబాలు
కొత్త పుస్తకం

జీవితానుభవాన్ని ఎర్రజెండాలా ఎగరేసిన కవిత్వం

రాజకీయ కవితలు రాయడం చాలా కష్టం. అందులోనూ కమ్యూనిజం లేదా ఇప్పుడు పాలకులు పదేపదే  ఉఛ్ఛరిస్తున్న అర్బన్ నక్సల్ అవగాహనతో కవిత్వం రాయడం ఇంకా కష్టం. ఇలాంటి కవిత్వం లో రెండు అంశాలు ప్రధానంగా కనబడతాయి. నేరుగా ప్రజాపోరాటాలతో, జనజీవితంతో సంబంధం ఉండడమూ, వాటి రూప సారాలను మార్క్సిజం ఆధారంగా అర్థం చేసుకునే చారిత్రక అవగాహన కలిగి ఉండడమూ. నేను చూసిన, పరిచయమున్న ఇలాంటి పెద్దలలో అరుణ్ సార్ ఒకరు.            తాను నమ్మిన విప్లవ పంధా నుంచి, ఈ సుదీర్ఘ జీవన ప్రయాణంలో ఇసుమంత కూడా పక్కకు ఒరగని నేపధ్యం నుంచి ఎలాంటి కవిత్వం ఆశించగలమో అలాంటి
సమీక్షలు

ఎవరికీ పట్టని మరో ప్రపంచపు కథలు

కథలకు సంబంధించి వస్తువు ఎంపికే ప్రధానమైనది. దానిని అనుసరించేవే మిగతా లక్షణాలు. నేరుగా జన జీవనంతో మమేకమైపోయి, వాళ్ళ బతుకు సాధకబాధలే ఇతివృత్తాలు గా, ఆయా సమూహాలను చరిత్రలో భాగం చేసే రచయితలు చాలా చాలా అరుదు. వాళ్ళ ఆరాటపోరాటాల్ని చాలా దగ్గరగా చూసినప్పుడు, పరిశీలించినప్పుడు కలిగే అనుభూతి చాలా భిన్నమైన మార్గంలో కథకుడ్ని నడిపిస్తుంది. చాలా సున్నితమైన అంశాల్ని, ఇతరుల కన్నుకు కనబడని జీవితం తాలూకు ఘర్షణని చూసేలా చేస్తుంది.‌ ఖచ్చితంగా పాఠకుడికి ఆ సంఘటనలకు కారణమయ్యే శక్తుల మీద ఆగ్రహం కలుగుతుంది. జీవన విధ్వంసం దృశ్యాన్ని కథగా మలిచేటప్పుడు కథలో ఇలా ఎందుకు జరిగింది?జరగకూడదే?అనే మీమాంస
కవిత్వం సాహిత్యం

నాలుగు పిట్టలు ( మినీ కవితలు)

కాలపు చరకలో కొంత గతాన్నివొదులుకున్నానుబంగారుభవిష్యత్తీగను వొడికిఇస్తుందని వేచి చూస్తున్నాను****చెరువును అంగీలాతొడిగిన నేలచేపల్నినగిషీలు చేసుకుంది***వెన్నెల అద్దంలోతన మోము చూసుకొనిచెరువుమురుసిపోతోంది***ఎండ మగ్గం తోమబ్బుల బట్టను అల్లుకొనికప్పుకుందినింగి***ఈ మౌన రాత్రిలోకొంత శబ్దాన్ని కోరుకున్నానువెన్నెల కొలనునుముద్దాడింది***చేపలకు కొలను చెబుతున్నకథలనుతారకలు కూడాఊ కొడుతూ వింటున్నాయి***కొలనును కాగితం చేసుకొనికవిత్వం రాస్తున్నాడుచందమామచేప పిల్లలు అక్షరాలు***సూఫీ పాడిన పాటనువినిఅలల చప్పట్లతోఆదరించింది చెరువు***16.11.22
సాహిత్యం కవిత్వం

భానుడి చూపు

ఎవరు రాసారీ పద్యాన్ని,ఉద్యమంలాంటి ఉదయాన్ని?!వెలుతురు లాంటి నినాదాన్ని?!చీకటికి తెర దించి కాంతికి పట్టం కట్టినపదాల కెరటాల కవన సముద్రాన్ని!? ఎవరు రాసారీ పద్యాన్నిదువాల ఒడిలోంచి నిదుర లేచినజాబిల్లి తోబుట్టువుని!?తిమిరం కుబుసాన్ని విడిచితళతళాడుతూ తెల్లారిన కాలాన్ని!? ఎవరు రాస్తారు వెన్నెల సిరా నిండినగాలి కలంతోకొండలపై నుంచి జారే నిశ్శబ్దపు జలపాతాలని?! అరణ్యంలో తాండాలోతంగెడు పూల పురుడు వాసననిపీల్చుకుని మత్తగిల్లే మధువుకు ప్రియమైన భ్రమరాలనీ!? ఎవరు రాస్తారు పద్యాలనీప్రాణ త్యాగానికి సిధ్ధపడితుపాకీ భుజాన వేలాడదీసుకొనిఅరణ్యం మీంచి లోకం మీదికివిప్లవం ప్రసరిస్తున్న భానుడి చూపుని!?
కవిత్వం

నాలుగు పిట్టలు

నాలో తప్పిపోయిననీవు నీకు ఇంక ఎప్పటికీ దొరకవు!ప్రేమ భావన,గొప్ప ఆకర్షణ!!* * *నాకే తెలియదు నాలో ఇంతలోతు ఉందని!నా లోంచి నువ్వు ఎప్పుడుబయటపడదామనీ!?* * *నీ నవ్వుఓ పరిమళపు లోయ!అందులో దిగాను కాబట్టేనేను పూవునైపోయా!!* * * *ఎవరు పారబోసుకున్నమోహ స్వప్నమో, కదా ఈ రాత్రి!నింగి ఊయలలో,చీకటి-వెన్నెల రెండూ పెనవేసుకున్నాయి!***ఈ కాలానిదెంత నిర్దయ!కాకలుతీరిన యోధులను,ఆకలి తీరని దీనులను,ఎదురెదురు నిలబెడుతోంది!!***ఇక్కడ కొంతస్వేచ్ఛని వొదిలి,ఆ పక్షి రెక్కలు విచ్చుకునేచనిపోయింది!***ఈ కష్టకాలం సుదీర్ఘమైనదనీ,అనుకుంటాం కానీచరిత్ర పుటల్లోకి ఇంకిపోయినమానవ సంఘర్షణతో పోల్చుకుంటే క్షణభంగురం!!****యుధ్ధం ముగించాలనివాడికి లేదు!కానీ వాడికి తెలియదుఏదో ఒక నాడు వాడూ దిగిపోక తప్పదు!!***యుధ్ధం ముగిసాక,శిధిలాల్లో వాళ్ళు శవాలకోసంవెతుకుతున్నారు!కానీ,దొరికింది ముక్కలైన పసివాళ్ళ స్వప్నాలు!***యుధ్ధం
కవిత్వం

పెను చీకటి – ప్రచండ కాంతి

తొలిచూరుతల్లి పొత్తిళ్ళలోబిడ్డలా ఉంది వెన్నెల బిడ్డ కోసం తల్లి వేసేఊయలలా ఉంది పాలపుంత బడి విడిచాకకేరింతలు కొడుతూబయటికొచ్చే పిల్లల్లా ఉన్నాయిచుక్కలు బుజ్జాయినిబజ్జోబెట్టటానికితల్లి పాడే జోల పాటలాఉంది మంద్ర గాలి హాయి అంతా ఇక్కడే ఉంది అన్నట్టుఅమ్మ ఒడిలో నిదురబోయినచంటి బిడ్డ మోములా ఉందినింగి పురిటి నొప్పుల బాధనుదిగమింగుతూగట్టిగా కళ్ళు మూసుకుని ఊపిరి బిగబట్టినగర్భిణిలా ఉంది రేయి ప్రచండ కాంతి తో పుట్టేసూర్యుడు ని ప్రపంచానికి హామిపడుతున్నట్టుందిపెను చీకటి...
కవిత్వం

కవితా పరాగం

తేనె ఫలం1.ఆ మెత్తటి ఇసుకతిన్నెల్లోపడ్డ నీ పాద ముద్ర లోఒలికిన నా చూపు లోసగం చీకటిసగం వెలుతురు ఇప్పుడు..2.ఎంత తీరైన నడకఇసుక పై రంగవల్లి అల్లినట్టుఏ తోట్రుపాటు లేదురంగు జాతీయత పట్టింపు లేనిఆలింగనపు మహత్తుపాదాన్ని నేల ముద్దాడుతుందిమాటని పెదవి విహంగం చేస్తుందిభాష కు భవబంధాలు తెలియవుపరిస్థితులతో సంబంధం లేని పయనం నీదిమన్ను దేహంగా పొందిన నదిలాంటిది నీ ప్రయాణంఎడారి స్థితికి వాన మీదావానకి ఎడారి మీదా మమకారం పెంచిఒకే రకమైన ప్రేమ ను పంచిప్రేమ తెలియని ప్రాంతాల్లోనీ కనుచూపును చిలకరించినవ్వుల్ని మొలిపించేసేద్యం నీ పధంవెలుతరూ చీకటి విత్తులుగా నాటిమానవత్వపు పంట పండించడంనీ వృత్తి3.ఎడారి తిన్నెల మీంచి మట్టి వేణువు
కాలమ్స్ కవి నడిచిన దారి

నా కవిత్వం ఒక నినాదం

నా కవితా ప్రస్థానం వలసలో మొదలైంది. అప్పటి వరకూ అంటే 1993 నాటకి నా ఇరవై మూడేళ్ళ జీవితంలో సీరియస్ సాహిత్యం తో పరిచయం తక్కువ. కొంత శ్రీశ్రీ, కొంత తిలక్, కొంత ఠాగూర్ గీతాంజలి తప్ప కవిత్వం అంటే సినిమా సాహిత్యం గా పరిగణించేవాణ్ణి. మా తెలుగు మాస్టార్లు పలికించిన పద్యాల ప్రతిపదార్థాలు కూడా బట్టీయం వేసినవే కానీ సిరీయస్ గా చదివినవి కావు. కాకపోతే హిందీ పాటలు ( చాలామందికి తెలియదు కానీ అందులో ఉర్దూ భాషే ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ముస్లీం ఉర్దూ కవుల ప్రభావం) వినేవారికి ఎంతో కొంత కవిత్వం లోపలికి
సాహిత్యం కవిత్వం

నా తలపుల తలుపులు తెరిచీ..

నా జ్ఞాపకాలునీ రెక్కలునీ రెక్కలునా జ్ఞాపకాలు ఎగరు సీతాకోకనింగి అందేదాకా ఎంత సున్నితంగాతాకుతాయో కదా నీ రెక్కలుగాలిని నీ రెక్కల కుంచెతోగాలి కాన్వాస్ మీదఎన్ని వర్ణచిత్రాలు వర్షిస్తావో కదా రుతువుల మోములన్నీమోహపు వీణలౌతాయి కవితలేవో నేను అల్లడానికికుట్ర పన్నుతాయి నీ రెక్కలు కదిలినప్పుడంతానాలో స్ళేఛ్ఛా కాంక్ష పురి విప్పిన నెమలి అవుతుందిఅరణ్యం పై పరుచుకునే కెంజాయరంగౌతుంది అపుడునా ఏకాంతాన్నీ,నా భావాలనూనీ భుజాలు నొప్పెట్టెలా  మోస్తావు నా ఊహల స్పర్శతోనీ రెక్కలు పులికిస్తాయోనీ రెక్కల స్పర్ళతో నా ఊహలు అలలై కదులుతాయో తెలియదు కానీ నీ రెక్కలు కదిలేప్పుడంతానేనూ కదులుతానునా గుండెకొక లయ ఉన్నట్టనిపిస్తూనాకు నేను కొత్త కావ్యాన్నై పరిచయమౌతాను