కాలమ్స్ కవి నడిచిన దారి

నిర్వాసిత వాక్యం

"కొన్నిదారులకు అడుగుల గుర్తులని దాచే అలవాటుండదు, కొన్ని అడుగులకు దారులతో అవసరం ఉండదు."  ఈ మాటని ఎప్పుడు, ఎక్కడ విన్నానో, చదివానో కూడా గుర్తు లేదు, మర్చి పోయాను. ఇప్పుడు నేను నడిచి వచ్చిన బాట కూడా అలాంటిదే. నా పుట్టుక జరిగింది అన్నదానికి, ఒక నేను మిగిలి ఉండటం తప్ప, నేను నడిచిన భూమి, పెరిగిన ఇల్లు, చదువుకున్న బడి... ఏదీ లేదు. మా ఊరు ఇప్పుడు లేదు. ఓపెన్ కాస్ట్ మింగేసింది. ఊరు ఉండాల్సిన ప్రదేశం ఓ పెద్ద మానవ నిర్మిత లోయగా మారిపోయింది.. అభివృద్ధి  అనేది ఎంత గొప్ప పదమో అంత విషాదకరమైన మాట