సాహిత్యం కాలమ్స్ కథావరణం

అంట‌రాని వ్య‌థ‌ల మ‌ల్లెమొగ్గ‌ల గొడుగు

కథలను రాయడం వెనకాల సామాజిక ప్రయోజనంతో బాటూ , గుండెలోపలి దుఃఖాన్ని అర్థం చేసుకొని, అవమానాల్ని దాని వెనకాల ఉన్న కారణాల్ని అర్థం చేసుకుని, అసమానత్వాన్ని ఎదుర్కొని, బానిసత్వం నుంచి విముక్తి పొందడానికి , ఒక సామూహిక పోరాట శక్తిని సమీకృతం చేసుకోవడానికి ఉద్యమ నేపథ్యంలో చాలా కథలు వచ్చాయి. ఉద్యమ నేపథ్యంలో వచ్చిన కథలన్నీ శక్తివంతమైన కథలని చెప్పలేము కానీ, ఆయా ఉద్యమాల కాలంలో  కథలు కవిత్వం నవలలు తదితర ప్రక్రియల్లో శక్తివంతమైన రచనలు వెలువడ్డాయి.వాస్తవాలను కేంద్రీకృతం చేసుకున్న రచనలు , మానవ జీవితాల్లోని వెలుగు చీకట్లను యధాతధంగా చిత్రిoచిన  రచనలకు విలువ ఎప్పుడూ ఎక్కువే.  మల్లెమొగ్గల
కాలమ్స్ కథావరణం

బతక నేర్చిన ప్రపంచాన్ని చూపించిన జూకంటి జగన్నాథం కథ – ఎరుక

లోకం తీరు ఎలా ఉంది? లోకంలో మెజారిటీ మనుషుల తీరు ఎలా ఉంది, రాజ్యం, మీడియా తీరు ఎలా ఉంది? సహజత్వంతో ఉన్నది ఎవరు లేనిది ఎవరు? ఎందుకు? అసమ సమాజంలో తీవ్రమైన అసహనం, సంక్షోభం ఏర్పడటానికి కారణం  ఏమిటి ? పరిష్కారం ఏమిటి?రాజీపడటం గాయపడటమేనా? విలోమంగా ఉన్నది మనుషులా ? రాజ్యమా? ఉన్నట్టుండి  సరిగ్గా కనిపించకపోవడం, వినిపించకపోవడం, రుచిని వాసనను కోల్పోవడం, స్పర్శను కోల్పోవడానికి కారణం ఏమిటి?సామాజిక స్పృహ చైతన్యం ఆలోచించే శక్తి వివేచన లేని వాళ్ళకి పంచేంద్రియాలు పనిచేస్తాయా? ఎరుక లేని వాళ్ళకి ఎలా ఎరుక కలుగుతుంది? ఒక సమాజంలోని సహజమైన అసహజ స్థితిని, తీవ్ర సంక్షోభాన్ని అసంబద్ధతని,
కాలమ్స్ కథావరణం

ఇంకేమీ లేదు, జీవితమే.. నామిని కథ “అకా, కేక కా!”

భర్త చనిపోయిన దశలో పూర్తిగా నిరాశామయ  వాతావరణంలో నుంచి బయటపడి , నూతనోత్సాహంతో జీవితాన్ని పునః ప్రారంభించిన ఒక సాధారణ మనిషిలోని చైతన్యమే ఈ కథ. ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక  2015 సెప్టెంబర్ సంచికలో ఈ కథ ప్రచురితమైంది. ఊర్లో అతడి పేరు చిలకాయన. తిరుపతిలో పేరు మునీంద్ర. ఊర్లో వాళ్లతో అతడికి ఎలాంటి అనుబంధం ఉన్నట్లు కనిపించదు. ఇస్త్రీనలగని తెల్ల బట్టలతో నిద్ర లేచి లేవంగానే తయారై తిరుపతి టౌన్ క్లబ్  కి వెళ్ళి పోతాడు. ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు ఒంటి మీద గుడ్డలు నలగకుండా చేతిలో ఒక ప్లాస్టిక్ కవర్ తో తిరిగి ఊర్లోకి వస్తాడు. మడత
సాహిత్యం కాలమ్స్ కథావరణం

దేవుడా ? మనిషా? ఓ మనిషీ.. నువ్వు ఎటు వైపు?

మనుషుల  కష్టాలను, సమస్యలను, దుఃఖాలను తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? ఈ అసమ సమాజంలో  వివిధ సామాజిక ఆర్థిక స్థితిగతుల మధ్య పూడ్చలేని అగాధాలను, అంతరాలను సృష్టించింది ఎవరు? ఈ హద్దులు అంతరాలు అగాధాలను అధిగమించడానికి ఎవరు  ఏం చేయాలి? శ్రామిక వర్గాల శ్రమను నిరంతరం  నామమాత్రపు వేతనాలతో  నిలువు దోపిడి చేస్తున్న  బూర్జువా పెట్టుబడిదారి ఉన్నత తరగతుల వర్గాలు ఆ శ్రామిక వర్గాల కోసం, కనీసం కృతజ్ఞత చూపించకపోవడాన్ని, ప్రాణాపాయ పరిస్థితులలో సైతం ఎంత మాత్రము డబ్బు సహాయం చేయడానికి ముందుకు రాని వైనాన్ని , మనుషుల కోసం ఏమీ చేయలేని మనుషులు దేవుడి కోసం మాత్రం దేవుడి
కాలమ్స్ కథావరణం

“సాహిత్య సమాజ సంబంధాల విశ్లేషణ కె.వి కూర్మనాథ్ కథలు”

జీవితాలు ఉద్యమాలే కాదు మరణాలు కూడా మనకు చాలా పాఠాలు చెబుతాయి. జీవితం కన్నా  మరణం చాలా గొప్పది. విప్లవకారుడి, ఉద్యమకారుడి మరణం ఒక చరిత్ర.  అంతులేని గాయాలు అంతు తెలియని సత్యాలు, ఎన్నో అనుభవాలు వైఫల్యాలు పోరాటాలు విజయాలు వ్యధలు దుఃఖాలు ఇవన్నీ కలగలిసిన చరిత్ర ఒక వీరుడి మరణం. ఒకానొక చారిత్రక సందర్భంలో ఇక్కడ నిలబడి వెనుదిరిగి చూసుకుంటే, ఉద్యమం వెనుక కారణాలు, ఉద్యమం బలపడిన సందర్భాలు, ఉద్యమం బలహీన పడిన సందర్భాలు, ఆటుపోట్లు వెన్నుపోట్లు ఆంక్షలు నిర్బంధాలు అణచివేతలు, వ్యక్తులు అదృశ్యం కావడం, మనుషులు శవాలుగా మారటం, శవాలు కూడా కనిపించకుండా పోవడం.. అనేక
కాలమ్స్ కథావరణం

*అభివృద్ధి*ని ప్రశ్నిస్తున్న క‌థ

సీనియర్ కథా రచయిత్రి ముదిగంటి సుజాతా రెడ్డి 2018 లో ప్రచురించిన "నిత్యకల్లోలం" కథాసంపుటి లోని , ఈ కథను చదివితే నిజానికి అభివృద్ధి అంటే ఏమిటి ? అది ఎవరి కోసం? అభివృద్ధి ఫలితాలు ఏమిటి? అవి ఎవరి కోసం ?నిత్యం సమాజంలో జరుగుతున్న సంఘటనలు వార్తా కథనాలై, ప్రత్యక్ష ప్రసారాలై, మనసులో ఎలాంటి ఆలోచనలు కలిగిస్తున్నాయి ? మనిషి వాటికి ఎలా స్పందిస్తున్నాడు  అనే ప్రశ్నలు మనల్ని వెంటాడతాయి.నిద్రపుచ్చటం కన్నా ప్రశ్నించటం మంచిది అనుకుంటే, ప్రశ్నించే గుణం ,తత్వం ఈ రచయిత్రి కి ఈ రచయిత్రి సృష్టించిన అనేక పాత్రలకు పుష్కలంగా ఉన్నాయి.*అన్నీ మరిచిపోయి మనిషి
సంభాషణ

అక్షరాలపై నిషేధం ఆలోచనలపై నిషేధమే

అక్షరాలపై నిషేధం ఆలోచనలపై నిషేధమే.అక్షరాలను బంధించడం అంటే ఆలోచనలను బంధించడం. సృజనాత్మకతను బంధించడం. వర్తమానాన్ని కాదు భవిష్యత్తును బంధించడం. అక్షరాల పై ఆలోచనలపై సృజనాత్మకత పై నిషేధం ఎప్పుడూ మంచిది కాదు. వర్తమాన ప్రపంచంలో అనేక సామాజిక సంక్షోభాలను అందుకు కారణాలను కారకాలను తక్షణం గుర్తించాల్సిన ప్రస్తుత తరుణంలో, సమానత్వం కోసం స్వేచ్ఛకోసం మానవీయత కోసం మెరుగైన మానవ సంబంధాల కోసం, మానవ హక్కుల కోసం మనం సృజనకారులను కాపాడుకోవాల్సి ఉంది.మెరుగైన సమాజం కోసం  మెరుగైన ఆలోచనలను విస్తృత పరచి, నిష్పాక్షిక దృష్టితో వాస్తవాలను వాస్తవాలుగా గ్రహించాల్సి ఉంది. గడిచిన 50 సంవత్సరాల కాలంలో వచ్చిన విస్తృతమైన సాహిత్యం, పాటలు
కాలమ్స్ కథావరణం

“దుఃఖానికి ఆసరా మనిషే!-అంటున్న కథ

ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. మనిషి లోపలి ఒంటరితనాల గురించి, బాహ్యప్రపంచంలో మనిషి ఎదుర్కొనే  ఒంటరితనాల గురించిన కథలు మనల్ని కల్లోల పరుస్తాయి. కలవర పెడతాయి. అప్పటిదాకా రాని ఆలోచనలు ఇలాంటి కథలు చదివితే కొత్తగా పుట్టుకు వస్తాయి. ఏవో ఖాళీలు, ఏవో అంతరాలు, మరేవో అడ్డుగోడలు ఒక్కసారిగా కథలో కనిపిస్తాయి. అవన్నీ అంతకు ముందు మనం చూసినవే, అయినా చూసినా  నిజంగా చూడలేనివి. అప్పటిదాకా చూసినదాన్నే, చూసినా చూడలేని దాన్నే కొత్తగా చూపించేవే మంచి కథలు. నడవడం స్థానంలో పరిగెత్తడం మొదలయ్యాక వేగం పెరిగాక, మనుషులకు దూరంగా మనుషులు కదలటం మనుషులు దూరంగా మనుషులు వెళ్లిపోవడం చాలా