అక్షరాలపై నిషేధం ఆలోచనలపై నిషేధమే.అక్షరాలను బంధించడం అంటే ఆలోచనలను బంధించడం. సృజనాత్మకతను బంధించడం. వర్తమానాన్ని కాదు భవిష్యత్తును బంధించడం. అక్షరాల పై ఆలోచనలపై సృజనాత్మకత పై నిషేధం ఎప్పుడూ మంచిది కాదు.
 వర్తమాన ప్రపంచంలో అనేక సామాజిక సంక్షోభాలను అందుకు కారణాలను కారకాలను తక్షణం గుర్తించాల్సిన ప్రస్తుత తరుణంలో, సమానత్వం కోసం స్వేచ్ఛకోసం మానవీయత కోసం మెరుగైన మానవ సంబంధాల కోసం, మానవ హక్కుల కోసం మనం సృజనకారులను కాపాడుకోవాల్సి ఉంది.మెరుగైన సమాజం కోసం  మెరుగైన ఆలోచనలను విస్తృత పరచి, నిష్పాక్షిక దృష్టితో వాస్తవాలను వాస్తవాలుగా గ్రహించాల్సి ఉంది.


గడిచిన 50 సంవత్సరాల కాలంలో వచ్చిన విస్తృతమైన సాహిత్యం, పాటలు ఇదంతా ఒక చరిత్ర. భాషలకు అతీతంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా కొనసాగుతున్న ఒక సజీవ నదిని ఆపలేం. ఇది ఒక నిత్య ప్రవాహం. ఇది ఒక నిరంతర ప్రయాణం.

Leave a Reply