పోతూ పోతూ కూడా..
.. ఈసారి ఆయన అధికారంలోంచి దిగిపోతాడనే అంటున్నారు. ఎప్పటి నుంచో పరిశీలకులు చెబుతూనే ఉన్నారు. ఎగ్జిట్ పోల్ అంచనాల్లో అవే కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు అవకాశం ఉందా? ప్రజా సమస్యల ప్రచారానికి, పరిష్కారానికి గతంలోలాగా కనీసంగా అయినా ఇప్పుడు ఎన్నికలు ఉపయోగపడతాయా? లేక ఎప్పటిలాగే వంచనలు, ప్రలోభాలు, ఓట్ల కొనుగోళ్లు .. ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయా? ఎన్నికల ఎత్తుగడవాదుల ప్రయత్నాలు ఓట్ల ఫలితాలను కనీసంగా అయినా ప్రభావితం చేస్తాయా? అని ఎంత విశ్లేషణ అయినా ఇవ్వవచ్చు. కాకపోతే పదేళ్ల నియంతృత్వ పాలన మీద ఈ ఎన్నికల సమయంలో కూడా తెలంగాణ పదునైన విమర్శను వినిపించింది. ఎన్నికల రాజకీయాల్లో