కాలమ్స్ సమకాలీనం

సైన్స్ పరిశోధనా సంస్థకు ఫాసిస్టు పేరా!

ప్రపంచంలో చాలా దేశాలలో ఆయా రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారి పేర్లను సాధారణంగా వారి మరణానంతరం ఆయా సంస్థలకో లేదా మరో రంగానికో వారి పై గౌరవంతోనో వారికి గుర్తింపు గానో పెట్టడం జరుగుతుంది. భారతదేశంలోను ఆ ఆనవాయితి కొనసాగుతున్నది. పాలక వర్గాలు మారినప్పుడల్లా వారి భావజాల ప్రతినిధుల పేర్లను ఎక్కడో ఒక చోట తగిలించడం అలవాటు చేసుకున్నారు. ప్రజాజీవితంలో ఉండి వారి ప్రయోజనాలకు పాటుబడిన వారిని అలా గుర్తుంచుకోవాలంటే పేచీ ఏమి ఉండదేమో గాని మొత్తంగా వారి జీవితకాల ఆచరణకు పొసగని లేదా విరుద్ధమైన రంగాలకు వారి పేరు పెట్టడం చాలా కాలం క్రితమే మొదలయింది.