“సాహిత్య సమాజ సంబంధాల విశ్లేషణ కె.వి కూర్మనాథ్ కథలు”
జీవితాలు ఉద్యమాలే కాదు మరణాలు కూడా మనకు చాలా పాఠాలు చెబుతాయి. జీవితం కన్నా మరణం చాలా గొప్పది. విప్లవకారుడి, ఉద్యమకారుడి మరణం ఒక చరిత్ర. అంతులేని గాయాలు అంతు తెలియని సత్యాలు, ఎన్నో అనుభవాలు వైఫల్యాలు పోరాటాలు విజయాలు వ్యధలు దుఃఖాలు ఇవన్నీ కలగలిసిన చరిత్ర ఒక వీరుడి మరణం. ఒకానొక చారిత్రక సందర్భంలో ఇక్కడ నిలబడి వెనుదిరిగి చూసుకుంటే, ఉద్యమం వెనుక కారణాలు, ఉద్యమం బలపడిన సందర్భాలు, ఉద్యమం బలహీన పడిన సందర్భాలు, ఆటుపోట్లు వెన్నుపోట్లు ఆంక్షలు నిర్బంధాలు అణచివేతలు, వ్యక్తులు అదృశ్యం కావడం, మనుషులు శవాలుగా మారటం, శవాలు కూడా కనిపించకుండా పోవడం.. అనేక